మోక్షగుండం విశ్వేశ్వరయ్య మాతాభూమిః పుత్రోహం పృథివ్యాః అన్నది దైవిక జీవన వాస్తవం. భూమి నాకు తల్లి. నేను ఆమె పుత్రుడను , పుడమి మొత్...
మోక్షగుండం విశ్వేశ్వరయ్య
మాతాభూమిః పుత్రోహం పృథివ్యాః అన్నది దైవిక జీవన వాస్తవం.
భూమి నాకు తల్లి. నేను ఆమె పుత్రుడను, పుడమి మొత్తం ఈ వైదిక సంస్కారంతో నిండిన ప్రజలతో నిండి ఉన్నది. కృత యుగంలో ఇలా భారతదేశమే ప్రపంచం, ప్రపంచమే భారతదేశం అయి ఉన్నది. కృతయుగంలోని మనుష్యుల సంస్కారాలు ఈ కలియుగంలోనూ ఉండాలనుకోవటం ఉత్త భ్రమే. అయితే పుడమిని తల్లిగా భావించేవారు ఈనాడు లేరని అనలేము, చాలా మందిలో మాతృభక్తి ఇప్పటికి నిండుగా ఉంది.
దానవత్వపు ముసుగులోని మానవుల గురించిన చర్చ అవసరంలేదు. ఈ భూమిని తన తల్లిగా భావించి తన అమూల్య సేవలనందించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్యగారి గురించి తెలుసుకోవడం ప్రతి భారతీయుని కర్తవ్యం. అతనికి నూతృభూమి మీదనే కాదు, మాతృభాష కన్నడం మీద కూడా పల్లమాలిన అభిమానం, ఒక సనాతన కుటుంబంలో శ్రీ మోక్షగుండం శ్రీనివాసశాస్త్రీ, శ్రీమతి వేంకటలక్ష్మమ్మ పుణ్య దంపతులకు ముద్దుబిడ్డగా విశ్వేశ్వరయ్య 1881 సెప్టెంబర్ 15న జన్మించాడు. ఆనాటి మైసూరు రాష్ట్రం కోలారు జిల్లా నుండి విడిపోయిన చిక్కబల్లాపూర్ జిల్లాలోని ముద్దెనహళ్ళి గ్రామంలో ఆయన జన్మించాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. ఎదుగుతున్న కొద్ది ఆ బాలునిలోని సంస్కారాలు, దేశ ప్రేమ పొటమరించసాగాయి.
12 ఏళ్ల బాల్యంలోనే తండ్రిని కోల్పోయాడు, ప్రాథమిక విద్య అదే గ్రామంలో అభ్యసించి, బెంగళూరులో హైస్కూలు చదువు పూర్తి చేశాడు. మద్రాసు యూనివర్సిటీ పరిధిలోని సెంట్రల్ కాలేజి, బెంగళూరులో బి.ఏ.వరకు చదివాడు. ఆ తరువాత ఖ్యాతిగాంచిన కాలేజ్ ఆఫ్ పూణేలో ఇంజనీరింగ్ చదివాడు. తొలుత ముంబైలోని ఇరిగేషన్ కమీషన్లో పనిచేస్తూ, డకను ప్రాంతంలో నీటిపారుదల వ్యవస్థను నిర్మాణం చేశాడు. తమంతట తాముగా తెరుచుకుని మూసుకుపోయే ఫ్లడ్గేట్ల నిర్మాణం ఫణీకు దగ్గరలోని ఖడ్క వాస్లా రిజర్వాయర్లో 1903లో నిర్మాణం చేసాడు. అటువంటి నిర్మాణాలనే గ్వాలియర్లోని తిగ్రాడ్యామ్లోనూ, కర్నాటకరాష్ట్రం మాండ్యాలోని కృష్ణరాజసాగర్ డ్యామ్లోను చేసి విశ్వప్రసిద్ధి పొందాడు.
మంచి నీటి సరఫరా, మురికి నీటి కాలువల తీరు తెన్నులను అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఆయనను 1906-07లలో పిడెన్ పంపింది. అతను రూపొందించిన పథకాన్నే ఏడెన్ ప్రభుత్వం అమలుచేసింది. అంతేకాకుండా హైదరాబాదు నగరం కోసం వరద నివారణ పథకాన్ని తయారుచేశాడు. సముద్ర జలాల కోతకు గురికాకుండా విశాఖపట్నం ఓడరేవును సుదృఢం చేయడంలో కార్యదక్షతను చూపించాడు. బీహార్లో గంగానదిమీద మోకామ బ్రిడ్జిని నిర్మించారు. ఇలా చెప్పుకుంటూపోతే అది ఒక గ్రంథమే అవుతుంది, | 1912 నుంచి 1916వరకు విశ్వేశ్వరయ్య మైసూరు రాజా వారి కొలువులో దివానుగా పనిచేశాడు.
అతని నిజాయితీకి సంబంధించిన ఒక సంఘటన. విశ్వేశ్వరయ్య ఒకనాటి రాత్రి తన ఇంటిలో లాంతరు ముందు కూర్చుని ఏదో వ్రాసుకుంటున్నాడు. ఇంతలో ఒక మిత్రుడు వచ్చాడు. విశ్వేశ్వరయ్య ఆ లాంతరును ఆరేసి ఒక దీపపు బుడ్డిని వెలిగించాడు. “అలా ఎందుకు చేసావు. ఇప్పుడంత వెలుతురు లేదే" అన్నాడా మిత్రుడు, “అది రాజావారి సొమ్ముతో కొన్న కిరసనాయిల్, ఈ బుడ్డీలోనిది నా స్వంతం, నేను దివాణం పని అయితేనే లాంతరు వాడుతాను" అన్నాడు విశ్వేశ్వరయ్య. బ్రిటీషు ప్రభుత్వం నైట్ కాట్రేడ్ ఆఫ్ బ్రిటిష్ ఇండియన్ ఎంపైర్ అను బిరుదు ప్రదానం చేసింది.
1955లో భారత ప్రభుత్వం అతనికి భారతరత్న అన్న సర్వోచ్చ బిరుదును ఇచ్చి సత్కరించింది. ఆయనను ఆధునిక మైసూరు రాష్ట్రపు తండ్రిగా ప్రజలు అభిమానించేవారు. ఆయనను ముప్పై సంవత్సరాల వయస్సులో ఆంగ్లేయ ప్రభుత్వం 'సర్' బిరుదుతో సత్కరించింది. అంతటి ప్రతిభా వ్యుత్పత్తులు గల భారతమాత ముద్దుబిడ్డ, శతాధిక వత్సరాలు జీవించి భారతమాత సేవలు నిస్వార్ధంగా చేసి, తల్లి చరణాల చెంత 1962 ఏప్రిల్ 12వ తేదీన ఆఖరి శ్వాసను వదిలాడు. విశ్వేశ్వరయ్య జ్ఞాపకార్థం ప్రతి ఏటా ఆయన జన్మదినం (15 సెప్టెంబర్ )ను ఇంజనీర్ల దినంగా జరుపుకుంటారు.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
No comments