రామ్ ప్రసాద్ బిస్మిల్ భారతీయ విప్లవకారుడు, రామ్ ప్రసాద్ 1918 మణిపురీ కుట్ర, 1925 కాకోరీ కుట్ర వంటివాటిలో పాల్గొని బ్రిటీష్ సామ్రాజ్యవాద...
రామ్ ప్రసాద్ బిస్మిల్ భారతీయ విప్లవకారుడు, రామ్ ప్రసాద్ 1918 మణిపురీ కుట్ర, 1925 కాకోరీ కుట్ర వంటివాటిలో పాల్గొని బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉధ్యమంచేశారు. ధైర్యసాహసాలు కలిగిన గొప్ప దేశభక్తుడు. స్వాతంత్ర సమరయోధుడు అలాగే రామ్, ఆగ్యాత్, బిస్మిల్ వంటి కలం పేర్లతో హిందీ, ఉర్దూ భాషల్లో దేశభక్తి కవితలు రాసిన విప్లవ కవి, బిస్మిల్ అన్న పేరుతోనే ప్రఖ్యాతులయ్యారు.
స్వామి దయానంద సరస్వతి రాసిన సత్యార్థ్ ప్రకాష్ పుస్తకం స్ఫూర్తినివ్వగా, రామ్ ప్రసాద్ ఆర్య సమాజ్ సంస్థతో అనుబంధం కలిగి వుండేవారు. ఆర్య సమాజ్ బోధకుడు అయిన తన గురువు స్వామి సోమ్ దేవ్ ద్వారా లాలా హర్ దయాళ్ తో రహస్య సంబంధం కలిగివుండేవారు. అనేక మంది స్వాతంత్ర్య వీరులతో కలిసి భారతమాత ను భానిస సంకెళ్ళ నుండి విముక్తికై తన జీవితాన్ని ధారపోశాడు.
హిందుస్తాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అనే విప్లవ సంస్థ వ్యవస్థాపక సభ్యుల్లో బిస్మిల్ కూడా ఒకరు. భగత్ సింగ్ ఆయనను ఉర్దూ, హిందీ భాషల్లో గొప్ప కవిగా ప్రశంసించేవారు. కవిత్వ రచనతో పాటుగా ఆయన ఆంగ్లం నుంచి కేథరీన్, బెంగాలీ నుంచి బోల్షెవికోం కీ కర్తూత్ పుస్తకాలను హిందీలోకి అనువదించారు. సర్ఫరోషీ కీ తమన్నాతో సహా అనేక స్ఫూర్తిదాయకమైన దేశభక్తి గీతాలు రచించారు.
రాంప్రసాద్ బిస్మిల్ 11 జూన్ 1897 లో షాజాన్ పూర్ లో జన్మించారు.కాకోరీ రైలు దోపీడిలో పట్టుబడి 18 నెలల తరువత తన సహచరులైన అష్ఫౌల్లాఖాన్, రోషన్ సింగ్, రాజేంద్ర నాథ్ లాహిరి తో కలిసి బ్రిటీష్ వాళ్ళ చేత 19 డిసెంబర్ 1927 న మిత్రులందరూ ఒకేసారి భారత మాత కోసం బలిదానమయ్యారు.
జాతీయ సాహిత్యం కొరకు సంప్రదించండి:
ప్రతులకు : సాహిత్యనికేతన్
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్ – 500 027
ఫోన్ : 040-27563236
సాహిత్యనికేతన్, ఏలూరు రోడ్,
గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్ : 9440643348
ప్రతులకు : సాహిత్యనికేతన్
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్ – 500 027
ఫోన్ : 040-27563236
సాహిత్యనికేతన్, ఏలూరు రోడ్,
గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్ : 9440643348
No comments