భారత ప్రథ మ స్వాతంత్ర్యం సంగ్రామానికి 5 దశాబ్దాల పూర్వమే కేరళలోని వాయునాడ్ ప్రాంతంలో ఈస్టిండియా కంపెనీ వారికి, కురుచ్చా వనవాసి వీరులకు ...
భారత ప్రథమ స్వాతంత్ర్యం సంగ్రామానికి 5 దశాబ్దాల పూర్వమే కేరళలోని వాయునాడ్ ప్రాంతంలో ఈస్టిండియా కంపెనీ వారికి, కురుచ్చా వనవాసి వీరులకు మధ్య తీవ్రమైన యుద్ధం కొనసాగింది. ఈ యుద్ధంలో అధునాతన ఆయుధాలతో సన్నద్దమైన ఆంగ్లేయుల సైన్యంతో గొరిల్లా యుద్ధ పద్ధతి లో యుద్ధం కొనసాగించి వీర మరణం చెందిన తలక్కల్ చందు గురించి భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో ఎక్కడా ఉటంకించకపోవడం దురదృష్టకరం. పషషీ తిరుగుబాటు పేర పిలువబడిన ఈ యుద్ధంలో కన్జవం వనసీమల్లోను, వాయునాడ్ ప్రాంతంలోనూ గల కురిచ్చా వీరులు వారి విప్లవోద్యమాన్ని గురించి వాస్తవ చరిత్ర ఇంత వరకూ బహిర్గతం కాలేదు.
బ్రిటీషు వారి చరిత్ర లో అధికార పత్రాలు తలక్కల్ చందు పేరు మాత్రమే ఉటంకించబడింది. వాయునాడ్లో జానపదుల తెలియజేసే గాథలు తలక్కల్ చందు అనే వనవాసి వీరుడు ఆంగ్లేయుల చేత మోసగింపబడి చంపబడిన కురిచ్చి సేనాథిపతి గా వర్ణించబడుతోంది. తలక్కల్ చందు గొరిల్లా యుద్ధం లో మహాద్భుతం ప్రజ్ఞ గల వీరుడు. శత్రు సైన్య మీద దెబ్బతీయడానికి మాటు వేసిన స్థావరం కనీయాంబేట టేసా పేరున ప్రసిద్ధి చెందింది. 1802 అక్టోబర్ 11న ఈ స్థావరం నుండే రహస్యం గా ఉంటూ ఆంగ్లేయుల అధీనంలో పరమరమకోటను ఆక్రమించుకున్నారు.
విప్లవ వీరుడు తలక్కల్ చందు, ఎడీచ్చన్ కుంగన్ నాయకత్వంలో కురిచ్చీయులు బ్రిటీషు వారికి వ్యతిరేకంగా సాగించిన పోరాటం పరమరమ్ కోట పై జరిపిన తరువాత కూడా కొనసాగింది. కర్ణాటక నుంచి వయనాడ్ జిల్లాలో ప్రవేశించడానికి కంపెనీ సైనికులు చేసిన ప్రయత్నాన్ని బావవీ నది ఒడ్డున చందు, కుందన్ పోరాడి అడ్డుకోవడంతో బ్రిటీషు వారి వెన్ను చూపారు 1805 వరకు పరుషీరాజా పక్షాన తలక్కల్ చందుపోరాడాడు.
ఈ విప్లవ వీర కిశోరం దాగి ఉన్న ప్రదేశాన్ని ఆంగ్లేయులకు సమాచారం అందడంతో విదేశీ సైనిక మూకలు తలక్కల్ చందును బంధించి శిరచ్ఛేదనం గావించారు. పరుషీరాజా తలక్కల్ చందు ఇరువురు వీరమరణం చెందిన తర్వాత శత్రువుల చేతికి చిక్కు మరణించడం ఇష్టంలేని కుంగన్ ఆత్మాహుతి చేసుకున్నాడు.
తలక్కల్ చందు వీర మరణం పొందిన తరువాత, కూడా 7 సంవత్సరాలు పాటు కురిచ్చావీరులు బ్రిటీషు వారి తో పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. బ్రిటీషు వారి వలస రాజ్యానికి వ్యతిరేకంగా భారతదేశంలో జరిగిన పోరాటాల్లో ప్రప్రథమమైనది సుదీర్ఘ కాలం కొనసాగింది వయనాడ్ కురిచ్చా వీరుల పోరాటమే. అయినప్పటికీ భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో కురిచ్చా వీరుల త్యాగ నిరతి కు సంబంధించిన ప్రస్తావన కూడా లేకపోవడం విచారకరం.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia
No comments