Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

కణాదుడు ఏమి చెప్పాడు - about Kanaadudu biography

కణాదుడు: ఆధునిక అణుశాస్త్ర విజ్ఞానానికి మూలపురుషుడు. వైశేషిక దర్శన ప్రవక్త. కణమును గూర్చిన అవగాహనను, విజ్ఞానమును ఈ లోకానికి ఇచ్చినవాడ...



కణాదుడు: ఆధునిక అణుశాస్త్ర విజ్ఞానానికి మూలపురుషుడు. వైశేషిక దర్శన ప్రవక్త. కణమును గూర్చిన అవగాహనను, విజ్ఞానమును ఈ లోకానికి ఇచ్చినవాడు కాబట్టి కణాదుడు అయినాడు. క్రీ.పూ. 600 ప్రాంతంలో వైశేషిక దర్శనంలో చేసిన కణము లేదా అణుశాస్త్రమునకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రపంచామోదాన్ని పొందాయి. పదార్ధములు అణువులతోను, అణువులు ఏ మాత్రం విడగొట్టడానికి అవకాశంలేని సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాణువులతోను ఏర్పడతాయి అని స్పష్టంగా చెప్పాడు.
సకల చరాచర సృష్టి అణునిర్మితమని సిద్ధాంతీకరించాడు. పరమాణువు స్వేచ్ఛాస్థితిలో స్థిరంగా ఉండదని, దీని ఉనికిని స్పర్శతో గుర్తించడం సాధ్యం కాదని అలాగే నాశనం చేయడానికి కూడ వీలుపడదని ఇది ఎల్లప్పుడు తన విశిష్ట లక్షణాలను పోగొట్టుకోకుండా మనగలుగుతుందని చెప్పిన కణాదుని మాటలు శాస్త్రీయ సత్యాలలో విభిన్న పరమాణువుల విలక్షణ కలయికవల్ల పంచభూతాలు ఏర్పడ్డాయని కణాదుని అభిప్రాయం. విలక్షణమైన కలయిక కారణంగానే ప్రత్యేకధర్మాలు సంప్రాప్తమెసోయని చెప్పాడు.
రసాయనిక చర్యలకు ఉష్ణం కీలక ఉత్ర్పేరకసాధనమని ఊహించాడు. కణాదుడు వైశేషిక దర్శనంలోని ప్రథమ సూత్రంలో ధర్మాన్ని గురించి చెప్తూ దేనివలన ఇహలోక, పరలోక సుఖములు కలుగుతాయో అదే ధర్మం అంటూ దానికి వేదప్రమాణము కూడ ఉందని తెలియజేశాడు. ఈ విశ్వం ద్రవ్యం, గుణము, కర్మము, సామాన్యము, విశేషము, సమవాయమనే ఆరులక్షణములతో కూడి ఉంటుందని చెప్పాడు.
అయితే తరువాత భాష్యకారుడైన ప్రశస్తపాదుడు పదార్థరాహిత్యమనే ఏడవ లక్షణాలన్నీ కూడ దానికి జోడించాడు. ప్రపంచమంతా భగవన్మయమని మన ఉపనిషత్తులు ఘోషిస్తుంటే తద్భిన్నంగా అణుమయమని ఆత్మవిశ్వాసంతో ప్రకటించాడు. అవసానదశలో కూడ సహచరులు సృష్టి నారాయణమయవుని చేస్తే మోక్షమొస్తుంది నారాయణ స్మరణచేయమంటే తద్విరుద్ధంగా పీలవః పీలవః (అణువు, అణువు) అంటూనే మరణించాడు. అటువంటి వ్యక్తికి కూడ హిందూ ధర్మ పరంపరలో ఋషిస్థానాన్ని కలిగించటం గమనార్హం.
రెండు పరమాణువులు కలిస్తే ద్వ్యణుకం, మూడు కలిస్తే తణుకం అవుతుందని చెప్పాడు. కణాదుడు ఆత్మ, మనస్సుల గురించి కూడా వివరించి పరమాణువాదం, పరమాణు నిత్యత్వవాదము, షట్పదార్ధవాదము, సృష్టివాదము మొదలైన వాదాలను ప్రతిపాదించాడు. శాస్త్ర ప్రయోజనం ముఖ్యంగా ప్రళయాన్ని కూడ సృష్టించగల విజ్ఞానశాస్త్రం సమాజశ్రేయస్సుకుపయోగపడాలని నిర్దేశించిన శాస్త్రవేత్తలలో కణాదుడు ప్రముఖుడు.
జాతీయ సాహిత్యం కొరకు సంప్రదించండి:

ప్రతులకు : సాహిత్యనికేతన్‌
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్‌ – 500 027
ఫోన్‌ : 040-27563236

సాహిత్యనికేతన్‌, ఏలూరు రోడ్‌,
గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్‌ : 9440643348

No comments