Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

సుఖ్ దేవ్ థాపర్ జీవితం - sukhdev thapar biography in telugu

15 మే   1907  -  మార్చి 23 ,  1931 సుఖ్ దేవ్ థాపర్ : భారత ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమర యోధుడు . భగత్ సింగ్ మరియు రాజ్‌గురు ...

సుఖ్ దేవ్ థాపర్: భారత ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. భగత్ సింగ్ మరియు రాజ్‌గురు ల సహచరునిగా స్వాతంత్ర్యం కోసం పనిచేశారు. 1928 లాలా లజపతి రాయ్ మరణానికి కారణమైన బ్రిటిష్ ప్రభుత్వం పై పగతీర్చుకోవడానికి, ఫిరోజ్ పూర్ లో బ్రిటిష్ పోలీసు అధికారి జె.పి. సాండర్స్ ను హత మార్చినందుకు 23 మార్చి 1931 న బ్రిటీష్ ప్రభుత్వం ఉరితీసింది.
భగత్ సింగ్ , రాజ్ గురు, సుఖ్ దేవ్ లను 1931 మార్చి 23న లాహోరు జైలులో సాయంత్రం 7.33 నిమిషాలకు ఉరి తీశారు. అప్పటి నిబంధనల ప్రకారం ఆ సమయంలో ఉరి శిక్ష అమలు జరపకూడదు కాని బ్రిటీష్ ప్రభుత్వ కుటిల నీతి కారణంగా. వారి మృత దేహాలను రహస్యంగా, జైలు గోడలు పగులగొట్టి తీసికొని వెళ్ళి సట్లెజ్ నది తీరాన హుస్సేన్‌వాలా అనే ఊరిలో దహనం చేశారు. మృత దేహాలను చూసిన ప్రజలలో అలజడిని ఎదుర్కోకుండా ఇలా చేశారు.
సుఖదేవ్ హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అనే సంస్థలో ముఖ్యమైన నాయకుడు. లాహోర్ నేషనల్ కాలేజిలో భారత పురాతన ఔన్నత్యాన్ని అధ్యయనం చేయడానికి, ప్రపంచ విప్లవ పరిణామాలు పరిశీలించడానికి ఒక అధ్యయన కేంద్రాన్ని (స్టడీ సర్కిల్) ప్రాంభించాడట. తన సహచరులైన భగత్ సింహ్, భగవతీ చరణ్ వోహ్రా లతో కలిసి లాహోరులో నవ జవాన్ భారత సభ ప్రారంభించాడు. దేశ స్వాంతంత్ర్యానికి యువతను ఉత్తేజితులను చేయడం, సమరసతను, స్వాతంత్ర్య చైతన్యం ను రగిలించడం ,అంటరానితనాన్ని అరికట్టడం ఆ సంస్థ ఆశయాలు.
పండిట్ రామప్రసాద్ బిస్మిల్, చంద్రశేఖర ఆజాద్‌ల ప్రభావం సుఖదేవ్‌పై బలంగా ఉండేది. ఖైదీలపట్ల చూపుతున్న అమానుష విధానాలకు వ్యతిరేకంగా 1929లో జరిగిన నిరాహార దీక్షలో సుఖదేవ్ పాల్గొన్నాడు. సుఖదేవ్‌ను ఉరి తీయడానికి ముందు అతను మహాత్మా గాంధీకి ఒక లేఖ వ్రాశాడు. విప్లవ మార్గంలో ఉద్యమిస్తున్న వారిపట్ల మహాత్మా గాంధీ అనుసరిస్తున్న ప్రతికూల ధోరణిని ఈ లేఖలో సుఖదేవ్ విమర్శించాడు. సుఖదేవ్‌కు ఉరి శిక్ష వేయడానికి ఆధారమైన ప్రధాన సాక్ష్యం హంసరాజ్ వోహ్రా ఇచ్చాడు. అయితే సుఖదేవ్ స్వయంగా నేరాన్ని అంగీకరించాడని వోహ్రా చెప్పాడు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవం, భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు, దేశం కోసం పోరాడిన వీరులు, స్వాతంత్ర్య సమరయోధుల గురించి, భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు, స్వాతంత్ర్య సమరయోధులు పేర్లు మరియు జీవిత చరిత్రలు తెలుసుకోవడానికి మన వెబ్ సైట్ ని అందరికీ పంపగలరు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia



జాతీయ సాహిత్యం కొరకు సంప్రదించండి:
ప్రతులకు : సాహిత్యనికేతన్‌
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్‌ – 500 027
ఫోన్‌ : 040-27563236
సాహిత్యనికేతన్‌, ఏలూరు రోడ్‌,
గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్‌ : 9440643348

No comments