దేశంలోని గిరిజన తెగలు ఒక్కో తెగ లో ఒక్కొక్క విధంగా వివాహాలు జరుగుతుంటాయి. మధ్య ప్రదేశ్ లోని గిరిజన ఝరువా, థార్ మరియు పశ్చిమ నియర్ జిల్ల...
దేశంలోని గిరిజన తెగలు ఒక్కో తెగ లో ఒక్కొక్క విధంగా వివాహాలు జరుగుతుంటాయి. మధ్య ప్రదేశ్ లోని గిరిజన ఝరువా, థార్ మరియు పశ్చిమ నియర్ జిల్లాలో ఎక్కువగా భీల్ మరియు బిలాల్ గిరిజన తెగల వారున్నారు. హౌళికి ముందు 8 రోజులపాటు వారు కొత్త వారిని కలుస్తారు. వంశపారంపర్యంగా వస్తున్న “టిండర్” వద్దతిలో నూతన వరిచయాలు హోళీవరకు కొనసాగుతాయి.
వారపు సంతలు గ్రామీణ మార్కెట్ ఇందుకు వివాహ సంబంధాలు నిశ్చయమయ్యే ప్రదేశంగా మారుతాయి. వాటిని “భగోరియా”అంటారు. హోళి పండుగ సమయంలో ఇవి జరుగుతాయి. పురుషుడు తమకు కాబోయే వధువు ఎంచుకొని గులాల్ను ఆమె ముఖానికి రాస్తాడు. ఆమెకు కూడా అతను నచ్చితే, ఆమె కూడా గులాల్ రాస్తుంది. వారు ఒకరికొకరు నచ్చకపోతే దాన్ని తుడిచేసుకుని ఎవరిదారినవారు వెళ్ళిపోతారు. ఒకరికొకరు తోడు అవ్వడం కీళ్ళీ (పాన్) నమలడం తో ప్రారంభమవుతుంది. ఆ తరువాత వారిద్దరూ ఎవరికి తెలియకుండా కొద్ది రోజులు మాయమైపోతారు.
వీరి కుటుంబం వీరి గురించి అన్నిచోట్ల వెతికి కనపడకపోతే గిరిజన పంచాయతీ ని ఆశ్రయిస్తారు గ్రామ సభ కు ఈ విషయాన్ని పరిష్కరించే అధికారం ఉంటుంది. వివాహం విషయంలో వంశపారంపర్యంగా వచ్చే పద్ధతి చివరకు అవలంబిస్తారు. పెండ్లి, భూ పంపకం తదితర సమస్యలు గ్రామసభ దే తుది నిర్ణయం. గ్రామపంచాయతీ పెండ్లి కుమార్తె కు ఒక ధర నిర్ణయించిన తర్వాత ఆమెకు అతనికి వివాహం జరుగుతుంది.
2011 జనాభా లెక్కల ప్రకారం 46,18,008 మంది భిల్లులు, భిలాయి, మధ్యప్రదేశ్ లో అత్యధిక సంఖ్య లో ఉంటారు. వీరి తర్వాత గోండులు 43,57,918 మంది జనాభా ఉంటుంది.
టాండ్లో పట్టణంలో భగోరియా సంత ఫిబ్రవరి 27వ తేదీన అత్యంత ఆనందదాయకం గా ఉంటుంది. వషవస్తూనియా, మేధానాయక్ (18 ఏళ్ల వారు) మరియు ఆరుగురు స్త్రీలు ఒక బృందం గా తయారై ఒకే విధమైన దుస్తులు ధరించి, ఆభరణాలు, కేశాలంకరణ ఒకేవిధంగా ముస్తాబవుతారు. వారిని కొంతమంది యువకులు అనుసరిస్తారు.
వీరు ఒకేరకంగా దుస్తులు ధరించడం వల్ల వారు ఏ ఊరికి చెందినవారు సులువు గా తెలుస్తుంది. దీని మూలంగా భడోరియా లో వివాహం నిశ్చయమవ్వడం జరుగుతుంది. వీరికి హోళి, ఒక పెద్ద పండుగ.
బిల్ మరియు భిలాయి తరతరాలుగా హోళి పండుగ జరుపుకోని, అక్కడ పండిన పంటలు ఆనందంగా గడుపు తున్నారు. వరుడు, వధువు కట్నం చెల్లించేపధ్ధతి ఇప్పటికీ వారిలో ఉంది. ప్రతీ వారం సంత జరుగుతుంది. పెళ్ళిళ్ళకు భ గోరియూ బాగా ఉపయోగపడుతుంది. పరస్పరం ఏ విధమైన గొడవలు జరగవు. నృత్యాలలో గాని, తాగుడులో గాని ఎటువం గొడవలు జరగకుండా అందరూ సంతోషంగా ఉత్సవం జరుపుకుంటారు.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia
జాతీయ సాహిత్యం కొరకు సంప్రదించండి:
ప్రతులకు : సాహిత్యనికేతన్
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్ – 500 027
ఫోన్ : 040-27563236
సాహిత్యనికేతన్, ఏలూరు రోడ్,
గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్ : 9440643348
ప్రతులకు : సాహిత్యనికేతన్
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్ – 500 027
ఫోన్ : 040-27563236
సాహిత్యనికేతన్, ఏలూరు రోడ్,
గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్ : 9440643348
No comments