Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

వరాహమిహిరుడి జీవితం - varahamihira history in telugu

వరాహమిహిరుడు: "గెలిచింది నేను కాదు, నా జ్యోతిషశాస్త్రం” అని ఆత్మవిశ్వాసంతో ఒప్పుకున్న గొప్ప జ్యోతిషశాస్త్రవేత్త, భూమి గోళాకారంగా...



వరాహమిహిరుడు: "గెలిచింది నేను కాదు, నా జ్యోతిషశాస్త్రం” అని ఆత్మవిశ్వాసంతో ఒప్పుకున్న గొప్ప జ్యోతిషశాస్త్రవేత్త, భూమి గోళాకారంగా ఉంటుందని భూమికి గొప్ప ఆకర్షణ శక్తి ఉందని కాబట్టి అనేక వస్తు, జీవసముదాయాన్ని భూమి ఆకర్షించి ఉంచుతోందని ఈ లోకానికి మొట్టమొదటిగా తెలియచెప్పినవాడు వరాహమిహిరుడు.
మిహిరుడు అంటే సూర్యుడు అని అర్థం. పేరుకు తగ్గట్టే బహుముఖ ప్రజ్ఞావంతుడు . క్రీ.శ. 499లో ఉజ్జయినీలోని కపిత్థలో జన్మించినాడు. మగధ సామ్రాజ్య విక్రమాదిత్యునిగా పిలువబడిన రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలో నవపండితులలో ఒక పండితునిగా ప్రసిద్దికెక్కాడు. మహారాజునకు సంతానం కలిగినపుడు గ్రహ గమనాన్ని లెక్కగట్టి ఈ బాలునికి 18వ యేట వరాహం కారణంగా సంభవిస్తుందని జోస్యం చెప్పాడు. అతని జోస్యం యధార్థ కాగా మగధ సామ్రాజ్యం అత్యున్నత పురస్కారమైన వరాహ చిహ్నపతాకాన్ని పొంది వరాహమిహిరుడుగా లోకప్రసిద్ది చెందాడు. సంతానం కలిగినపుడు అప్పటి నక్షత్రాలకు చలనం ఉండదు. కాని సపర్షిమండలం అని పిలువబడే నక్షత్రాలు కదులుతాయని, అగస్త్య(కనోపస్) అనే నక్షత్ర గమనానికి సంబంధించిన వివరణను ఇచ్చాడు. కోల్బ్రూక్ అనే పాశ్చాత్య ఖగోళశాస్త్రవేత్త దీన్ని అంగీకరించాడు.
వరాహమిహిరుడు పంచసిద్ధాంతక, బృహత్ సంహిత, స్వల్పసంహిత, వివాహపటల, బృహద్వి వాహపటల, లఘుజాతక, బృహజ్జాతక గ్రంథాలను రచించాడు. ఖగోళశాస్త్రానికే ఆదిగ్రంథమని చెప్పుకోదగిన పంచసిద్దాంతిక గ్రంథంలో సూర్యసిద్ధాంత అధ్యాయంలో సౌరశక్తి (సోలర్ ఎనర్జి) ప్రస్తావన ఉంది. వీరి బృహత్ సంహిత గ్రంథంలో నేటి ఆధునికశాస్త్ర విభాగాలైన పర్యావరణము (ఇకాలజీ) భూగర్భజలశాస్త్రము (హైడ్రోలజీ) భూగర్భశాస్త్రము (జియాలజీ)లకు మూలమైన సిద్ధాంతాలను వివరించాడు.
చంద్రగ్రహంయొక్క భ్రమణ కక్ష్య కారణంగా ఒక దిశ ప్రకాశవంతంగానూ రెండవది యెప్పుడూ చీకటి గానూ ఉంటుందని ప్రపథమంగా లోకానికి తెలియజెప్పాడు. భూమి పై పెరుగుతున్న వృక్షజాలాన్ని అనుసరించి బదరీ, రోహిత వృక్షములు మూడున్నర అడుగుల దూరంలో 120 అడుగుల లోతున మంచినీరు పడులు చెప్పాడు. ఈ శాస్త్రంలోనే అనేక వివరణలు కూడ ఇచ్చాడు.
జాతీయ సాహిత్యం కొరకు సంప్రదించండి:

ప్రతులకు : సాహిత్యనికేతన్‌
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్‌ – 500 027
ఫోన్‌ : 040-27563236

సాహిత్యనికేతన్‌, ఏలూరు రోడ్‌,
గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్‌ : 9440643348

No comments