సుబ్రహ్మణ్య భారతీ : 20వ శతాబ్దికాలంలో తమిళనాడు ప్రాంతంలో జన్మించిన ప్రముఖ జాతీయకవి. వీరు సరళమైన భాషలో సహజసిద్ధమైన రీతిలో రచనలు చేసి, ...
సుబ్రహ్మణ్య భారతీ : 20వ శతాబ్దికాలంలో తమిళనాడు ప్రాంతంలో జన్మించిన ప్రముఖ జాతీయకవి. వీరు సరళమైన భాషలో సహజసిద్ధమైన రీతిలో రచనలు చేసి, కవితలు వ్రాశారు. సమస్త భారతమూ ఒక్కటే అనే జాతీయ భావయుక్తమైన కవితలతో లక్షలాది ప్రజల హృదయాలలో దేశభక్తిని జాగృతమొనరించారు. వారు తమయొక్క తీవ్రమైన జాతీయరచనల కారణంగా అనేక పర్యాయములు బ్రిటిష్ ప్రభుత్వముచే బంధింపబడి కారాగార జీవితమునననుభవించారు.
రాజకీయదృష్టితోనాలోచిస్తే వారిది అతివాదవర్గంగా గోచరిస్తుంది.సుబ్రహ్మణ్య భారతీగారు యోగి అరవిందుడు, చిదంబరం పికై, బి.వి. ఎస్. అయ్యర్ మొదలగు దేశభక్తులతో పాటు స్వాతంత్ర్య సంగ్రామ వీరులతో అతి సున్నితంగా, మెలగినవ్యక్తి.
వైష్ణవభకులైన ఆళ్వారులు, శైవభక్తులైన నాయన్మారుల రచనాశైలి కనుసరణీయంగా వీరు అనేక భక్తి గీతాలను రచించారు. వీరు దేశభక్తులేగాక గొప్ప సంఘసంస్కర్త కూడా. హిందూ సమాజంలోని కురీతులను తొలగించే ప్రయత్నం చేశారు.
మహిళా స్వాతంత్ర్యము, ఉచ్ఛనీచకులాల మధ్య భేదములేని సమానతా భావము, అస్పృశ్యతా నివారణ మొదలగు విషయములలో మిక్కిలి కృషి చేసిన మహాపురుషుడు. ఆధునిక తమి సాహిత్యంలోని నూతన ప్రక్రియలకు భారతీ మహాకవే శ్రీకారం చుట్టాడు. వీరు భారతీయ ఋషి మునుల సాధుసంతుల ఆధ్యాత్మిక, సాంస్కృతిక భావాలను తన రచనల ద్వారా సామాన్య జనులకు తెలియపరచడంలో మహత్వపూర్ణమైన కృషిచేశారనడంలో సందేహమే మాత్రం లేదు.
జాతీయ సాహిత్యం కొరకు సంప్రదించండి:
ప్రతులకు : సాహిత్యనికేతన్
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్ – 500 027
ఫోన్ : 040-27563236
సాహిత్యనికేతన్, ఏలూరు రోడ్,
గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్ : 9440643348
ప్రతులకు : సాహిత్యనికేతన్
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్ – 500 027
ఫోన్ : 040-27563236
సాహిత్యనికేతన్, ఏలూరు రోడ్,
గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్ : 9440643348
No comments