Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

డా|| కానూరు లక్ష్మణరావు - kanuri lakshamana rao biography in telugu

డా|| కానూరు లక్ష్మణరావు కాకఃకృష్ణః పికః కృష్ణః కో బేధః పిక కాకమో?? వసంత కాలే సంప్రాప్తీ కాకః కాకః పికః పికః కాకి నల్లగా ఉంటుం...

డా|| కానూరు లక్ష్మణరావు



కాకఃకృష్ణః పికః కృష్ణః కో బేధః పిక కాకమో??
వసంత కాలే సంప్రాప్తీ కాకః కాకః పికః పికః

కాకి నల్లగా ఉంటుంది. కోకిల కూడా నల్లనే, ఈ రెండింటికి భేమేమిటి? వసంత ఋతువు వచ్చినపుడు అవి గొంతు విప్పుతాయి. కాకి కాకే, కోకిల కోకిలే!
ఈనాడు దేశం జల విద్యుత్ ఉత్పాదనలో, సాగునీరు త్రాగునీరు సంక్షోభంలో పడకుండా ముఖ్యంగా మ్మడి ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి కృష్ణానదులలో ప్రవహిస్తున్న నీటిని సద్వినియోగపరుస్తూ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి జీవిత పర్యంతం శాయశక్తులా కృషిచేసిన ధీశాలి డా|| కానూరు లక్ష్మణరావుగారు.
డా||కె. ఎల్.రావు 1902 జూలై 15న కృష్ణాజిల్లా కంకిపాడు గ్రామంలో జన్మించాడు. 9 ఏళ్ళ వయసులో ఆయన తండ్రి చనిపోయాడు. ఆయన తండ్రి ప్లీడరు గుమస్తాగా పనిచేసేవాడు. తండ్రి మరణానంతరం పెద్దగా వెనుక దన్నులేదు, కష్టాలు కట్టలు కట్టుకు వస్తాయని ఒక నానుడి. ఆ బాలుడి జీవితంలో అది యథార్థమైంది. ఒకనాడు పాఠశాలలో ఆటలాడుతూ ఉంటే కంటికి దెబ్బ తగిలి ఒక కంటి చూపు పోయింది. విజయవాడలో చదువుకుని మెట్రిక్ పరీక్ష పాసయ్యాడు. మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ఎఫ్, ఏ, ఉత్తీర్ణుడై, మద్రాసు యూనివర్సిటీ నుంచి బి.ఇ డిగ్రీ తీసుకున్నాడు. మద్రాసు యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగులో డిగ్రీ తీసుకున్న మొదటివాడు ఆయనే. ఆ తరువాత యునైటెడ్ కింగ్డమ్ లోని బర్మింగ్హామ్ యూనివర్సిటీ నుంచి 1939లో పి.హెచ్.డి (డాక్టరేట్) చేసాడు.
కొంతకాలం విశాఖ జిల్లా బోర్డులో సహాయక ఇజనీరుగా పనిచేసారు. బర్మా, రంగూన్ లో ప్రొఫెసరుగా పనిచేసి డాక్టరేట్ డిగ్రీ వచ్చిన అనంతరం ఆయన యునైటెడ్ కింగ్డమ్లో అనేక చోట్ల ఆసీ స్టెంట్ ప్రొఫెసరుగా పనిచేశారు. సిమెంటు కాంక్రీటు విషయంలో అతను చేసిన పరిశోధనలు విశ్వవ్యాప్తంగా నిర్మాణ రంగంలో విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చాయి, ఆండ్రూస్, అస్కార్ ప్రొబే వంటి ఎందరో ఉద్దండులైన ఇంజనీర్లు ఆయన్ని భూరిగా ప్రశంసించారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన తరువాత మద్రాసు ప్రభుత్వంలో డిజైన్ ఇంజనీరుగా ఉద్యోగం చేశారు. ఆయన పనికి మెచ్చి కేంద్ర ప్రభుత్వం ఆయన్ని ఢిల్లీలోని విద్యుత్ కమీషన్ డైరెక్టర్ (డిజైన్)గా నియమించింది. ఆ పదవిని వారు 1960లో స్వీకరించారు. 1964లో చీఫ్ ఇంజనీరుగా ఆయనకి పదోన్నతి లభించింది. భారత ప్రభుత్వం 1963లో ఆయనకి పద్మభూషణ్ అందజేసింది.
డాక్టర్ కె.ఎల్.రావు 1961లో విజయవాడ నుంచి లోకసభకు పోటీ చేసి గెలిచారు. 1977 వరకు వరుసగా పార్లమెంటు సభ్యుడిగా కొనసాగారు. 1963 జూలై 20న జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో జలవనరులు, విద్యుత్ శాఖల కేబినెట్ మంత్రి పదవీ బాధ్యతలు తీసుకొన్నారు. ఆ తరువాత ఆయన లాల్ బహదూర్ శాస్త్రి, శ్రీమతి ఇందిరా గాంధీ మంత్రివర్గాలలోనూ అదే హోదాతో కొనసాగారు, జలవనరులు, విద్యుత్ కేంద్రీయ బోర్డు ప్రెసిడెంటుగా, రెండుపర్యాయాలు (1958-59, 1950-60లలో) ఆల్ ఇండియా ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా సేవలనందించారు.
అదే విధంగా 1957-61, 1961-65లలో ఇంటర్ నేషనల్ సొసైటీ ఫర్ సాయిల్ మెకానిక్స్ అండ్ జియో టెక్నికల్ ఇంజనీరింగ్ (వసియా) వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. ఆయనకు ఆంధ్రా యూనివర్సిటీ 1960లో, రూర్కీ యూనివర్సిటీ 1963లో డాక్టరేట్ డిగ్రీలనిచ్చాయి. ఆయన వ్రాసిన పుస్తకం స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అండ్ రీ ఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ బహుళ ప్రయోజనకారి అయిన నాగార్జునసాగర్ డ్యామ్ జల విద్యుత్ ప్రాజక్టుకు డిజైన్ చేశాడు. నల్లగొండ జిల్లాలో కృష్ణానది మీద నిర్మితమైన ఆ కాంక్రీట్ డ్యామ్ ప్రపంచంలోకెల్లా పెద్దది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని నదుల అనుసంధానము, ప్రాజెక్టుల నిర్మాణాలలో చురుకుగా పాల్గొన్నాడు. 1977లో స్వచ్ఛందంగా రాజకీయాలకు దూరమై, శేష జీవితాన్ని ప్రశాంతంగా గడిపి, 1986 మే 15న స్వర్గస్తులయ్యారు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments