Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

వీరనారి రాణీ పూల్ కువర్ జీవిత విశేషాలు - Ranipool kuvar life story - azadi ka amrut mahotsav

మనదేశంలో ప్రథమ సాతంత్ర్య సంగ్రామం ప్రారంభమయిన  1857 నుండి 1947 వరకు సాగిన ఆ పోరాటంలో వేలకొలది దేశభక్తులు తమ జీవితాలను త్యాగం చేసారు. చరి...

మనదేశంలో ప్రథమ సాతంత్ర్య సంగ్రామం ప్రారంభమయిన  1857 నుండి 1947 వరకు సాగిన ఆ పోరాటంలో వేలకొలది దేశభక్తులు తమ జీవితాలను త్యాగం చేసారు. చరిత్రకందని మహావీరుల త్యాగమూర్తులు ఎందరో... ఎందరో.... అలాంటి ఓ దేశభక్తుల కుటుంబం గోండ్వానాకు చెందిన తోటన్ సింగ్ జగాల్ ది కూడా అదే వీరత్వం ఆయనకి ఒక కుమారుడు, కుమార్తె ఉండేవారు. కుమార్తె పేరు పూల్ కువర్ మన భాషలో చెప్పాలి అంటే పూల్ కుమారి అన్నమాట.
పువ్వు పుట్టగానే పరిమళించినట్లుగా ఈమె తన బాల్యం నుంచే నాయకురాలి లక్షణాలు చూపేది. సాటి పిల్లలందరినీ కూర్చోబెట్టి సభ నిర్వహించేది. వారికి కత్తి తిప్పుడు నేర్పించేది దాసీల వీపు మీదకి ఎక్కి గుర్రపు స్వారీ చేసేది. తండ్రి ఈ వైఖరిని చూసి ఈమెలో అసామాన్య లక్షణాలున్నాయని గమనించి వాటిని ప్రోత్సహిస్తూ ఆమెను ఆమెను  వీరాంగన గానే పెంచాడు, ఆమెకు కావలసిన విద్య నేర్చేందుకు అధ్యాపకులను పిలిపించి  శిక్షణ ఇప్పించాడు. ఉన్న ఇద్దరు సంతానంలో కుమారుడిని పోగొట్టుకున్న తోటనీసింగ్ కుమార్తెనే కుమారుడిగా భావించి సకల విద్యలూ నేర్పించాడు.
ఇక్కడ ఈమె అన్నివిద్యల్లోనూ ఆరితేరి చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో ఈమె పేరు ప్రసిద్ధం అవుతుంటే ఆంగ్లేయుల దృష్టి సహజంగానే ఈమె మీద పడింది. ఎందుకంటే ఆ రోజుల్లో ఎవరైనా కాసంత ప్రతిభా పాటవాలు కనబరుస్తే వెంటనే వారి మీద ఆంగ్లేయులు ఓ కన్నువేసి ఉంచేవారు.
ఈమె విద్యలు నేర్చుకుంటూ పెరిగి వివాహం చేయూలిన వయసుకి వచ్చింది. తన అందం, ప్రతిభ  తెలివితేటలతో ఈమె పేరు అంతట మారు మ్రోగింది. పుట్టింది దేశభక్తుల కుటుంబంలో ఆమె మాటల్లో ఆ దేశభక్తి పొంగుతూ ఉండేది, తండ్రి, కూతురు కోసం వరుడి వెదికే ప్రయత్నం లో బయల్దేరాడు, వీరి గోండ్వానా నుంచి 'రాజా శంకర్ షా నుంచి పెళ్లి సంప్రదింపులు వచ్చేసరికి జగములు సింగ్ కుటుంబం రాజకుమారి సహా అందరూ పొంగిపోయారు, ఎందుకంటే ఈమెకు దీటుగా దేశభక్తిలో అందంలో పరాక్రమం లో పేరు పొందిన వాడు శంకర్షా.
వీరిద్దరికీ వైభవంగా వివాహం జరిగింది. రాజకుమారి రాణి గా మారింది. ఇరువురు కలిసి తమ సామ్రాజ్యాన్ని సుసంపన్నం చేసారు. ఈలోగా పూల్ కువర్ కు ఒక మగ పిల్లాడు జన్మించాడు. వీరి రాజ్యాధికారం, పాలనా పద్ధతి, దేశభక్తి పేరు ప్రతిష్టలు ఆంగ్లేయులకు రుచించలేదు. ఆ పాలన ఆంగ్లేయుల ది అయిన వీరిరువురూ అనేక చిన్న చిన్న రాజ్యాల వారికి రక్షణగా నిలిచి ఆప్తులు అయ్యారు. అంతే కాదు రహస్యంగా సైనిక బలాన్ని కూడా పెంచుకుంటూ పోయారు.
అయితే వీరి కి పెన్షన్ తెచ్చి ఇచ్చే సేవకుడ్నిరహస్యంగా వీరి యోజన తెలుసుకునేందుకు ఆంగ్లేయులు పంపించారు. రాజు సమ్మకం సంపాదించాడు ఆ సేవకుడు ఆ నమ్మకం తోనే తమ ప్రణాళికను అతడికి చెప్పాడు రాజు. వెంటనే అతడు ఆంగ్లేయులకు ఈ విషయాలన్నీ చేరవేసాడు. వారు వారి కోట మీద దాడి చేసి రాజు నీ రాజ కుమారుడిని ఇద్దరి నీ బంధించారు. రాణి మాత్రం ముసలిదాని వేషం వేసుకుని వారి కళ్ళ ముందే తప్పించుకుంది. తర్వాత ఆంగ్లేయులు శంకర్షాని, రఘునాధీషాని ఇరువురుని తోపులకి కట్టి పేల్చేసారు.
దీంతో ఉగ్రురాలు అయిన రాణి తన సైన్యాన్ని తయారు చేసింది. స్త్రీల కూడా పురుషుల వేషాలు వేసి వారికి కూడా శిక్షణ ఇచ్చింది. అలా సైన్యం సమీకరించాక ఆమె చేసిన మొదటి పని మాతృదేశ ద్రోహి అయిన సేవకుడ్ని హతమార్చింది. అలాగే శతృవులతో చేతులు కలిపి వంచించిన వారందరినీ ఒకొక్కరుగా మట్టుబెట్టింది. తమ సైన్యంలో కొందరిని ఆంగ్లేయుల కదలికలను తెలుసుకునేందుకు నియమించింది. అన్ని వైపుల నుంచి అన్ని మార్గాలు తన వారిని పెట్టి భద్రకాళిలో నిప్పులు చెరుగుతూ ఆంగ్లేయుల పై విరుచుకుపడింది, అల్పసంఖ్యాకులైన ఆంగ్లేయులను స్వయంగా హతమార్చింది.
చివరలో ఆంగ్లేయులు సైన్యం సంఖ్య పెంచేసరికి రాణి సైన్యం చిన్నది అయిపోయింది. ఆమె తన అంగరక్షకుడికి ముందుగానే సందేశం ఇచ్చింది. శతృవుల చేతిలో తాను చిక్కితే తనను తాను ఆత్మాహుతి చేసుకుంటానని శతృవులు తనని తాకకముందే తనను అగ్నికి అర్పించాలని చెప్పింది. ఆ విధంగా వారి చేతుల్లో బందీగా చిక్కిన ఆమె తన ఖడ్గంతో తనను తాను బలి చేసుకుంది. వెంటనే అంగరక్షకుడు ఆమె శరీరాన్ని అగ్నికి అర్పించాడు, రాణి మరణించిందని విని సైన్యం చెల్లాచెదురై అడవుల్లోనికి పారిపోయారు. 300 సంవత్సరాల క్రితం గోండ్వనా రాణీ దుర్గావతి మొఘలులతో యుద్ధం చేస్తూ దేశం కోసం ఆత్మార్పణం చేసుకుందనే విషయం ఆంగ్లేయులకి అప్పుడే తెలిసింది. 300 సంవత్సరాల తర్వాత అదే వంశం నుంచి ముగ్గురు దేశభక్తులు మరల స్వాతంత్ర్యం కోసం పోరాడుతూ తమ జీవితాలను అర్పించారు. గోండ్వనా రాజ్యం దేశభక్తులకు ఆలవాలమైంది. తల్లి భారతి ఋణం తీర్చుకున్న వీరులు గోండ్వానా రాజులు.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia


జాతీయ సాహిత్యం కొరకు సంప్రదించండి:

ప్రతులకు : సాహిత్యనికేతన్‌
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్‌ – 500 027
ఫోన్‌ : 040-27563236
సాహిత్యనికేతన్‌, ఏలూరు రోడ్‌,
గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్‌ : 9440643348.

No comments