Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

మహాత్మాజ్యోతి రావు ఫులే జీవితం - jyotirao phule biography in telugu

జ్యోతిరావు ఫూలే : మహాత్మాజ్యోతిరావు ఫులేగా లోకప్రసిద్ధి చెందినవాడు. అస్పృశ్యతా నిర్మూలనకు నిరంతరం శ్రమించిన మహాత్ముడు. 1827లో మహారాష్ట...



జ్యోతిరావు ఫూలే : మహాత్మాజ్యోతిరావు ఫులేగా లోకప్రసిద్ధి చెందినవాడు. అస్పృశ్యతా నిర్మూలనకు నిరంతరం శ్రమించిన మహాత్ముడు. 1827లో మహారాష్ట్రలో జన్మించారు. సమాజంలో ఉపేక్షితులు, అంటరానివారు మరియు స్త్రీలు పడుతున్న కష్టాలను చూసి వారిని ఉద్ధరించడానికి సమాజాన్ని సంస్కరించడానికి మిక్కిలి కృషి చేసిన వ్యక్తి,పూణేలో విద్యార్థిగా ఉన్నప్పటినుంచీ వీరిలో ఈ భావాలుండేవి. విద్య ఆధారంగా స్త్రీలను, ఉపేక్షిత బంధువులను ఉద్ధరించవచ్చునని భావించి పాఠశాలలను స్థాపించారు. అందులో స్వయంగా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. స్త్రీ విద్యను ప్రోత్సహించారు.
 
హరిజనులు మరియు స్త్రీల కొరకు విద్యాలయాలను ప్రారంభించిన మొట్టమొదటి సంస్కర్త వీరు. నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టాలని హంటర్ కమీషన్ ను వీరు కోరారు. సామాజిక సమతను సాధించడం కోసం అస్పృశ్యతకు విరుద్ధంగా పోరాటం చేశారు. వారు 1874వ సం.లో సత్యశోధక సమాజ్ అనే సంస్థను ప్రారంభించి దానిద్వారా హిందూ సమాజంలోని అవకతవకలను అంటరానితనాన్ని,అసమానతలను లోకం గుర్తించేలా చేశారు. విశాల మానవధర్మానికి సంబంధించిన అవగాహన కలిగించే ప్రయత్నం చేశారు.
 
భర్త చనిపోయిన విధవరాలైన స్త్రీలకు శిరోముండనం చేసే పద్ధతిని తీవ్రంగా వ్యతిరేకించారు. అనాథ బాలికలకు నిరాశ్రిత స్త్రీలకు అనాథాశ్రమాలను ప్రసూతి గృహాలను నడిపించారు. హేతువాదులను, అంధవిశ్వాసపరులను తీవ్రంగా విమర్శించేవారు. హిందువుల ఆచారాలలో కర్మకాండలలో ఎన్నో మార్పులను తీసుకువచ్చి జీవన పర్యంతం సామాజిక న్యాయంకోసమే పోరాడిన మహాత్మాజ్యోతిబాపులే 1890 నవంబరు 28న పరమపదించారు.




ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

1 comment

  1. In his book, Gulamgiri, he thanked Christian missionaries and the British colonists for making the exploited castes realise that they are worthy of all human rights. The book, whose title transliterates as slavery and which concerned women, caste and reform, was dedicated to the people in the US who were working to end slavery.

    Phule saw Rama, the hero of the Indian epic Ramayana, as a symbol of oppression stemming from the Aryan conquest.His critique of the caste system began with an attack on the Vedas, the most fundamental texts of Hindus. He considered them to be a form of false consciousness.

    ReplyDelete