ప్రపంచం మొత్తం గత దశాబ్దం లో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నప్పటికీ భారత్ మాత్రం అలాంటి సంక్షోభాలు ఎప్పుడూ చవి చూడలేదు ఎందుకంటే. భారతీయ...
ప్రపంచం మొత్తం గత దశాబ్దం లో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నప్పటికీ భారత్ మాత్రం అలాంటి సంక్షోభాలు ఎప్పుడూ చవి చూడలేదు ఎందుకంటే. భారతీయ మహిళ పొదుపులో మొదటి వరుసలో ఉంటారు. మనం కూడా చూస్తుంటాము మన అమ్మ నాన్నకు తెలీకుండా పోపుల డబ్బాలో డబ్బు దాస్తుంది అవసరం అయినప్పుడు ఎక్కడనుండి డబ్బులు తెస్తుందో కూడా తెలియదు యజమానికి అలా దాచి పొదుపు చేస్తుంది భారతీయ మహిళ.
అలాంటి ఒక మహిళ తన ఆలోచనా పరిధి పెరగడం వలన పదిమందికి ఉపయోగపడే ఒక యోజన చేసి తమిళనాడు లో అభివృద్ధి సాధించింది ఆమెను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2019 లో పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది ఆమే మధురై చిన్న పిళ్ళై.
తమిళనాడు రాష్ట్రం మదురైలోని చిన్న ఊరు మదురై చిన్న పిళ్లైది. అరవై ఏడేళ్ల పిళ్లై తమ ప్రాంతంలోని పేదరికాన్ని రూపుమాపడానికి, మహిళా సాధికారతతో రుణ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు పటిష్ఠమైన బ్యాకింగ్ వ్యవస్థను ప్రారంభించారు. ధన్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా ‘కలానిజమ్’ పేరిట ఆమె చేసిన సూక్ష్మరుణ ఉద్యమం ఎందరో పేద మహిళల జీవితాల్లో వెలుగులు నింపింది.
పుల్లుచెరి గ్రామంలోని మహిళలతో పొదుపు బాట పట్టించిన ఆమె మరెందరికో ఆదర్శంగా మారారు. దాదాపు అరవై వేల మంది మహిళలు కలానిజమ్ పేరిట స్వయం సహాయ బృందాలుగా ఏర్పడి ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేశారు. ఈమె సేవలను గుర్తించిన కేంద్రం స్త్రీ శక్తి పురస్కారంతో సత్కరించింది. అప్పుడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అవార్డును అందించాక ఆమె కాళ్లకు నమస్కరించారు. తాజాగా ఈ సంవత్సరం పద్మశ్రీ పురస్కారం దక్కింది.
No comments