Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

లడాఖ్ రక్షకుడు షేర్ జంగ్ థాపా

లడాఖ్ రక్షకుడు షేర్ జంగ్ థాపా. కాశ్మీర్ రాజ్యంలో జమ్మూ కశ్మీర్, లడాఖ్, గిల్గిత్ పజారత్, గిల్గిత్ అని అయిదు భాగాలు. మహారాజు 1947 లో తనరాజ్యా...

లడాఖ్ రక్షకుడు షేర్ జంగ్ థాపా. కాశ్మీర్ రాజ్యంలో జమ్మూ కశ్మీర్, లడాఖ్, గిల్గిత్ పజారత్, గిల్గిత్ అని అయిదు భాగాలు. మహారాజు 1947 లో తనరాజ్యాన్ని భారత్లో విలీనం చేయగా ఆయన సైన్యంలోని ముస్లింలు తిరుగుబాటు చేసి పాకిస్తాన్ లో కలిసిపోయారు. పాకిస్తాన్ భారత్ పై దురాక్రమణకు దిగింది.
జమ్మూను కశ్మీర్తో కలపడంలో అత్యంత కీలకమైన పూంఛను పాక్ సేనలు చేజిక్కించుకున్నాయి. మరోవైపు లదాఖ్ తో కలిపే గిల్గిత్ బలిస్తాన్ ను చేజిక్కించుకున్నారు. జమ్మూ కశ్మీర్ రక్షణకు, యావద్భారత రక్షణకు ఈ రెండూ అత్యంత కీలకం. లడాఖ్ ను కాపాడాలంటే కార్గిల్ కు ఆవల నలభై కిలోమీటర్ల దూరంలోని స్కర్టు నగరాన్ని కాపాడాలని అప్పటి సైనికాధికారి జనరల్ తిమ్మయ్య నిర్ణయించారు. ఆ పనిని జమ్మూ కశ్మీర్ రాష్ట్ర భద్రతాదళాలలో మేజర్గా పనిచేస్తున్న షేర్ జంగ్ థాపాకి అప్పగించారు. భాషా పుట్టుకతో గూర్ఖా. ప్రపంచ యుద్ధాల్లో పాల్గొన్న అనుభవం ఆయనది.

థాపా స్కర్టులో ఉన్న సైనికులకు నాయకుడిగా లదాఖ్ నుంచి వెళ్లారు. నవంబర్ 28న కాలినడకన బయలుదేరి, 1947 డిసెంబర్ 2 నాటికి సర్లు చేరుకున్నారు. ప్రయాణమంతా మంచు తుఫాను మధ్యలోనే. చలి తగ్గగానే పాకిస్తాన్ దాడి జరుగుతుందని ఊహించి, థాపా తన సైనికులను , అప్రమత్తం చేశారు. ఆహార నిల్వలను సేకరించుకున్నాడు. భారత సైన్యాలు స్కర్టు చేరేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. విమానాల ద్వారా ఆహారం అందించే ప్రయత్నాలు ఫలించలేదు.
1948, ఫిబ్రవరి 11న పాకిస్తాన్ దాడి ప్రారంభమైంది. కేవలం నూట యాభై మంది సైనికులతో షేర్ జంగ్ థాపా వీరోచితంగా పోరాడాడు. ఏకంగా ఆరు నెలల పాటు ముట్టడిలో ఉన్నా థాపా ధైర్యాన్ని విడువలేదు. పోరాటం కొనసాగుతూనే ఉంది. సుర్లు కోటకు ముందున్న చెక్ పోస్టుల్లో ఒకదానికి నాయకత్వం వహిస్తున్న క్యాప్షన్ నేక్ ఆలమ్ శత్రువుతో కలిసిపోయాడు. మరో పోస్టులోని సైనికులందరినీ పాకిస్తానీలు కిరాతకంగా ఊచకోత కోశారు, శత్రువు ముందుకు చొచ్చుకు వస్తున్నాడన్న సంగతిని బిస్కెట్ కాలమ్ అన్న రహస్య నామం ఉన్న సైనిక దళం నుంచి థాపా తెలుసుకున్నాడు. ఆ మరుసటి రోజే శత్రువుతో పోరాడుతూ బిస్కెట్ కాలమ్ బలిదానం చేసింది.
మార్చి 18 నుంచి ఏప్రిల్ 10 వరకు నాయబ్ సుబేదార్ పాల్ సింగ్, అజిత్ సింగ్, ఛత్రు వంటి సైనికులు శత్రువును నిలువరించారు. బయట నుంచి ఎలాంటి సాయమూ అండకపోయినా, ఆరు నెలల పాటు శత్రువును నిలువరించడం అసామాన్యమైన విషయం. ఇది షేర్ జంగ్ 4 థా సాహసోపేత నాయకత్వం ద్వారానే సాధ్యమైంది. చివరికి ఆహార పదార్థాలు కూడా అయిపోయాయి. సైన్యం పోరాడే స్థితిలో లేదు, గ్యారిసన్లో ఉన్న మహిళలు పాకిస్తానీల బారిన పడకుండా ఉండేందుకు ఆత్మహత్యలు చేసుకోవడం ప్రారంభించారు. చివరికి ఏమీ చేయలేని స్థితిలో 1948, ఆగస్టు 14న షేర్ జంగ్ థాపా శత్రువుకు లొంగిపోవాల్సి వచ్చింది. అతని సైనికులను చాలామందిని పాకిస్తానీలు ఊచకోత కోశారు. కానీ షేర్ జంగ్ థాపాను మాత్రం చంపలేదు, ఆంగ్లేయుడైన పాక్ సైనికాధికారి గ్రేసీకి థాపా పట్ల ఉన్న అభిమానం వల్లే ఆయనను చంపలేదు. థాపా చేసిన పోరాటం లదాఖ్, కార్గిల్, లేహ్, చాంగ్ థాంగ్, జన్ స్కార్, సుబ్రా లోయలను పాకిస్తాన్ చేజిక్కుకుండా చేసింది.
తరువాక షేర్ జంగ్ వీరోచిత పోరాటానికి గుర్తుగా భారత ప్రభుత్వం ఆయనకు మహావీర చక్రను ప్రదానం చేసింది, ఆయన బ్రిగేడియర్గా పనిచేసి, రిటైర్ అయ్యారు. ధర్మశాలలో ఆయన పేరు మీద నేడు ఒక పార్కు ఉంది. థాపా చేసిన ధీరోదాత్త పోరాటం వలే ఈ రోజు అయ్యాక్ ప్రాంతం మన చేతుల్లో ఉంది, యావద్భారతం అనునిత్యం స్మరించుకోదగిన మహావీరుడు షేర్ జంగ్ థాపా.

No comments