rss ఆద్య సర్ సంఘచాలక్ - డాక్టర్ హెగ్గేవార్: rss సంఘాన్ని స్థాపించిన డాక్టర్ హెగ్గేవార్ సంఘానికి ఆద్య (ప్రథమ) సర్ సంఘచాలక్ గా వున్నారు. ...
rss ఆద్య సర్ సంఘచాలక్ - డాక్టర్ హెగ్గేవార్:
rss సంఘాన్ని స్థాపించిన డాక్టర్ హెగ్గేవార్ సంఘానికి ఆద్య (ప్రథమ) సర్ సంఘచాలక్ గా వున్నారు. క్రీస్తుశకం 1889, ఏప్రిల్ 1వ తేదీన వారు జన్మించారు. ఆరోజు విక్రమశకం ప్రకారం అది 1946, ఉగాది పర్వదినం. వారి తండ్రిపేరు బలీరాం, తల్లి పేరు రేవతి. డాక్టర్జీ 1925లో సంఘాన్ని స్థాపించారు. మొదట నాగపూర్లో ఆ తరువాత నాగపూర్ చుట్టుప్రక్కల స్థలాలలో సంఘశాఖలు ప్రారంభమైనాయి. 1930లో డాక్టర్జీ అటవీ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. అందువలన వారికి జైలుశిక్ష పడింది. విదర్భ ప్రాంతంలోని అకోలా జైలులో వారిని నిర్బంధించారు. ఆ జైలులో దేశభక్తి కలిగిన అనేకమంది నాయకులతో డాక్టర్జీకి సన్నిహిత సంబంధం ఏర్పడింది.
జైలు నుండి విడుదల అయిన తరువాత ఈ పరిచయాల వలన విదర్భ ప్రాంతంలో సంఘ శాఖలు ప్రారంభమైనాయి, ఆ తరువాత మహారాష్ట్ర అంతటా సంఘశాఖలు విస్తరించాయి. ఇతర ప్రాంతాలకు కార్యకర్తలను పంపడం 1936 తర్వాత ప్రారంభమైంది.1940 నాటికి ఒరిస్సా, అస్సాం మినహా అన్ని ప్రాంతాలలో (రాష్ట్రాలలో) సంఘశాఖలు ప్రారంభమైనాయి. 1940, జూన్ 9వ తేదీన నాగపూర్ సంఘశిక్షావర్గ ముగింపు కార్యక్రమమైన దీక్షాంత సమారోప్లో డాక్టర్జీ మాట్లాడుతూ ఈరోజు నా కళ్ళముందు హిందూ రాష్ట్ర సూక్ష్మ స్వరూపాన్ని చూడగలుగుచున్నాను అని అన్నారు. డాక్టర్జీ జీవించి వున్నప్పటికే సంఘం దేశం అంతటా విస్తరించింది. 1940, జూన్ 21న డాక్టర్జీ నాగపూర్ లో స్వర్గస్థులైనారు. అప్పటికి వారి వయసు 51 సంవత్సరాలు.
ఆర్ ఎస్ ఎస్ సర్ సంఘచాలక్ ల గురించి లింకులు క్రింద ఇవ్వబడినవి
ఆర్ ఎస్ ఎస్ ద్వితీయ సర్ సంఘచాలక్ గురూజీ జీవిత విషయాలు క్లుప్తంగా
ఆర్ ఎస్ ఎస్ తృతియ సర్ సంఘచాలక్ బాలాసాహెబ్ దేవరస్ జీవిత విషయాలు క్లుప్తంగా
ఆర్ ఎస్ ఎస్ నాల్గవ సర్ సంఘచాలక్ ప్రొ. రాజేంద్రసింహజీ జీవిత విషయాలు క్లుప్తంగా
ఆర్ ఎస్ ఎస్ ఐదవ సర్ సంఘచాలక్ కు.సీ. సుదర్శన్ జీ జీవిత విషయాలు క్లుప్తంగా
ఆర్ ఎస్ ఎస్ ప్రస్తుత సర్ సంఘచాలక్ మోహన్ రావు భాగవత్ జీ జీవిత విషయాలు క్లుప్తంగా

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
No comments