రిప్ అంటే అర్థం తెలుసా..? తెలియక వాడుతున్నారా?? సోషల్ మీడియా విస్తృతమయ్యా క.. తెలిసిన వ్యక్తి ఎవరైనా చనిపోయారు అని తెలియగానే ఒక ఫొ...
రిప్ అంటే అర్థం తెలుసా..? తెలియక వాడుతున్నారా??
సోషల్ మీడియా విస్తృతమయ్యా క.. తెలిసిన వ్యక్తి ఎవరైనా చనిపోయారు అని తెలియగానే ఒక ఫొటో పెట్టేసి.. రిప్(ఆర్ ఐ పీ) అని పోస్ట్ చేస్తున్నాం. అసలు రిప్ అంటే అర్ధం తెలుసా? రిప్ అంటే రెస్ట్ ఇన్ పీస్ అని అర్థం. ప్రస్తుతం మనమందరం.. రిప్ అని ఎందుకు రాస్తున్నామో తెలియకుండానే గుడ్డిగా అనుసరిస్తున్నాం. క్రైస్తవం ప్రకారంమరణించాక, జడ్జిమెంట్ డే వరకు ఆత్మ నిరీక్షించాలి. ఇస్లాం ప్రకారం కూడా ఒక రోజు వరకు నిరీక్షించాలి. ఆ రోజు వరకూ ఈ ఆత్మ ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలని మనం ఈ రిప్ ద్వారా కోరుతున్నాం.
మరి సనాతన ధర్మం ప్రకారం ఆత్మ నాశనం లేనిది. ఆత్మకు అలసటే లేదు. అలాంటప్పుడు విశ్రాంతి ఎక్కడ? అలాగే మరణానంతరం జీవి పాపపుణ్యాల్ని బట్టి, తరువాతి జన్మ పొందడమో, స్వర్గ నరకాలకు వెళ్ళడమో, మోక్షానికి వెళ్ళడమో వంటి ప్రతి చర్యలుంటాయి. మోక్షం వరకూ ఇది ఒక చక్రం లాగా తిరుగుతూ ఉంటుంది. అంతేకానీ మనం ఏ రోజు గురించి నిరీక్షించాల్సిన అవసరం లేదు. రిప్ అనేది పూర్తిగా పాశ్చాత్యమే కాక, మతాంతరం కూడా. మరణించిన వ్యక్తికి ముక్తి కలగాలనో, లేక స్వర్గస్తుడవ్వాలనో, శాశ్వత పుణ్య లోకాలు కలగాలనో మనం ప్రార్థించాలే తప్ప, రిప్ అని ప్రార్ధించడం సనాతన ధర్మానికి వ్యతిరేకమని గుర్తించాలి. స్వర్గ ప్రాప్తిరస్తు అనుకోవాలి గాని, ఇలా రిప్ పెట్టకూడదట.
No comments