అల్లూరి సీతారామరాజు రామరాజు 4 జూలై 1897లో విశాఖజిల్లా పాండ్రంకి గ్రామంలో జన్మించారు. 17-18 సంవత్సరాల వయస్సులో ఆధ్యాత్మిక భావాలతో హరిద్వ...
అల్లూరి సీతారామరాజు
రామరాజు విశాఖ మన్యం కేంద్రంగా గొప్ప గిరిజనోద్యమం నడిపాడు. 1922 నుంచి 1924 వరకు జరిగిన ఈ పోరాటం భారతీయ గిరిజనోద్యమ చరిత్రలోనే వన్నెకెక్కింది. ఆగస్టు 22, 1922న ప్రారంభమయిన ఈ ఉద్యమానికి ముందు గొప్ప నేపథ్యం కనిపిస్తుంది. అది చీలికలు పేలికలుగా విడిపోయి ఉన్న గిరిజన సమూహాన్ని ఒక త్రాటి పైకి తీసుకురావడం అందులో ప్రధానమైంది. వ్యసనాల కారణంగా నైతిక స్థైర్యం కోల్పోయి ఉన్న అడవితల్లి బిడ్డలను సంస్కరించడం రెండవది. గిరిజనులకు పోరాటం కొత్తకాదు. కాని పంథా, దిశానిర్దేశం అవసరం. అన్నిటికీమించి వీరి ఆగ్రహాన్ని ప్రధానస్రవంతి ఉద్యమంతో అనుసంధానించడం మరొకటి. వీటిని సాధించిన వ్యక్తి రామరాజు.
రామరాజు 1817లోనే మన్యంలో అడుగుపెట్టాడు. విశాఖ అడవులలో బగత కులస్థులు సాంఘికంగా పైమెట్టు మీద ఉన్నవారు. ఆ తర్వాత వరసగా- కొండదొర, కొండకాపు, గదబ, వాల్మీకులు, భోదులు వస్తారు. రామరాజు మొదట వీరి చేత కల్లుమనిపించాడు. వారి మధ్య ఉన్న అంటరానితనాన్ని మొదట మాని, తరువాత ఉద్యమం వైపు మళ్ళించాడు. క్రైస్తవ ప్రచారకుల బారినపడకుండా గిరిజనులను కాపాడగలగడం కూడా రాజు చేసిన గొప్పమేలు. రామరాజు ఆ సమాజంలోకి ప్రవేశించడానికి ఉపయోగపడిన విద్య ఆయుర్వేదం.
1917-1922 మధ్యకాలంలో సీతారామరాజు వనవాసులతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. 22 ఆగస్టు 1922 నుండి 1924 వరకు వివిధ పోలీసు స్టేషన్లపై దాడిచేసి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాడు. సీతారామరాజు లేవనెత్తిన గిరిజన తిరుగుబాటును అణిచివేయడానికి ఆంగ్లేయ ప్రభుత్వం రూథర్ ఫర్డ్ నాయకత్వాన మలబారు సైన్యాన్ని పంపింది. తిరుగుబాటును అణచడం కోసం ఆంగ్లేయ సైన్యం గిరిజనులపై చెప్పనలవికాని అత్యాచారాలను చేసింది.
తోటి గిరిజనులు పడుతున్న కష్టాలను చూసి భరించలేక సీతారామరాజు సంధికై ఆయుధాలు లేకుండా బ్రిటిష్ సైన్యాలను కలిసాడు, నిరాయుధుడైన సీతారామరాజును బ్రిటిష్ సైన్యం బంధించి చెట్టుకు కట్టి 6మే 1924న కాల్చిచంపింది.విశాఖజిల్లాలోని కృష్ణదేవిపేట గ్రామంలో సీతారామరాజు పార్థివ శరీరం సమాధి చేయబడింది.
No comments