కపిలమహర్షి: ప్రపంచంలోనే మొట్టమొదటి మనస్తత్వ శాస్త్రవేత్త కపిలుడు. ఇతడు "సాంఖ్యదర్శనము" అనే దర్శనాన్ని వ్రాసినాడు. ఒక వస్తువ...
కపిలమహర్షి: ప్రపంచంలోనే మొట్టమొదటి మనస్తత్వ శాస్త్రవేత్త కపిలుడు. ఇతడు "సాంఖ్యదర్శనము" అనే దర్శనాన్ని వ్రాసినాడు. ఒక వస్తువు నుండి మరొక వస్తువు రూపొందుంచున్నదనే పరిణామవాదాన్ని కూడా ప్రతిపాదించాడు. దేవహూతి కర్దముల పుత్రుడు కపిలుడు. కపిలుడు తల్లియైన దేవహూతికి తత్త్వబోధ చేసినాడు, మోక్షము ప్రసాదించినాడు. అమ్మా! జీవుని మనస్సు సంసారమున తగుల్కొని బాధలను అనుభవించుచుండును. ఆ మనస్సే నారాయణనుని యందు తగుల్కొన్నచో మోక్షకారణమగునని చెప్పి భక్తియోగమును సాంఖ్యయోగమును బోధించి తల్లికి మోక్షమును ప్రసాదించినాడు. ఆమె మోక్షమును పొందిన క్షేత్రమే “సిద్దిపదము"గా ప్రసిద్ధి చెందింది.
కపిలుడు అశ్వశిరుడను రాజుతో వస్తువులయందు భగవంతుడున్నాడని నీవు తెలుసుకొన్నచో విష్ణు కటాక్షము నీకు కలుగుతుంది. వేదవిహిత కర్మలను ఆచరించి మోక్షమును పొందుమని చెప్పాడు.
ఒకసారి పుండరీకుడను రాజు మృగయా వినోదార్ధము అడవికి వచ్చి ఒక లేడి పై బాణము వేయగా అది కపిలుని ఆశ్రమమునకు వచ్చి గిలగిల కొట్టుకొని మరణించినది. ఇది చూచి కపిలుడు రాజుతో నోరులేని సాధుజంతువుల చంపుట మహాపాపమని హెచ్చరించి అతనిలో పరివర్తన కలిగించి కర్మ, భక్తి, జ్ఞాన,వైరాగ్యములు బోధించాడు.
మరశ్మీయమను యతీశ్వరుడు కపిలుని వేదప్రామాణ్యతను పరీక్షించగావానితో సంవాదము జరిపి “వేదములే లోకమునకు ప్రమాణం. శబ్దబ్రహ్మ మూలమున పరబ్రహ్మను దర్శింపవచ్చునని” స్పష్టంగా చెప్పినాడు. కపిలుడు సాంఖ్యదర్శనమున మనస్సు యొక్క తత్త్యం గురించి వివరంగా చెప్పాడు. మానవుని కర్మ, జ్ఞానేంద్రి మనసు చెప్పినట్లు నడుచుకొంటాయని, అట్టి మనస్సు కంటే గొప్పది “దానికంటే మహత్తర శక్తి గలది "ఆత్మ" అని, కర్మలకు ఆత్మసాక్షీభూత అంతా శ్రేయోదాయకమౌతుందని విపులంగా చర్చించాడు.
చెడుదారికి వెళ్ళే మనసును కట్టివేసి మంచి మార్గానికి మళ్ళించడానికి నియములని పాటించాలని సూచించాడు, మనస్సు యొక్క ప్రభావం మనిషి ఆరోగ్య0 పై చాలవరకు ఉంటుంది. మనిషికి గల జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మనసు చెప్పినట్లుగా నడుచుకుంటాయి. మనసు కంటే గొప్పదైనది బుద్ధి. ఇంద్రియాలు విషయాన్ని గ్రహించి మనసునకందిస్తే అది బుద్ధికి నివేదిస్తుంది. అప్పుడు అది మంచిచెడులు విచక్షణా జ్ఞానంతో ఆలోచించి కర్తవ్యాన్ని నిర్ణయిస్తుంది. అంటే మనిషి చేసే మంచి చెడులు అతని బుద్ధినిబట్టి నిర్ణయించబడతాయి. అయితే బుద్దికి కూడ అతీతంగా మనిషిలో మరొక మహత్తరమైన శక్తి ఉంటుంది. అదే ఆత్మ. దానికి సుఖదుఃఖలు అనేవి ఉండవు. మనిషి చేసే సమస్త కార్యాలకు శాశ్వతసాక్షి ఆత్మ అని చెప్పాడు.
ఇటువంటి విషయాలన్నీ తన గ్రంథంలో వివరించాడు. మనిషి మనసును అదుపులో పెట్టుకోవడానికి అష్టాంగ యోగవిధిని ఆచరించాలని చెప్పాడు. కపిలుడు తన సాంఖ్యదర్శనంలో పిండోత్పత్తి, గర్భధారణ, శిశూదయం వంటి వైజ్ఞానిక విషయాలను కూడ వివరించి చెప్పాడు. ఏమైనప్పటికి కపిలుడు ప్రపంచంలోనే మొట్టమొదటి “మనస్తత్వ సిద్ధాంతకర్త" అని చెప్పడంలో సందేహం లేదు.
జాతీయ సాహిత్యం కొరకు సంప్రదించండి:
ప్రతులకు : సాహిత్యనికేతన్
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్ – 500 027
ఫోన్ : 040-27563236
ప్రతులకు : సాహిత్యనికేతన్
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్ – 500 027
ఫోన్ : 040-27563236
సాహిత్యనికేతన్, ఏలూరు రోడ్,
గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్ : 9440643348
చాలా మంచిగా వివరించారు
ReplyDeletetq brother
Delete