మన హిందూ పద్ధతిలో పుట్టినరోజు ఉదయముననే లేచి తల స్నానము చేయవలయును. తల ( నువ్వుల నూనె పెట్టుకొని స్నానము చేయాలి) స్నానము చేసిన తరువాత కొత్...
మన హిందూ పద్ధతిలో పుట్టినరోజు ఉదయముననే లేచి తల స్నానము చేయవలయును. తల (నువ్వుల నూనె పెట్టుకొని స్నానము చేయాలి) స్నానము చేసిన తరువాత కొత్త వస్త్రములు ధరించి దేవుని పూజ చేసుకోవాలి. ఆ తర్వాత స్నేహితులు బంధువులు అందరినీ ఒక నిర్ణీత సమయానికి పిలుచుకొని ఈ సమయంలో క్రింది విధంగా కార్యక్రమం చేసుకోవాలి.
హాలులకు మధ్యగా ఒక బల్ల నేనే దానిపై దీపపు కుందిని వత్తి వేసి నూనె వేసి వెలిగించటానికి సిద్ధం చేసి ఉంచుకోవాలి. ఎన్నవ పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఎన్ని వత్తులు చుట్టూ పెట్టి వేరు వారు జ్యోతిగా వెలిగించి వచ్చును. అట్లా చేయడానికి అవకాశం లేక పోతే, ఒకే వత్తి వేసి వెలిగించచ్చు. దాన్ని పక్కన సుమారు కిలో కి తగ్గకుండా పాల కోవా ముద్ద గాని, కలకండ్ కానీ, హల్వా గాని లేక అటువంటి మెత్తగా ముద్దగా ఉండే స్వీట్స్ ఏదైనా సరే వెడల్పుగా, గుండ్రముగా పూరీ ఆకారంతో మందంగా తయారు చేసి ఉండాలి. అందరూ రాగానే వచ్చిన వారందరూ హాల్ లో దీపం చుట్టూ కూర్చుంటారు. అందరూ రాగానే ఈ క్రింది విధంగా కార్యక్రమంప్రారంభించాలి.
పుట్టిన రోజు జరుపుకునే వ్యక్తి లేచి ఈ క్రింది మంత్రం చదువుతూ దీపం వెలిగిస్తాడు. ఒక వేళ మరీ చదువలేని వారైతే వాళ్ళ తరపున తల్లి గాని, తండ్రి గాని లేక ఇంకెవరైనను మంత్రమును చదువవచ్చును. మంత్రం చదువ లేనివారు తాత్పర్యము చదువవచ్చు. రెండును చదివినచో చాలా మంచిది. వీలైనచో ఒకరు మంత్రం, వేరొకరు తాత్పర్యము చదివినచో చాలా చక్కగా నుండును. ఇది చదివినప్పుడు చక్కగా, స్పష్టంగా అతిధులందరూ కూడా వినునట్లు చదువవలేను.
ఉద్దీప్యస్వ జాతవేదో పఘ్నన్నిర్ ఋతిం మమపశూగ్ంశ్చ మహ్య మానవ జీవనంచ దేశోదిశ
ఓ జాతవేదుడవైన అగ్ని! చక్కగా ప్రకాశవంతముగా వెలిగి మా యందున్న పావమను చీకటిని పోగొట్టుము. చక్కని ఇంద్రియములను, సుఖమైన జీవనమును, మంచి దృష్టిని ఇమ్ము.
ఈ మంత్రం చదివిన తరువాత పాలలో తేనె కలిపి దీపం దగ్గర వుంచ వలయును. (తేనె లేనిచో పంచదార వాడవచ్చును. ) దీపమునకు సమస్కరించి, ఈ మంత్రం చదువవలెయును.
మృత్యుంజయ మంత్రం:
ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనంఉర్వారుకమివ బన్ధనాన్మృత్యో ముక్షీయ మాని మృతాత్
అని మూడు సార్లు స్పష్టంగా నెమ్మదిగా చదవవలెను. చిన్న పిల్లలైనచో పెద్ద వారెవరైన చెప్పించవలెను.
పుష్టిని వృద్ధి చేయునట్టి, మంచి సువాసన కలుగజేయునట్టి మూర్తి యగు త్రినేత్రుని మేము ఆరాధించు చున్నాము. వాడు పండిన దోస పండు ను తొడిమే నుండి వేరు చేసినట్లు మమ్ము మృత్యువు నుండి వేరు చేసి అమ్మతత్వమునకు చేర్చును గాక!.
పాలు తేనె కలిపిన ఈ పానీయం తాను కొంచెం తీర్ధము వలె తీసుకుని చేతులు కడుగుకొని తరువాత అందరికీ తీర్ధముగా ఇవ్వవలయును. తర్వాత పూరి వలె సిద్దము చేసుకున్న స్వీట్ పదార్ధం మీద ఈ క్రింద వ్రాయబడిన పద్ధతిలో చాకుతో అదే ఆకారం లో కోయ వలెను. లేక దాని పైన సూది వంటి దానితో గీచిననూ చాలు, ఆ ఆకారం ఎంత స్పష్టంగా చక్కగా గీసినచో అంత శుభము. దానికి నమస్కరించవలెను.
అట్లు గీయుచున్నప్పుడు ఈ క్రింది మంత్రం చదువవలెను.
సంత్వాసిచ్చమి యజషా ప్రజామాయుర్ధనషఓం శాంతి: శాంతి: శాంతి:
మాకు ఆయుష్, సంతతి మున్నగునవి సమృద్ధిగా కలుగును గాక
ఇట్లు కోసిన తర్వాత వచ్చిన అతిథుల సంఖ్యను బట్టి చిన్న ముక్కలుగా కోసుకుని ఒక్కొక్కరికి ఒక్కొక్క ముక్కను ఇచ్చుచూ ఈ క్రింది మంత్రమును చదువవలెను,
సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యంకరవావహై తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై
ఓం శాంతి: శాంతి: శాంతి:
మేము రక్షింపబడుదురు గాక ! కలిసి భజింతుము గాక! కలిసి సామర్ధ్యము పొందుదురు గాక ! తేజ శాంతి ముగ్దుం గాక ! విరోధము పొందకుందుము గాక ! మా మధ్య ద్వేషము కలుగ కుండును గాక!
అప్పుడు అచ్చట నిన్న వారిలో పెద్దవారు పుట్టిన రోజు జరుపుకొనుచున్న వ్యక్తిని దీపం దగ్గర కుర్చీపై కూర్చుండ బెట్టి ఈ క్రింది మంత్రమును మూడు సార్లు చదువుచు ఆ వ్యక్తిపై అక్షతలు వేయవలెను. మిగిలిన వారు కూడా అక్షతలు వేయవలెను. ఈ వ్యక్తి కన్నా వయస్సులో చిన్నవారు పూలు మాత్రమే వేయవలెయును.
శతమానం భవతి| శతాయుః పురుషశ్శతేంద్రియ|ఆయుష్యే syవేంద్రియే ప్రతితిష్ఠతి ||
అటు తరువాత వచ్చిన వారందరికి తామివ్వడలచుకున్న ఉపాహారములు పంచవచ్చును. అనగా తాము అనుకున్న పద్దతి లో విందు చేసుకొనవచ్చు. -తాడేపల్లి హనుమత్ ప్రసాద్.
Very good information
ReplyDelete