Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

బ్రతికొచ్చిన మేజర్ ధన్ సింగ్ థాపా పరమవీర చక్ర

లడాఖ్లో చైనా కదలికలను పసిగట్టిన పిదప భారత్ ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్పోస్టు సిరిజాప్1. 28 మంది సైనికులతో నామమాత్రంగా ఏర్పాటు చేసిన ఆ పోస...


లడాఖ్లో చైనా కదలికలను పసిగట్టిన పిదప భారత్ ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్పోస్టు సిరిజాప్1. 28 మంది సైనికులతో నామమాత్రంగా ఏర్పాటు చేసిన ఆ పోస్ట్ లో విధులు నిర్వర్తిస్తున్నారు ధన్సింగ్ థాపా. తొలిసారి పురిటిలో బిడ్డని కోల్పోయిన థాపా రెండవ కాన్పు సమయంలో భార్యకి తప్పక తోడుగా ఉంటాను' అని వాగ్దానం చేశారు. సెలవు కూడా మంజూరైంది. అయినా, మనసు ఏదో కీడు శంకించి, ఇంటికి వెళ్ళకుండా ఉండిపోయాడు థాపా.

అతని అనుమానం నిజమైంది. సరిహద్దు ఆవల శతృసైన్యం హడావిడి పెరిగింది. ఇది ప్రమాదకర పరిణామం. ఏ క్షణంలో అయినా దాడి జరగవచ్చు అనుకున్నాడు థాపా. జట్టుతో సమావేశమయ్యాడు. మనం 28 మందిమి మాత్రమే. కాని ఒక్కో గూర్గా 10 మంది శతృవుల కంటే ఎక్కువ అన్నది మరవద్దు' అన్నాడు. 170 ఏళ్ళ చరిత్ర గల గూరా రెజిమెంట్ కి ఇలాంటి సందర్భాలు కొత్తకాదు.

1962, అక్టోబరు 20 ఉదయం ఆరు గంటలకు భారీ పేలుడు సంభవించింది. ఒక్కో బంకరీను ధ్వంసం చేస్తున్నాయి శతృ శతఘ్నులు, రెండు, గంటల నిర్విరామ దాడి తరువాత చాలామంది భారత సైనికులు గాయపడ్డారు. కొందరు మరణించారు. 'మీరు యుద్ధాన్ని విరమించి వెనక్కి రండి' రేడియో ద్వారా పై అధికారుల సందేశం అందింది. 'క్షమించండి ! ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గను, లొంగిపోను' సమాధానం ఇచ్చాడు థాపా. నాగాలాండ్లో విధులు పూర్తి చేసుకుని 20వ పడిలో ఉన్న సైనిక ఆఫీసర్ గా కోరి లడాఖ్ లో పోస్టిగ్ వేయించుకున్నాడు ధన్సింగ్ థాపా.

భారత సైన్యం వద్ద పురాతన 303 రైఫిల్స్ ఉండగా చైనా సైనికుల వద్ద అధునాతన ఆటోమేటిక్ యుద్ధ సామగ్రి ఉంది, జట్లు జట్లుగా వచ్చి దాడి చేస్తోంది చైనా సైన్యం. ఈ సారి భారీ జట్టు వస్తోంది. మన దగ్గర మందు గుండు చాలా తక్కువ. ఒక్కో ఇల్లెటికు ఒక్కో శత్రువు నేలకొరగాలి. చాలా స్పష్టంగా చెప్పాడు థాపా, అప్పటికే భారత సైనికుల వద్ద యుద్ద సామగ్రి అయిపోవస్తోంది. మృతి చెందిన చైనా సైనికుల నుండి ఆయుధాలు తెచ్చుకుని యుద్ధం చేస్తున్నారు భారత గూర్భాలు, ఇంతలో చైనా శతఘ్నుల దాడికి దిగింది. కిలోమీటర్ దూరం వరకు నల్లటి పొగ కమ్ముకుంది. చుట్టుముట్టారు చైనా సైనికులు, భుక్రితో దాడి చేస్తూ శత్రు సంహారం చేస్తుండగా థాపా తలపై తగిలింది చైనా రైఫిల్ మడమ. నేలకొరిగాడు థాపా.

అతని వీరోచిత పోరాటానికి పురస్కారంగా మరణానంతరం పరమవీర చక్ర ప్రకటించింది. భారత ప్రభుత్వం. అతని భార్య శుక్లా ఈ వార్తను నములేదు. తన భర జీవించే ఉన్నాడని ఆమె నమ్మకం. అలానే వాదించేది. ఇంతకీ అతని శరీరం దొరక లేదు. అయినా సాంప్రదాయం ప్రకారం అతని కుటుంబ సభ్యులు అతని అంత్య క్రియలు నిర్వహించేశారు.
కానీ వాస్తవం మరోలా ఉంది. సైనిక రహస్యాలు, ఆయుధాగారాల వద్ద వ్యూహాలు, రహస్యాలు తెలుసుకోడానికి థాపాను ఇందీగా తీసుకువెళ్ళారు. చైనీయులు. నువ్వు గూర్కా. మనం మనం ఒకటి, మాతో సహకరించు. అని నానా విధాలుగా థాపాను ప్రలోభ పెట్టారు చైనా సైన్యాధికారులు, కాపా లొంగలేడు. చిత్రహింసలు పెట్టారు. 'కంఠంలో ప్రాణం ఉండగా దేశానికి ద్రోహం చేయను' అని కరాఖండిగా చెప్పాడు థాపా, తన కోసం ఆహారం తెచ్చే ఎనిమిదేళ్ళ పిల్లాడితో స్నేహం చేశాడు. వారి మధ్య స్నేహం బాగా విలపడింది, తన పరిస్థితిని తెలుపుతూ తన మేనమామకి ఉత్తరం రాశాడు. థాపా ప్రయత్నం ఫలించింది. భారత సైన్యాధికారులకు సమాచారం వెళ్ళింది, దౌత్యపరమైన సంప్రదింపుల తరువాత భారత్ చేరాడు. థాపా, ఆ తరువాత ప్రతి ఏడాది జనవరి 26న క్రమం తప్పకుండా భారత గణ తంత్ర దినోత్సవాలకు హాజరైన థాపా 2005, సెప్టెంబరు 5న తన 77వ ఏట స్వర్గస్తుడయ్యాడు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments