స్వదేశ స్వాతంత్ర్యానికి తమ సమాజం యొక్క స్వేచ్ఛ కోసం అనితర త్యాగం చేసిన జనజాతి వీరులెవ్వరూ చరిత్ర కోసం, పేరు ప్రతిష్ఠలకోసం పోరాడలేదు. స్వ...
స్వదేశ స్వాతంత్ర్యానికి తమ సమాజం యొక్క స్వేచ్ఛ కోసం అనితర త్యాగం చేసిన జనజాతి వీరులెవ్వరూ చరిత్ర కోసం, పేరు ప్రతిష్ఠలకోసం పోరాడలేదు. స్వభావసిద్దంగా అది తమ బాధ్యత గా భావించి పోరాటాలు చేసారు, అయితే వారి గురించి సమగ్రమైన చరిత్ర ఉంటే వారి త్యాగాలు ఎన్నెన్నో తరాలకు ప్రేరణను ఇచ్చేవి.
ఎలాంటి ప్రయత్నాలు అంతగా లేకున్నా నేటికీ అనేక మంది చరిత్ర కారులు సామాజిక శాస్త్రవేత్తలు, జన జాతి వీరులు హృదయాల్లో నిలిచిన వీరుడు బిర్సా ముండా, ఇతడి సాహసాలు మొదటిసారిగా వెలుగులోకి వచ్చింది 1940లో అవి ఎలా అంటే రాంచీ దగ్గర్లో రాయ్గఢ్ ప్రాంతంలో కాంగ్రెస్ సమావేశాలు కార్యక్రమానికి ముఖ్య ద్వారం ఫై ‘బిర్సాముండా” మీద గౌరవంతో ఆయన పేరు పెట్టారు. అటు తర్వాత ఆ వనవీరుడికి సముచిత గౌరవం ఇవ్వడం లో బీహార్ గవర్నర్ (అనంత శయనం అయ్యంగార్) కూడా ముందున్నారు. అతడి యొక్క భారీ విగ్రహాన్ని పెట్టించి దాన్ని ఆవిష్కరించారు. అప్పటి నుంచి 1966 నుంచి ఆ స్మారకం దగ్గర అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు.
బిర్సా ముండా 19వ శతాబ్దానికి చెందిన ఒక ప్రముఖ వనవాసీ ప్రజా నాయకుడు. ఆయన నేతృత్వంలో 19వ శాతాబ్దంలో చివరి సంవత్సరాల్లో ఉల్గులాన్ అనే పేరుతో ఒక గొప్ప ఉద్యమం నడిపించారు. ముండా జనజాతి వారు బిర్సాను సాక్షాత్ భగవత్స్వరూపంగా భావిస్తారు.
సుగుణా ముండా, కర్మీ హాతుల కుమారుడైన బిర్సా, 1875 నవంబర్ 15వ తేదీన ఝార్ఖండ్ రాష్ట్రం రాంచీలో ఉలీహతు గ్రామంలో జన్మించారు. సాల్గా గ్రామంలో ప్రాధమిక విద్య తర్వాత ఆయన ఛైబాసా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదువుకున్నారు. ఆయన ఆ సమయంలో ఎప్పుడూ బ్రిటిష్ పాలకుల అరాచకం వల్ల తన సమాజం ఎదుర్కొంటున్న దుస్థితి గురించి ఆలోచించేవారు. ముండా జనజాతివారిని ఆంగ్లేయుల నుంచి విముక్తి చేసేందుకు ఒక ఉద్యమానికి నేతృత్వం వహించారు.
అటు తర్వాత ఇతడి కార్యకలాపాలను పరిశీలిస్తూ వచ్చిన ఆంగ్లేయ దినపత్రిక 'ఇంగ్లీషు మేన్' అప్పటి ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఇది ఈనాడు చిన్న తిరుగుబాటు గా కనిపించినా రానున్న కాలంలో చాలా పెద్ద సమరంగా మారవచ్చు అని సూచనలు పంపింది. ఆనాటికి తిరుగుబాటుదారులు సంఖ్య ఒక వంద వరకు ఉండవచ్చు. కానీ రాబోయే కాలంలో అది. వేలల్లో చేరుకోవచ్చు. అదే సమయంలో దాదాపు 400 మంది ముండా జనజాతీయులను ఆంగ్లేయులు కాల్చి చంపారు. ఎవరికీ తప్పించుకునే అవకాశం కూడా ఇవ్వలేదు.
బిర్సాముండా అంగ్లేయులకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని అణిచివేయడానికి ముండా ఇంకా కోల్ జనజాతి వారిని దాదాపు 40 మందిని జైల్లో బంధించారు. అది కూడా చాలా సుదీర్ఘకాలానికి.
జైలులో బిర్సాముండా ఎప్పుడు మరణించారు ఎవరికీ తెలియదు. (1900 జూన్ 9వ తేదీన బిర్సా తుది శ్వాస విడిచినట్లు సమాచారం ఇచ్చారు) అయితే తన పోరాటంలో అతడు అంతగా ప్రఖ్యాతి పొందాను అంటే ఆనాటి పత్రికల నీ ముక్తకంఠంతో బ్రిటీష్ వారి దమనకాండ ని నిరసన తెలిపాయి. తానొక్కండై మొత్తం ముండా సమాజాన్ని తన వెంట నడిపించిన నాయకుడు బిర్సాముండా, చివరికి తన వారి స్వాతంత్ర్యం కోసం ఆంగ్లేయుల తుపాకీ గుళ్ళు కి బలి అయ్యాడు.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia
No comments