Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఉగాది నాడుదయించిన యుగపురుషుడు హెడ్గేవార్ - rss founder hedgevar biography in telugu

డా||కేశవరావ్ బలిరాం హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని స్థాపించిన మహాపురుషులు. క్రీ.శ. 1889 సంవత్సరం ఉగాది పర్వదినాన జన్మించారు. వ...


డా||కేశవరావ్ బలిరాం హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని స్థాపించిన మహాపురుషులు. క్రీ.శ. 1889 సంవత్సరం ఉగాది పర్వదినాన జన్మించారు. వీరి తల్లి దండ్రులు రేవతీబాయి, బలిరాంపంత్ అనే పుణ్యదంపతులు. కేశవరావు జన్మజాత దేశభుక్తులు.
12 సంవత్సరాల వయసులో విక్టోరియా రాణి నీంహాసనాన్ని అధిష్టించి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పాఠశాలలో పంచిపెట్టిన మిఠాయిలను విసిరి ఆవల పారేశాడు. 1908లో నీలిసిటీ హైస్కూలులో చదువుతున్న రోజులలో పాఠశాలకు పరిశీలనాధికారి వచ్చినప్పుడు వందేమాతరం ఉద్యమాన్ని నిర్వహించారు. పాఠశాల నుండి బహిష్కరింపబడ్డారు. పూన వెళ్ళి మెట్రిక్యులేషన్ పూర్తిచేశారు.
తిలక్ మహాశయుని ఆజ్ఞానుసారం కోల్ కతాలో వైద్యకళాశాలలో చేరి అనుశీలన సమితి అనే విప్లవసంస్థలో చేరి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారు. వైద్యవిద్యను పూర్తిచేసుకుని తన డిగ్రీలను ఉదరపోషణకు, ధనసంపాదనకు వినియోగించకుండా శేషజీవితాన్ని భారతమాత సేవలో సమర్పించాలని నిర్ణయించుకొని బ్రహ్మచర్యాన్ని స్వీకరించి లోకమాన్యుని సందేశానుసారం అఖిల భారత కాంగ్రెస్లో చేరి స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖపాత్ర వహించారు. కొంతకాలం జైలు జీవితాన్ని గడిపారు. కాంగ్రెసు సంస్థలో అనేక బాధ్యతలు తీసుకొని పనిచేశారు. హిందూమహాసభలో చేరి కొంతకాలం పనిచేశారు.
ఆ అనుభవంతో వేయి సంవత్సరాలుగా హిందూరాష్ట్ర పరాజయానికి కారణాలను విశ్లేషించారు. హిందూసంఘటన ఆవశ్యకతను గుర్తించి 1925 విజయదశమి పర్వదినాన నాగపూరు పట్టణంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని స్థాపించారు. సంఘటనాకార్యం ప్రారంభించడంతోనే సహజ సిద్దంగా ఉన్న కోపస్వభావాన్ని విడిచి పెట్టి స్వభావో దురతిక్రమః అనే లోకోక్తిని వమ్ముచేశారు. డాక్టర్ హెడ్గేవార్ కు ఈ రాష్ట్ర జీవనంలోని హిందువులలో హిందుత్వభావనను జాగృతపరచి తద్వారా హిందూసమాజ సంఘటన చేసి దాని ఆధారంగా ఈ రాష్ట్రాన్నిపరమవైభవ స్థితికి తీసుకువెళ్ళాలి అనేది జీవిత ధ్యేయంగా ఉండేది. కుల,ప్రాంత, భాష పరాభిమానాలకతీతంగా హిందువులు సంఘటితమైనవాడు హిందూధర్మం, హిందూసంస్కృతి, మరియు హిందూ దేశానికి మేలు కలుగుతుంది. అదే సమాజానికి కళ్యాణ కారకమవుతుందని ఆలోచన చేశారు.
ఈ ఆలోచనకు సాకారరూపమే రాష్ట్రీయ స్వయం సేవక సంఘము, ఆత్మ ప్రేరణతో, మొక్కవోని ఆత్మవిశ్వాసంతో అత్యంత సరళము మరియు సహజసిద్ధమైన పద్ధతిలో హిందూ సంఘటన జరగడానికి పూజనీయ డాక్టర్జీ చూపించిన కార్యపద్ధతి వారి మేధాశక్తికి తార్కాణము. ఈ కార్యంలో వారి ప్రతిభాపాటవాలను సమర్పించుకున్న యుగద్రష్ట డాక్టర్ హెడ్గేవార్.
డాక్టర్ హెడ్గేవార్ పూర్వీకులు వేదపండితులు, వీరు ప్రస్తుత తెలంగాణ ప్రాంతంలో ఇందూరు (నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి అనే గ్రామం నుండి నాగపూరు వలస వెళ్ళినట్లు చరిత్ర చెప్తోంది. 21 జూన్ 1940లో డాక్టర్జీ పరమపదించారు. డాక్టర్డ్ తీవ్ర తపశ్చర్య కారణంగా సంఘం ఇంతింతగా పెరుగుతూ దేశానికి ఒక అశా కేంద్రంగా వెలుగొందుతున్నది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments