డాక్టర్ సత్యశంకర్ వర్ముడీ నమో గోభ్యశ్రీమతీభ్యః సౌరభేయోభ్య ఏవచ నమోబ్రహ్మను(సుతాభ్యశ్చ పవిత్రేభ్యో నమోనమః ఈ శ్లోకాన్ని చదివి శ్రీ సురభ్...
డాక్టర్ సత్యశంకర్ వర్ముడీ
నమో గోభ్యశ్రీమతీభ్యః సౌరభేయోభ్య ఏవచ
నమోబ్రహ్మను(సుతాభ్యశ్చ పవిత్రేభ్యో నమోనమః
ఈ శ్లోకాన్ని చదివి శ్రీ సురభ్యై నమః అనే మంత్రాన్ని వీలైనన్ని మార్లు జపించి గోవును నమస్కరిస్తే సకల సంపదలు, ఆయురారోగ్యాలు వృద్ధి అవుతాయన్నది శాస్త్ర వచనం. గోమూత్రంతో వైద్యం చేయడమంటే అధిక కాలం చెల్లిన చికిత్స అని, ఛాదస్తపు వైద్యమని అలోపతి వైద్యులు చులకనగా చూస్తారు. గోమూత్రంలో ఎన్నో ఔషధీగుణాలున్నాయంటే కొందరు డాక్టర్లు నేటికి విశ్వసించడం లేదు. డాక్టర్ సత్యశంకర్ వర్ముడీ కేరళ ప్రాంతానికి చెందిన అలోపతి వైద్యుడు, ఆయన సుఖవ్యాధులకు చికిత్సచేసే బాధ్యతతో తనకు తెలిసిన అలోపతి వైద్యం చేస్తూండేవాడు. ఆంగ్లభాషలో అలాంటి వైద్యులను ఓరల్ సర్జన్ అని అంటారు.
ఎవరికీ చిక్కని, అంతుపట్టని కేన్సరు వ్యాధికి ఇలాంటి సామాన్య వైద్యుడు చికిత్స చేయగలడా, ఆ చికిత్సవలన రోగం నయమవుతుందా అనే అనుమానం కలగడం వింత కాదు. అతని దగ్గరకు ఒక పేద వృద్ధురాలు నోటిలో కేన్సరుతో బాధపడుతూ వచ్చింది. డాక్టర్ వర్ముడీ తనకు తెలిసిన అలోపతి వైద్యం చేయడం మొదలెట్టాడు. అతనికి తన గురువుగారి పట్ల అచంచలమైన భక్తి, గురువుగారు ఏది చెప్పినా దాన్ని ఆజ్ఞగా భావించి అతని మాటను పాటించడమేగాని ప్రశ్నించేవాడు కాదు. ఆయుర్వేద వైద్యులు విశేషంగా అభిమానించే గోమూత్ర అర్క్ తో చికిత్స చేయమని గురువుగారు శిష్యునికి సలహా ఇచ్చారు.
ఇతను చూడబోతే అలోపతి వైద్యుడు. తోటి డాక్టర్లతో తన సమస్యను చర్చించారు. ఈ విషయమై మనమెందుకు పరిశోధనలు చెయ్యాలి, ఆ పరిశోధనలేవో ఆయుర్వేద వైద్యులకే వదిలేస్తే సరిపోతుందన్నారు వారు. ఒక వంక గురువుగారి ఆజ్ఞ, వేరొకవంక వీరి సలహా! ఏమైతేనేం అతను గురువుగారి ఆజ్ఞ మీరగలడా? అతను ఏ మాత్రము విచలితుడు కాలేదు. గురువుగారి మీద నమ్మకం ఉంది. దేశీ గోవు మూత్రంతో తయారుచేసిన కామధేను అర్క్ ను వ్యాధిగ్రస్తురాలికిస్తూ వైద్యం చేయసాగాడు. క్రమక్రమంగా ఆమె పరిస్థితి మెరుగైంది, వ్యాధి తగ్గు ముఖం పట్టింది. బాధలు తగ్గాయి. ఆ తరువాత కొంత కాలానికి ఆ వ్యాధి సంపూర్ణంగా తగ్గిపోయింది, డా|| సత్యశంకర్ ఆనందించాడు. ఈ విషయం తెలుసుకున్నవారు ఆశ్చర్యపోయారు. నోట మాటరాక అవాక్కయ్యారు.
తన సఫల పరీక్షణతో అతను సంతృప్తిపడలేదు. డా||సత్యశంకర్ వర్ముడీగారు తన పరిశోధన గురించి వైద్య జగత్తులో ప్రచారం చేయాలనుకున్నారు. మహారాష్ట్రలోని జలగావ్ వంటి ప్రదేశాలలో తన పరిశోధన ఫలితాలను వివరించి చెప్పాడు. అతని పరిశోధనకు ఆశించినదానికన్నా ఎక్కువ ప్రతిస్పందన వచ్చింది. తిరుమలతిరుపతి దేవస్థానంవారు 2008లో ఒక సదస్సును నిర్వహించారు. ఆ సభలో THE GLORY OF GOMATHA ను ప్రదర్శించారు. డాక్టరుగారిని సత్కరించారు.
ఆ సమావేశానికి దేశం నాలుగు చెరగుల నుండి మూడువేలకు పైగా విభిన్న చికిత్సా విధానాలకు సంబంధించిన వైద్యులు విచ్చేసారు. వీరి పరిశోధన ఎందరికో స్ఫూర్తిదాయకం. నేడు అర్క్తో కేన్సరు వ్యాధి చికిత్స చేస్తున్నారు. ఆయుర్వేదం అతి ప్రాచీనమైన వైద్యం. ఏ దేశంలోనూ నాగరికత అభివృద్ధి చెందని కాలంలో మన ఋషులు వారి తపశ్శక్తితో మనకు ప్రసాదించినది ఆయుర్వేదం. ఈ శాస్త్ర సంపదను కాపాడుకోవలసిన బాధ్యత మనది. గోవు భారతీయులకుతల్లితో సమానం. అందువలన అది పూజ్యమైనది. దానిని కాపాడుకోవలసిన బాధ్యత కూడా మనమీద వుంది.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
Excellent
ReplyDeletePlease inform your phone number
ReplyDelete