సుధాంశు బిస్వాస్ వృద్ధాప్యం వచ్చినా ఆయనలోని విప్లవోత్తేజం ఏమాత్రం కొడిగట్టలేదు. స్వాతంత్ర్య సమరయోధుడైన 98 ఏండ్ల సుధాంశు బిస్వాస్ క...
సుధాంశు బిస్వాస్ వృద్ధాప్యం వచ్చినా ఆయనలోని విప్లవోత్తేజం ఏమాత్రం కొడిగట్టలేదు. స్వాతంత్ర్య సమరయోధుడైన 98 ఏండ్ల సుధాంశు బిస్వాస్ కేవలం పద్మశ్రీ అవార్డు స్వీకర్తమాత్రమే కాదు. ఆయనది పెద్ద కథే ఉంది. బిస్వాసను కలుసుకోవటమంటే స్వాతంత్ర్య పూర్వ యుగంలోకి వెళ్ళి నాటి సమరగాధను తిరిగి అనుభవంలోకి తెచ్చుకోవటమే.
కలకత్తాలో ఇంగ్లీషు జడ్జిమీద కాల్పులు జరపడం మొదలు ఫోర్ట్ విలియమ్స్ పై బాంబుదాడికి విఫలయత్నం చేయటం వరకు ఈ విప్లవవీరుడి ప్రజ్వలించే అవతారం గురించి ఎన్నో కథలు మనకు తెలుస్తాయి. సుందర్ బన్స్లో అనాధల కోసం విశిష్టమైన ఆశ్రమాల నిర్మాణంతో సహా ఆయన చేసిన సమాజసేవకు పద్మశ్రీ పురస్కారం లభించింది. కాని బిస్వాస్ దీనికోసం నేను దిల్లీ దాకా ప్రయాణిం చాలా? అని ఒకింత అనాసక్తి కనబరుస్తాడు. తెల్లవారుఝామున 5 గం||లకు ధ్యానంతో ఆయన రోజు ప్రారంభమవు తుంది.
తన సమయంలో అధికభాగం ఆయన తన ఆశ్రమంలోని 50 మంది అనాధ బాలులతో గడుపుతారు. 39 ఎకరాలలో విస్తరించిన ఈ ఆశ్రమంలో కుట్టుపనీ, మొబైల్ రిపేరింగు, ఎలక్ట్రికల్ పనులు నేర్పుతారు. అంతేగాక స్థానిక సేవలకై రెండు అంబులెన్సులు నిర్వహిస్తున్నారు. ఆశ్రమ కేంద్రంలోని ఒక పెద్ద సరస్సులో చేపలను పెంచుతున్నారు. విప్లవం గురించి, శ్రీ అరవిందుల గురించి ప్రస్తావన వచ్చిందంటే ఆయనలో ఒక ఆవేశం పెల్లుబుకుతుంది. మేము పోరాడింది ఇలాంటి భారత్ కోసం కాదు.
భారతీయులు స్వాతంత్ర్యపు అర్ధాన్ని నిలుపుకోలేకపోవచ్చునని స్వామి వివేకానంద భయపడుతుండేవాడు అన్నారు. బ్రిటిషువారి వలసపాలనలో తాను ఆలిపూర్ జిల్లా జడ్జిమీద తుపాకి పేల్చిన విషయం బిస్వాస్ చెబుతూ ఆయన మెట్లమీద నుండి దొర్లిపడ్డాడు. ఆయన జేబులో ఒక నోట్ బుక్ ఉండటంతో అదే అతడిని కాపాడింది అన్నాడు. తర్వాత ఫోర్డ్ విలియం మీద బాంబుదాడికి ప్రయత్నించినందుకు బిస్వాస్ అరెస్టయినాడు. విప్లవోద్యమ దినాలను ప్రక్కనబెట్టి స్వాతంత్ర్యానంతరం బిస్వాస్ ఒక కర్మాగారం నెలకొల్పాడు.
పాకిస్తానీ శక్తుల అత్యచారాలనుండి తప్పించుకోవడానికి బెంగాలకు తరలి వచ్చిన తూర్పుపాకిస్తాన్ శరణార్థులకు తన కర్మాగారంలో ఉద్యోగాలు కల్పించాడు. నవతరం రాజకీయవాదులను ఆయన అపహసిస్తాడు. వాళ్ళు కేవలం రాజకీయ లబ్దికోసమే పనిచేస్తారని ఆయన అభిప్రాయం.
No comments