Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

రణజిత్ సింహుడి జీవితం - ranajit simha life

రణజిత్ సింహుడు : పంజాబులో సిక్కు సామ్రాజ్యాన్ని స్థాపించి నలభై ఏళ్ళపాటు పరిపాలించిన మహారాజు, మహా పరాక్రమవంతుడు. ఈయన జమ్మూకాశ్మీరు మరి...



రణజిత్ సింహుడు : పంజాబులో సిక్కు సామ్రాజ్యాన్ని స్థాపించి నలభై ఏళ్ళపాటు పరిపాలించిన మహారాజు, మహా పరాక్రమవంతుడు. ఈయన జమ్మూకాశ్మీరు మరియు పంజాబును కలిపి శక్తివంతమైన సుసంపన్నమైన సువిశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు.
మహారాజ రణజిత్ సిం హ సామ్రాజ్యం
హరిసింహనల్వా, మరియు జొరావరసింహ వంటి పరాక్రమవంతులైన సైన్యాధిపతుల నాయకత్వంలో దృఢమైన సంఘటితములైన సేనాశక్తి సహాయంతో రాజ్య సరిహద్దులలో సింధునదికి ఉత్తరభాగాన ఉన్న క్రైబరు కనుమ నుండి త్రివిష్టపము మీదుగా యమునా నదీ పశ్చిమ తీరము వరకు విస్తరించి ఉన్న ప్రదేశానికి ఒక భౌగోళిక, రాజకీయ ఏకతాస్వరూపాన్ని కలిగించాడు.
ఆయన రాజ్యంలో మతాధికారుల ఒత్తిడులకులోనై పరిపాలన సాగలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాధారితంగా రాజ్యం సాగింది. రణజిత్ సింహుడు తన రాజ్యంలో గోహత్యా నిషేధాన్ని పటిష్టంగా అమలుచేశాడు. ఈ ప్రభావంతోనే ఆఫ్ఘనిస్థాన్ లోని శాసకులతో గూడ సంప్రదించి, అక్కడ గూడ గోహత్యా నిషేధం అమలు జరిగేలా చూశాడు.
మహమ్మద్ గజనీ దొంగిలించుకుపోయిన సోమనాథమందిరం యొక్క అత్యంత విలువైన ముఖద్వారాన్ని తిరిగి భారతదేశానికి తీసుకువచ్చే ప్రయత్నం, పట్టుదల, దృఢనిశ్చయాలు అతనిలో ఉండేవి. రణజిత్ సింహుడు జీవించి ఉన్నంతవరకు ఆంగ్లేయులు తమ కూటనీతిని పంజాబులో ప్రవేశపెట్టడంలో సమర్థులు కాలేకపోయారు.


జాతీయ సాహిత్యం కొరకు సంప్రదించండి:
ప్రతులకు : సాహిత్యనికేతన్‌
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్‌ – 500 027
ఫోన్‌ : 040-27563236
సాహిత్యనికేతన్‌, ఏలూరు రోడ్‌,
గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్‌ : 9440643348

No comments