Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

పిట్టతో డేగల్ని గెలిచిన పరమవీర చక్ర నిర్మల్ జీత్

పిట్టతో డేగల్ని గెలిచిన నిర్మల్ జీత్. 1971లో పాకిస్తాన్ భారత్ పై దాడి చేసింది. కశ్నీరంపై కన్నేసింది. కశ్మీరాన్ని గెలవాలంటే శ్రీనగర్ విమానాశ...

పిట్టతో డేగల్ని గెలిచిన నిర్మల్ జీత్. 1971లో పాకిస్తాన్ భారత్ పై దాడి చేసింది. కశ్నీరంపై కన్నేసింది. కశ్మీరాన్ని గెలవాలంటే శ్రీనగర్ విమానాశ్రయంపై విమాన దాడులు చేస్తే భారత సైన్యం కదలలేదు. భారత్ దెబ్బ తింటుంది. ఇదీ పాకిస్తాన్ వ్యూహం. శ్రీనగర్ విమానాశ్రయంపై దాడి మొదలైంది. ప్రతి మనిషి జీవితంలోనూ ఒక క్షణం వస్తుంది. ఆ క్షణంలో ముందుకురికితే అతను హీరో, ఆ క్షణంలో ఆగిపోతే అతను జీరో, నిర్మల్ జీత్ సింగ్ సెఖన్ జీవితంలోనూ ఆ క్షణం వచ్చింది. నిర్మల్ కు అత్యంత ప్రియమైన జమ్మూ కశ్మీర్ మనుగడ ముప్పులో ఉంది. నిర్మల్ ముందుకురికాడు.
Image result for param vir chakra nirmaljit singh
నిర్మల్ జీత్ ది పంజాబ్. పల్లెటూరు. ఇల్లంతా వ్యవసాయ వాతావరణం. ఎయిర్ ఫోర్స్లో చేరాడు. శిక్షణ పొందాడు. మన విమానాలు చిన్నవి. పాతబడి పోయాయి. గ్నాట్ విమానం ఓ చిన్న పిట్టలాంటి విమానం. నిర్మల్ జీతికి గ్నాట్ అంటే ఎంతో ఇష్టం. దానిలో ఆకాశంలో ఎగరడం ఇంకా ఎంతో ఇష్టం.
ఇటు శ్రీనగర్లో ఉన్న వైమానిక దళం 18వ స్క్వాడ్రన్ పాక్ దాడిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. స్కాంబుల్ అన్న ఆదేశం రాగానే ఎగిరేందుకు సిద్దంగా ఉండాలి. అందులో నిర్మల్ జీత్ స్టాండ్ బై టూలో పెట్టారు. స్టాండ్ బై టూ అంటే ప్ర్కొంబుల్ ఆదేశం వచ్చిన రెండంటే రెండు నిమిషాలకు గ్నాట్ విమానాలు ఆకాశంలోకి ఎగరాలి.
డిసెంబర్ 14. తెలతెలవారుతూండగానే ఆరు పాక్ శబర్ జెట్ విమానాలు భారత గగన తలంలోకి ప్రవేశించాయి. శబర్ జెట్లు అత్యాధునికమైనవి. అమెరికా పంపినవి. ఆ రోజుల్లో నంబర్ వన్ విమానాలుగా పేరొందాయి. పాక్ విమానాలు శ్రీనగర్ చేరువలోకి రాగానే భారత వైమానిక దళానికి సమాచారం వచ్చింది. శబర్ జెట్లు శ్రీనగర్ పై దాడులు చేసేందుకు కిందకి దిగుతూండగా రెండంటే రెండు నిమిషాల్లో నిర్మల్ జీత్ గ్నాట్ విమానం ఆకాశంలోకి ఎగసింది. విమానం గాలిలోకి ఎగుస్తూండగానే పాకిస్తానీ శబర్ జెట్లు రెండు బాంబులు విమానాశ్రయం పై వేశాయి. ఒకటి టేకాఫ్ చేస్తున్న నిర్మల్ జీత్ విమానానికి అతి చేరువలో పడింది. కానీ క్షణం తరువాత డేగను పిట్ట వేటాడినట్టు భారీకాయం గల శబర్ జెట్లను పిట్టలాంటి నిర్మల్ జీత్ గ్నాట్ వేటాడింది.
'చోడూంగా నహీ' అన్న మాట నిర్మల్ జీత్ గ్నాట్లోని రేడియో సెట్ నుంచి వెలువడింది. క్షణాల్లో నాలుగు పాకిస్తానీ శబర్ జెట్లు నిర్మల్ జీత్ గ్నాట్ ను చుట్టుముట్టాయి.
నిర్మల్ జీత్ విమానం నుంచి సంధించిన బాంబులు రెండు శబర్ జెట్లను కుప్ప కూల్చాయి. అసాధ్యం అనుకున్నది అవలీలగా చేశాడు నిర్మల్ జీత్, ఆకాశంలోని ఈ డాగ్ ఫైట్ ని అందరూ అచ్చెరువొందేలా చూస్తూండగానే మిగిలిన శబర్ జెట్లు తోకముడిచి పరుగులు తీశాయి. పారిపోతున్న శత్రువును చూసి నిర్మల్ జీత్ మీసం మెలేశాడు.
అంతలో ఒక గుండు నిర్మల్ జీత్ గ్నాట్ కి తగిలింది. కొద్ది క్షణాల తరువాత విమానంతో పాటు నేలకూలాడు.
ఆ క్షణం నిర్మల్ జీత్ సింగిదే. నేలకూలిన శత్రు విమానాలను, తోక ముడిచిన శబర్ జెట్లను చూస్తూ కన్నుమూశాడు నిర్మల్ జీత్.
నిర్మల్ జీత్ ప్రాణాలను అర్చించి కశ్మీర్ ను కాపాడుకున్నాడు. పాకిస్తాన్ మళ్లీ వైమానిక దాడికి సాహసించలేదు. రెండంటే రెండు రోజుల తరువాత పాకిస్తాన్ యుద్ధంలో ఓడి, 90 వేల మంది పాక్ సైనికులు యుద్దబందీలుగా భారత్ చేతిలో చిక్కారు. పాక్ అత్యంత అవమానకరమైన పరిస్థితిలో తలదించుకుంది. నిర్మల్ జీత్ సింగ్ సెఖస్ చూపిన అత్యంత ధైర్య పరాక్రమాలకు, ప్రాణాలొడ్డి దేశ రక్షణ చేసిన వీరోచిత సాహసానికి దేశం శ్రద్ధాభక్తులతో ఆయనకు తలపంచింది. ఆయనకు మరణానంతరం పరమవీర చక్ర ప్రదానం చేసి, తనను తాను సన్మానించుకుంది. వైమానిక దళం నుంచి ఏకైక పరమవీర చక్ర అదే.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments