వినాయక సావర్కర్ : విప్లవకారులలో అగ్రేసరుడు. ప్రఖర హిందుత్వవాది. సామాజిక కురీతులను చక్కదిద్దడంలోను, అస్పృశ్యతానివారణ, సామాజిక సమరసతలను...
వినాయక సావర్కర్: విప్లవకారులలో అగ్రేసరుడు. ప్రఖర హిందుత్వవాది. సామాజిక కురీతులను చక్కదిద్దడంలోను, అస్పృశ్యతానివారణ, సామాజిక సమరసతలను సాధించడంలో ముందడుగు వేసే స్వభావశీలి. బ్రిటిష్ వారి దమననీతిని తీవ్రంగా ప్రతి ఘటించిన కొదమసింహం. జీవన పర్యంతము జీవితంలో ఎదురయిన కఠోరమైన కష్టాలను సంతోషంగా అనుభవించిన అద్వితీయ సాహసి. ప్రతిభావంతుడైన మహాకవి. సమర్ధవంతుడైన రచయిత. ఉద్రిక్తవంతమైన, గంభీరమైన ఉపన్యాసకుడు.
సావర్కర్ బ్రిటిష్ సింహాసనాన్ని తునాతునకలు చేయడానికి సాయుధ విప్లవ పోరాటములో భాగస్వామియైనాడు. దేశవిదేశాలలోని అనేకమంది తరుణ వయస్కులైన యువతకు ముఖ్యంగా విద్యార్థులకుప్రేరణనిచ్చిన మహామనీషి. వీరందరూ విదేశీ ప్రభుత్వాన్ని ప్రతిఘటించడంలోను, ప్రతీకారం తీర్చుకోవడంలోను ప్రధాన భూమికను పోషించారు.
బ్రిటిష్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రతిఘటించినందుకు, విప్లవ కార్యక్రమాలను నడిపినందుకుగాను దేశద్రోహిగా నేరారోపణ చేసి ఆంగ్లేయులు సావర్కరును ఇంగ్లండులో బంధించి 1910 జులై 10న మోరియో అనే ఓడలో భారతదేశానికి తీసుకువస్తున్న సమయంలో సముద్రంలోకి దూకి తప్పించుకు పారిపోవడానికి కడలిని ఈదిన సాహసవంతుడు. ప్రపంచంలోనే అరుదైన రీతిలో రెండు యావజ్జీవ కారాగారవాస శిక్షలు విధించి అండమానులో సెల్యులార్ జైలుకు తరలింపబడ్డాడు. పది సంవత్సరాల తర్వాత రత్నగిరి జిల్లాలోనే పరిమిత నిర్బంధంలో ఉంటూ కూడా అస్పృశ్యతా నిర్మూలన వంటి సామాజిక కార్యక్రమాలను నిర్వహించాడు.
1883 మే 28వ తేదీన మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని 'భగూర్' అనే గ్రామంలో సావర్కర్ జన్మించాడు. తండ్రి దామోదరపంత్ సావర్కర్. తల్లి రాధాబాయి. ఛాపేకర్ సోదరుల సాహసోపేతమైన బలిదానం ఇతని పై ప్రభావాన్ని కలిగించింది. వినాయక్ సావర్కర్ బాల్యంలోనే మిత్రమేలా అనే సంస్థను ప్రారంభించాడు. వ్యాయామశాల, గణేష్ పూజ, శివాజీ జయంతులను జరిపేవాడు.
ఫెర్గుసన్ కళాశాలలో చదువుకుంటున్నప్పుడు 'అభినవభారత్' అనే సంస్థను ప్రారంభించి వంగవిభజన వ్యతిరేకించడం, విదేశీ వస్త్రదహనం వంటి కార్యక్రమాలు నిర్వహించాడు. బారిష్టర్ చదువుకోసం లండన్ వెళ్లి ఇండియా హౌజ్ అనే సంస్థను ప్రారంభించి బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేస్తుండేవాడు. విప్లవవీరులను తీర్చిదిద్దేవాడు, చంద్రశేఖర్ ఆజాద్,సర్దార్ భగత్ సింగ్, మదన్ లాల్ ధింగ్రా అనంతలక్షణ కన్జరే, ఉద్దామసింగ్ వంటివిప్లవ వీరులకు స్ఫూర్తిప్రదాత సావర్కర్.
సావర్కర్ గొప్ప రచయిత. అగ్నిగోళాల వంటి అక్షరాలతో, పిడుగుపాటు వంటి భావాలతో నిప్పులను కురిపించే దేశభక్తి పూరిత కావ్యాలను వ్రాశాడు. 1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం అనే పుస్తకాన్ని ముద్రణకు ముందే బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. ప్రేరణదాయకమైన కవితలు వ్రాసేవాడు. బ్రిటిష్ ప్రభుత్వం అండమాను జైలులో బంధించినప్పుడు గానుగ తిప్పుతూ, కొబ్బరిపీచు ఒలుస్తూ రక్తాన్ని చిందిస్తూగడిపిన అతి దుర్భరమైన జీవితం దేశభక్తులకు ప్రేరణదాయకం.
అంటరానితనం మీద తిరుగుబాటు చేస్తూ రత్నగిరి జిల్లాలోని విఠలేశ్వర దేవాలయంలో అంటరానివారికి ప్రవేశం కల్పించారు. పతితపావన మందిరాన్ని నిర్మించి శంకరాచార్యచే ప్రారంభోత్సవం చేయించి అన్ని కులాలవారికి ప్రవేశాన్ని కల్పించి సహపంక్తి భోజనాన్ని ఏర్పాటు చేసిన సంఘసంస్కర్త.
హిందువుల సంక్షేమం కోసం హిందూ మహాసభను స్థాపించి దానికి అధ్యక్షులుగా ఉంటూ రాజకీయ పోరాటాన్ని సాగించిన రాజకీయ దురంధరుడు. 1964లో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రతిహతీ స్వాతంత్ర్యవీర అనే బిరుదునిచ్చింది. సావర్కర్ తన 83వ ఏట 1966 ఫిబ్రవరి 26న పరమపదించారు. మొదటిసారి స్వదేశీ నినాదాన్నిచ్చాడు. విదేశీ వస్తువులను మొదటిసారిగా దగ్ధం చేసినవాడు, స్వాతంత్ర్య కాంక్ష కారణంగా బొంబాయి యూనివర్సిటీ నుండి తిరస్కరింపబడినవాడు స్వాతంత్ర్య వీరసావర్కరే. కాగితం, కలం దొరకక మేకులు, రాళ్లతోజైలు గోడలపై కవితలు వ్రాసిన మొట్టమొదటి కవి సొవర్కర్. అస్పృశ్యుడు, పూజారిగావ్యవహరించే హిందూ ఆలయాన్ని నిర్మించిన సంస్కర్త సావర్కర్.
సావర్కర్ వ్రాసిన అండమాన్ లో ఆజన్మాంతం పుస్తకం కొరకు వాట్సాప్ ద్వారా సంప్రదించండి:
మా వాట్సాప్ నెంబర్ : +91 8500-5819-28
or Directly Buy
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
Very valuable efforts you are carrying..Really appreciable..
ReplyDeleteThis is much informative.
tq sir, please share this website
DeleteGreat sir really inspiring
ReplyDelete