శత్రురాజులు నుండి తన రాజు ను రాజ్యాన్ని కాపాడుకునేందుకు జరిగిన యుద్ధంలో వీర మరణం పొందిన సైనికాధ్యక్షుడు కూరం వీరస్వామి శత్రుమూకలను చీల్...
శత్రురాజులు నుండి తన రాజును రాజ్యాన్ని కాపాడుకునేందుకు జరిగిన యుద్ధంలో వీర మరణం పొందిన సైనికాధ్యక్షుడు కూరం వీరస్వామి శత్రుమూకలను చీల్చి చెండాడుతూ వీర మరణం పొందిన భర్త ఎడబాటు బాధ ఒకవైపు సంప్రదాయం కాపాడే తపన మరోవైపు లేనిదైర్యాన్ని తెచ్చుకుని భర్త శవాన్ని స్వయంగా తెచ్చుకుని వీరుడైన భర్తకు ఊరి చివర చితిపేర్చి దహన సంస్కారం చేసి నాటి ఆచారం ప్రకారం తను చితి మంటల్లో కూర్చుని ఆత్మాహుతి చేసుకున్న వనవాసి వీర వనిత. ఇదంతా చరిత్రకెక్కని యదార్థ వనవాసి గాథ.
వనవీరుల పౌరుష ప్రతాపం దేశభక్తి, త్యాగనిరతిని చాటే వీరోచిత పోరాట గాథ ఇది. వివరాల్లోకి వెళితే కాకతీయుల ఓరుగల్లు ను రాజధానిగా చేసుకుని రాజ్యం ఏలుతున్న రోజులు. నేటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల ప్రాంతం చిన్న సామంత రాజ్యం గా వుండి గడికోట (మట్టి కోటలు) రక్షణతో పాలన సాగుతుండేది. దీనికి సామంతరాజు 'మేదినీ రాయుడు'. చుట్టుపక్కల గిరిజన గూడేలకు చెందిన వనవాసి ఈ యువకులు అతనికి గల సైన్యం సమీప గిరిజన గూడేలు అయిన తిప్పాపురం, చినముసిలేరు, పెదముసిలేరు మొదలైన గూడెలకు చెందిన వనవాసి యువకులే ఎక్కువగా ఈ గడీ కోటలో సైనికులు గా పని చేసేవారు.
ఈ యువకులందరికీ నాయకుడు 'కూరం వీరాస్వామి' ఎత్తైన మనిషి, పొడవైన చేతులు బార్ జుట్టు స్థంబాల వంటి కాళ్ళు కలిగి శత్రువులను మట్టు పెట్టడం లో మంచి నేర్పరి బాణం తోపాటు బల్లెం అనబడే గొరకతో సూటిగా విసిరి శత్రువు ను చంపడం అతడికి అలవోకగా అబ్బినవిద్య, అది అతడిని మేదినీ రాయుని వద్ద సర్వసైన్యాధ్యక్షునిగా చేసింది. ప్రతిరోజు తన గూడెం తిప్పాపురం నుంచి గుర్రంపై గండికోటకు పోయి పొద్దు పోయే వరకు తన సేవలు అందించి రాత్రి దివిటీ వెలుతురు తన గూడెం చేరుకునేవాడు రాత్రివేళ మార్గం మధ్యలో ఎదురయ్యే ఎలాంటి క్రూరమృగమైనా వీరాస్వామి బల్లేనికి బలి కావాల్సిందే!! అతని బల్లెం దూసుకుపోయిన దారిలో రాళ్లు సైతం చీల్చుకు పోవాల్సిందే అదే కూర వీరాస్వామి బల్లెం ఘనత.
ఇలా కాలం గడుస్తున్న సమయంలో ఒక రోజు చర్లప్రాంతపు గడికోట ప్రజలూ పన్నులు కట్టలేకపోయారు దానితో సామంతరాజు మేడినీరాయుడు కాకతీయ ప్రభువులకు కప్పం చెల్లించలేదు. కప్పంకట్టని సామంత రాజ్యాలు వశపరుచుకునే పనిలో భాగంగా కాకతీయసేనలు ఆధునిక ఆయుధాలు చర్లప్రాంతానికి వచ్చి గడీకోటను ముట్టడించడంతో స్వార్థపరుడు వ్యసనపరుడు అయిన మేదినీ రాయుడు కోటలోని అంతఃపురంలో బందీ అయిపోయాడు.
ఆ సమయంలో అక్కడే వున్న ఆ కోట సైనికాధ్యక్షుడైన 'కూరం వీరస్వామి' ఏమాత్రం అధైర్యపడక తమకుగల ఆ మోటు ఆయుధాలు ధైర్యం కూడదీసుకుని కాకతీయ సైనికుల మీద తన సర్వశక్తులు వడ్డీ పోరాడారు. ఈ పోరాటంలో వందలాది వనవాసి సైనికులు వీరమరణం పొందారు, అ హోరాహోరీ పోరుతో గడికోట అంతా రక్తసిక్తం అయి శవాల గుట్టల తో నిండి పోయింది. అంతకు ముందు రోజు వరకు ప్రజలు సైనికులతో కళకళలాడిన గడికోట నేడు శవాల దిబ్బ గా మారిపోయింది సైన్యాన్ని ముందుండి నడిపించిన సైన్యాధ్యక్షుడు 'కూరం వీరస్వామి' ఆ యుద్ధంలో అశువులుబాసాడు.
కోటకు వెళ్లిన భర్త రావడం ఆలస్యం కావడంతో రోజూ వచ్చే వేళ మించి పోవడంతో ఆందోళన చెందిన అతని భార్య భర్తకోసం 'వనగూడెం'లోని ఆడవారిని తీసుకుని రాత్రికి రాత్రి దివిటీలు గడికోట కు చేరుకుంది. అక్కడంతా ఊహించని వాతావరణం కనిపించింది. ఎక్కడ చూసినా శవాలే చెల్లాచెదురుగా పడి వున్నాయి. ఆ డివిటీల వెలుతురులో తన భర్త శవం రక్తపు మడుగులో పడి ఉండటం చూసింది.పొంగివస్తున్న దుఃఖాన్ని కడుపులోనే దాచుకున్నభర్త శవాన్ని మోసుకొని స్వంత గూడెం తిప్పాపురం చేరుకుంది. ఊరికి ఆగ్నేయపు దిక్కున కట్టెలు పేర్చి ఆ చితి మీద భర్త శవం ఉంచి ఆవు నెయ్యి పోసి ఆ అమరవీరునికి గూడెం ప్రజల సమక్షంలో అంత్యక్రియలు చేసి నాటి ఆచారం ప్రకారం భర్తతో పాటు తాను ఆ చితి మంటల్లో పడి ఆత్మాహుతి చేసుకుంది.
అలా వీర మరణం పొందిన కూరం వీరాస్వామి దంపతులు త్యాగాన్ని ఆ చుట్టుపక్కల గూడేలు వారంతా వేనోళ్ల చెప్పుకున్నారు తమ నాయకునికి గుర్తుగా ప్రతి ఏడాది అతడు వీర మరణం పొందిన రోజు జాతర గా జరుపుకుంటూ అతని త్యాగాన్ని గుర్తు చేసుకునేవారు కాలక్రమంలో ఆ అమరవీరుడు ఆ గుడిలో ప్రజలకు ఆరాధ్య దైవం గా మారిపోయాడు.
చర్లకు సుమారు 15 కి.మీ. దూరంలో ఛత్తీస్ఘడ్ రాష్ట్రానికి చేరువలో గల 'తిప్పాపురం' గ్రామంలో ఆగ్నేయపు దిక్కున చెరువు వద్దగల విప్పతోగువద్ద నాల్గు అడుగుల ఎత్తు గల రాయి మీద బల్లెం పట్టుకుని నిలబడి వున్న సాధారణ బొమ్మ ఆకారం ఉంది. దీనిని పూర్వం 'కూరం' వంశీయులు తయారు చేసి అక్కడ పెట్టారని ఆ గ్రామస్థులు చెబుతున్నారు.
ఈ రోజుకు తిప్పాపురం గ్రామస్తులు వీరాస్వామి రాతి బొమ్మకు పూజలు చేసుకుంటున్నారు వారు గ్రామాన్ని చెడునుంచి రక్షిస్తున్న రక్షకుడిగా భావించి ప్రతి ఏటా పొట్ట పండగ రోజు అతనికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అంతేగాక చుట్టు పక్కల గ్రామాల వారు కూడా తమకు పండిన తొలి పంట తాలుకు ఫలాలు గింజలు ముందు ఈ అమరవీరుడు రాతిబొమ్మ వద్ద మొక్క చెల్లించిన తరువాతే వారు వాటిని తినే ఆచారం నేటికీ కొనసాగిస్తున్నారు.
తిప్పాపురం గ్రామానికి చెందిన నూప తిరుపతయ్య అనే 60 సంవత్సరాల గిరిజనుడు తన తాత చెప్పిన గాధను 12-10-2002 న చెప్పాడు ఆ ఆధారంతో ఈ వ్యాసం వ్రాయునది - అమ్మిన శ్రీనివాస రాజు
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia
Unwanted advertisements disturbing to read the matter about kuram Veeraswami.
ReplyDeleteyes
DeleteAllow to copy the matter published here.
ReplyDeleteyes want to copy matter
Deleteremove ads
ReplyDelete