మా లద్దాక్పై పాకిస్తానీలు దాడి చేసేందుకు వస్తున్నారు. మా భూమిని కాపాడుకుంటాం, అవకాశమివ్వండి అన్నాడో కుర్రాడు. అతడి కళ్ళలో ఒక పట్టుదల...
మా లద్దాక్పై పాకిస్తానీలు దాడి చేసేందుకు వస్తున్నారు. మా భూమిని కాపాడుకుంటాం, అవకాశమివ్వండి అన్నాడో కుర్రాడు. అతడి కళ్ళలో ఒక పట్టుదల కనిపించింది. అతడే రెండుసార్లు మహావీర చక్ర గెలుచుకున్న ఏకైక సైనికుడు షెవాంగ్ రించెన్.
1947లో పాకిస్తాన్ మన జమ్మూకశ్మీర్ ను కబళించేందుకు ప్రయత్నించినప్పుడు లద్దాక్ను కాపాడేందుకు వచ్చిన మేజర్ పృథుచందోను షెవాంగ్ రింఛన్ కలిశాడు. పింఛన్ శ్యాక్, నుబ్రా నదులు కలిసే చోట ఉన్న సుముర్ గ్రామానికి చెందినవాడు. కానీ పదమూడేళ్ల వయసులోనే లేహ్ కి చదువుకునేందుకు వచ్చాడు. ఆ తరువాత సరిగా నాలుగేళ్లకి దేశవిభజన జరిగింది. కశ్మీర్ ను కబళించేందుకు పాకిస్తాన్ కుట్ర పన్నింది. ఆ సమయంలో రింఛన్ భారత సైన్యంలో చేరాడు. రించెన్ మిత్రులు మరో 28 మంది కూడా సైన్యంలో చేరారు. కొద్దిరోజుల శిక్షణతో రింఛెస్, ఆయన మిత్రులు యుద్ధానికి సిద్ధమయ్యారు. వీరంతా నుబ్రా లోయలో మొహరించారు. సుత్రా లోయ లేకి 140 కిమీ.ల దూరంలో ఉంది. ఇక్కడ నుంచి లద్దాక్ ప్రాంతపు కేంద్రానికి చేరాలంటే ప్రపంచంలోనే ఎత్తైన వాహనయోగం ఊడు. ఖార్డుంగ్లా దాటాలి. ఖార్డుంగ్లా 5602 మీటర్ల ఎత్తున ఉంటుంది.
ఖార్డుంగ్లా నుంచే థోయిస్ ఎయిర్ ఫీల్డ్ కి వెళ్లాల్సి ఉంటుంది. అటు చైనాతో, ఇటు పాకిస్తాన్తో యుద్ధం చేయటానికి ఇది ముఖ్యమైనది. నిజానికి 'థోయిస్' గ్రామం పేరు కాదు. 'ట్రాన్సిట్ హాల్ట్ ఆఫ్ ఇండియన్ సోల్డర్స్ ఎన్ రూట్' అన్న పదంలోని మొదటి అక్షరాలను కలిపి థోయిస్ అన్న పేరు పెట్టారు. వీటన్నిటినీ కాపాడే బాధ్యత రింఛన్ పై పడింది. వీరు లేహను, నుబ్రా లోయను పాకిస్తానీల నుంచి కాపాడుకున్నాడు. ఈ పోరాటంలో అసమాన శౌర్య సాహసాలను ప్రదర్శించారు. షెవాంగ్ రింఛెస్ చూపించిన నేతృత్వానికి, ప్రాణాలకు తెగించి చేసిన పోరాటానికి భారత ప్రభుత్వం అతనికి మహావీరచక్ర ప్రదానం చేసింది. ఈ పోరాటం తరువాత 'సు రక్షకుడు' అంటూ రింఛన్ ను ఊరు ప్రజలు పిలవనారంభించారు. ఆయన సాహస కృత్యాలను కథలు కథలుగా చెప్పుకున్నారు. ఆయనకథ అక్కడితో ఆగలేదు.
చెనా 1962లో భారత్ పై యుద్ధానికి దిగి, భారత్ అంతర్భాగమైన అక్షయ్ చీన్ను ఆక్రమించింది. లలాటి ఈ భాష దికన ఉన్న పొలతిజీ ఓఖీ స్తావరాన్ని సర్వశక్తులు ఒడ్డి కాపాడాడు రింఛన్. ఈ పోరాటంలో ఆయన చూపిన సాహసానికి సేవా పతకం లభించింది. ఆ తరువాత 1971 యుద్ధంలో మరోసారి రింఛన్ తన పోరాట పటిమను ప్రదర్శించాడు. అప్పటికి అతని వయస్సు 40 ఏళ్ళ నడివయసులోకి వచ్చాడు. కానీ తన సొంత భూమి జమ్మూ కశ్మీర్లోని లద్దాక్ ప్రాంతాన్ని కాపాడుకునే విషయంలో మాత్రం తూటాలకు భారీ ఎదురొట్టేందుకు సిద్దం అయ్యాడు. 1969లో ఆయనను 14 జమ్మూ కశ్మీర్ రైఫిల్స్లో చేర్చి, సుబ్రాలోనే నియమించారు.
రించెన్ 550 మంది స్థానిక లద్దాక్ యువకులతో ను గార్డ్స్ అన్న దళాన్ని ఏర్పాటు చేశారు. పోటికి సైనిక శిక్షణను పదిహేనురోజుల పాటు ఇచ్చారు. మొత్తం లేహ్, సుబ్రా లోయలను కాపాడానికి తమకు అదనపు బలగాలు అక్కర్లేదని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పారు, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని టద్దుక్ ప్రాంతంలో 800 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని కూడా గెలుచుకొడాడు 1948 తరువాత పాకిస్తాన్ నుంచి మనం సాధించుకున్న ఏకైక భూభాగం ఇదే, టరుకిను గెలుచుకున్నందుకు రింఛనడు రెండోసారి మహావీర్ చక్ర పతకం లభించింది. ఇలా 'మహావీర్ చక్ర' రెండుసార్లు గెలుచుకున్న ఏకైక సైనికుడు షెవాంగ్ రించెన్, భారత సైన్యం ఆయనకు కల్నల్ గా పదోన్నతిని కల్పించింది. లేహ్లోని ఒక వీధికి ఆయన పేరు పెట్టారు. 1997లో కార్గిల్ యుద్దానికి ఒక ఏడాది ముందు ఆయన చనిపోయాడు.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia
No comments