మనోజీకుమార్ పాండే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సీతాపూర్ జిల్లాలో రుధా గ్రామంలో గోపీచంద్ పాండే దంపతులకు 1975, జూన్ 25న జన్మించారు. చదు...
మనోజీకుమార్ పాండే
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సీతాపూర్ జిల్లాలో రుధా గ్రామంలో గోపీచంద్ పాండే
దంపతులకు 1975, జూన్ 25న జన్మించారు. చదువుకునే రోజుల్లోనే క్రీడల పట్ల
ఆసక్తి కలిగిన పాండే బాక్సింగ్, బాడీబిల్డింగ్ పై ప్రత్యేక అభిమానం
కనబరిచేవారు. ఎన్డీఏలో ఉత్తీర్ణత పొంది గూర్ఖా రైఫిల్స్ విభాగాన్ని
ఎంచుకుని భారత సైన్యంలో సేవలు అందించారు. భారత సైన్యంలో అర్హత పొందే
ప్రక్రియలో భాగంగా జరిగిన ముఖాముఖిలో పరమ వీర చక్ర పొందడం కోసమే సైన్యంలో
చేరాలని అనుకుంటున్నట్లు సమాధానం చెప్పారు.
ఆపరేషన్ విజయ్ సమయంలో అత్యంత ధైర్య సాహసాలు
ప్రదర్శించి కార్గిల్ బాబ్లిక్ సెక్టార్లో చొరబాటుదార్లను సమర్థవంతంగా
ఎదుర్కొన్నారు. శతృ శిబిరాలను హస్తగతం చేసుకునే బాధ్యతను చేపట్టిన కెప్టెన్
మనోజ్ కుమార్ పాండే 1999 జూలై 3న భాలూజర్ ను తిరిగి కైవసం చేసుకోవడం కోసం
తన పటాలంతో లక్ష్యానికి దగ్గరగా చేరుకున్నారు.
మనోజ్
ధైర్యసాహసాలు, నాయకత్వ పటిమ కారణంగా ఖాలూబర్ ని భారత్ తిరిగి స్వాధీనం
చేసుకోగలిగింది. ఆయన మరణానంతరం భారత ప్రభుత్వం ఇచ్చిన పరమవీర చక్ర
ప్రదానంతో ఆయన కోర్కె ఫలించింది. ఆయన విద్యనభ్యసించిన లక్నో సైనిక స్కూల్
ఆయన జ్ఞాపకార్థం పాఠశాల అసెంబ్లీ హాలుకు అయన పేరు పెట్టుకున్నది. ఆయన
స్వగ్రామమైన సీతాపూర్లోను, లక్నోలోని గోమతీ నగర్లోను రెండు చౌరాస్తాలకు
'కెప్టెన్ మనోజ్ పాండే చౌక్' అని పేరు పెట్టుకున్నారు.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia
No comments