మాన్సీ.. మనిషి కాదు.. భారత రక్షణ దళానికి చెందిన కుక్క. వయస్సు నాలుగేళ్లు. కానీ కశ్మీర్ లోయలో ఉగ్రవాద వ్యతిరేక పోరాట చరిత్రను వ్రా...
మాన్సీ..
మనిషి కాదు..
భారత రక్షణ దళానికి చెందిన కుక్క.
వయస్సు నాలుగేళ్లు.
కానీ కశ్మీర్ లోయలో ఉగ్రవాద వ్యతిరేక పోరాట చరిత్రను వ్రాసినప్పుడు మాన్సీ పేరు కూడా వ్రాయాల్సిందే. మాన్సీ శ్రీనగర్‌కు 150 కిలోమీటర్ల దూరంలోని టంగ్ ధర్ సెక్టర్‌లో ఉగ్రవాదులను మట్టుపెట్టింది. చొరబడకుండా నిలువరించింది.
మాన్సీతో పాటు బషీర్ అహ్మద్ వార్ కూడా ఈ పోరాటంలో పాల్గొన్నాడు.
మాన్సీ పోరాడుతూ పోరాడుతూ బుల్లెట్ తగిలి ప్రాణాలు విడిచింది.
మాన్సీతో పాటు బషీర్ అహ్మద్ వార్ కూడా ప్రాణాలు విడిచాడు. కానీ ఇద్దరూ శత్రువులను లోపలికి రానీయలేదు.
నాలుగేళ్ల మాన్సీ, బషీర్ అహ్మద్ వార్‌ల వీరోచిత పోరాటగాథను, త్యాగాల కథను మిలటరీ గర్వంగా తలచుకుంటోంది. ఈ గాథ మిలటరీ సంస్కతిలో మెన్షన్ ఇన్ డిస్పాచెస్ (సర్వోచ్చ అధికారికి వ్రాసే సమాచార లేఖలో ప్రస్తావించడం) ను సాధించడం చాలా పెద్ద విషయం. అదొక గొప్ప గౌరవం.
అది మాన్సీ, వార్‌లకు దక్కింది.
మాన్సీ పని బాంబులను గుర్తించడం, ఉగ్రవాదులను పట్టుకోవడం, సరిహద్దు కంచెకి అవతల కదలికలను పసిగట్టడం. సైనికుడెంత సన్నద్ధంగా ఉంటాడో మాన్సీ అంతే సన్నద్ధంగా ఉంటుంది. జవానెంత నిఘా పెడతాడో, మాన్సీ కూడా అంతే నిఘా పెడుతుంది.
సైనికులు కూడా మాన్సీని తమలో ఒకరిగా భావించారే తప్ప ఇంకొకటిగా కాదు. మాన్సీ బషీర్‌కి సహాయకారి. కాని బషీర్ అహ్మద్ వార్‌కి మాన్సీ సొంత సంతానంతో సమానం.
ఆగస్టు 11, 2016 న ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా వద్ద ఉన్న టంగ్ ధర్ సెక్టర్‌లో వార్, మాన్సీలు కాపలా కాస్తున్నారు. ఉన్నట్టుండి సరిహద్దుకి అటువైపు ఏవో కదలికలు… మాన్సీ చెవులు నిక్కబొడుచుకున్నాయి. ఒక్క ఉదుటున అటుకేసి చూసింది. వార్‌ను అటువైపు లాగింది. వార్ అప్రమత్తం అయ్యాడు. బెంబేలెత్తిన పాకిస్తానీ చొరబాటుదారు ముందు మాన్సీపై కాల్పులు జరిపాడు. ఒక తూటా మాన్సీకి తగిలింది. మాన్సీ రక్తసిక్తం కావడంతో వార్ అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. శత్రువుపై తూటాల వర్షం కురిపించాడు. శత్రువు తూటా వార్‌కు కూడా తగిలింది.
అంతలో మన అదనపు బలగాలు వచ్చాయి. శత్రువు తోక ముడిచాడు. ఒక సైనికుడు గాయపడితే ఎంత ఆందోళన చెందుతారో అంతే ఆందోళనతో మాన్సీని ఆస్పత్రికి తరలించారు. కానీ మాన్సీ, వార్‌లు దారిలోనే మరణించారు.
గతేడాది కైసూరీ రిడ్జ్‌లో ముగ్గురు ఉగ్రవాదులను పసిగట్టి పనిపట్టారు మాన్సీ, వార్‌లు. ఒక నెల క్రితమే ఇంకో ఉగ్రవాదిని మట్టుపెట్టారు. చివరికి పోరాడుతూనే, దేశరక్షణ కోసం పనిచేస్తూనే మాన్సీ, వార్‌లు కూడా సర్వోచ్ఛ త్యాగం చేశారు. ట్రెగామ్‌లోని సైనిక స్థావరంలో సకల సైనిక మర్యాదలతో మాన్సీకి అంత్యక్రియలు జరిగాయి.
మరణానంతరం మాన్సీకి ఆర్మీ చీఫ్ ప్రశంసా పత్రం అందించారు. మాన్సీ వంటి అనేక వీర శునకాలు సరిహద్దుల్లో తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాయి. దేశం నుంచి సకల సదుపాయాలూ పొందుతున్నా చివరికి పాకిస్తాన్ జిందాబాద్ అనో, కనిపించని ఖలీఫా బగ్దాదీ జెండా మోస్తూనో ఉండే వారి కన్నా మాన్సీ లాంటి కుక్కలే నయం. వాటికి దేశభక్తి ఉంది.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia
No comments