Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఆదర్శహిందూ గృహము ఏలా ఉండాలి? - is your house the best hindu house?

1. ఇంటి పై ఓంకార చిహ్నముండాలి. 2. ఇంటి పై కాషాయ ధ్వజం ఎగరాలి. 3. ఇంటి వాకిట్లో తులసి ఉండి రోజు సేవించాలి. 4. ఇంట్లో దేవతల, మహనీయుల చిత...

1. ఇంటి పై ఓంకార చిహ్నముండాలి.
2. ఇంటి పై కాషాయ ధ్వజం ఎగరాలి.
3. ఇంటి వాకిట్లో తులసి ఉండి రోజు సేవించాలి.
4. ఇంట్లో దేవతల, మహనీయుల చిత్ర పటములు, కొందరు సోలో మోడల్స్ చిత్ర పటములు మాత్రమే ఉండాలి.
5. ఇంటి ఆవరణ, పరిసరాల పరిశుభ్రత, ముగ్గులు వ్యవస్థితంగా ఉండాలి.
6. ఇంటి లో శుద్ధ త్రాగునీటి వ్యవస్థ, మురుగునీరు పోవుటకు వ్యవస్థ పుండాలి.
7. ఇంటి ఆవరణ లో ఆకు కూరలు, కూరగాయలు మరియు వేప వంటి నీడ మొక్కల పెంపకము జరగాలి.
8. ఇంటి వారంతా ప్రాతః కాలం లేచుట, వెంటనే కాలకృత్యాలు తీర్చుకొని వ్యాయామం, యోగ చేయాలి. సూర్యోదయం అయిన తరువాత సూర్యునికి నమస్కరించడం. పిల్లలు ఉదయం 4 గంటలకు లేచి 2 గంటలు పాఠ్య పుస్తకాలు చదువు కుంటే బాగా జ్ఞాపకముంటుంది ఇందుకోసం రాత్రి త్వరగా పడుకోవాలి. పెద్దలు అచరణ ద్వారా పిల్లలకు ఈ విషయాలు నేర్చుట.
9. ప్రతి నిత్యం స్నానం, కుంకుమ ధారణ, దేవునికి నమస్కరించుట, కలిగి ప్రార్ధించుట, అందరి క్షేమము, దేశ క్షేమం కాంక్షించుట.
10. కుటుంబ సభ్యులు నియమితంగా మందిర దర్శనము చేసుకొనుట.
11. పిన్నలు తమ ఇళ్లలోన పెద్దలకు, తల్లి దండ్రులకు (పండుగ ఇతర ప్రత్యేక సందర్భాలలో) పాదాభివందనం చేయడం, ఆశీర్వచనం తీసుకొనుట.
12. భోజనం ముందు భగవంతుని స్మరించి భుజించుట.
13. ఇంటి వారంతా కనీసం ఒక పూట కలిసి భుజించుట.
14. ఇంటి వారంతా ఆత్మీయంగా కలిసి మెలసి ఉండటం, విమర్శలు మానుట, పరస్పర గౌరవం, పరామర్శలతో జీవించుట.
15. ఇంట్లో అతిధి మర్యాదలు పాటించుట.
16. కుటుంబ వాతావరణం సంస్కారప్రదం గా ఉండటం, అరుపులు కేకలు కాక పరస్పరము ప్రేమ పూర్వకముగా సంభాషించుట, అనుభవాలు పంచుకొనుట.
17. ఇరుగు పొరుగు వారితో సత్సంబధము కలిగి ఉండటం.
18. ఇంటి వారంతా సామాజిక సమరసత ను పాటించుట, హిందూ భందువులందరితో సహపంక్తి భోజనం చేయడం.
19. ఇంట్లో బాల బాలికలు, యువతి యువకులు విద్యార్జన చేయడం, గురుభక్తి కలిగి యుండుట, సరస్వతి ప్రార్ధన చేయుట.
20. మాతృ భాషలు, సంస్కృతం అభ్యసించుట, మాట్లాడుట.
21. ఇంటిలో సత్గ్రంథ శ్రవణం, ప్రవచనము పట్ల ఆసక్తి, ప్రతి హిందూ గృహంలో రామాయణ, మహాభారతం, భాగవతం, భగవద్గీత గ్రంథాలు ఉండడం.
22. ఇంట్లో యోగి పత్రికల పఠనము, వార్తలు వినుటలో ఆసక్తి, మమ్మీ, డాడి, అంకుల్, ఆంటీ పదాలను వాడకుండుట.
23. భజన సమయంలో మొబైల్ ఫోన్లు వాడకుండుట, టెలివిజన్ వాడకుండుట, వారంలో ఒక రోజు దూరదర్శన్ చరవాణిలు వాడకుండా ఉండటం.
24. ఇంట్లో స్వదేశీ వస్తువులు వాడుట, విదేశీ వ్యామోహానికి దూరంగా ఉండటం, అనుకరణకు దూరంగా ఉండటం
25. ఇంటి లో మిత వ్యయమును పాటించుట. పొదుపు చేయడం, ఖర్చు లేక్క వ్రాయుట. మాతృ ఋణం, పితృ ఋణం, ఋషి ఋణం, దేవ ఋణం తీర్చుకోగలగడం, పిల్లలకు దామిచ్చే గుణం నేర్పడం.
26. ధర్మ సేవా కార్యములు కోసం ఖర్చు చేయడం.
27. ఇంట్లో వారంతా పొగాకు, మధ్యపానము, జూదం, దుర్వ్యసనములకు దూరంగా ఉండుట.
28. తమ వీధి శుభ్రత, బాగోగులు పట్టించుకునుట.
29. ఇంటివారంతా సమాజ హిత కార్యములలో పాల్గొనుట.
30. సంఘ విద్రోహులు అదుపు చేయడం లో కర్తవ్యము పాటించుట.
31. అన్ని పండుగలను నిజమైన స్పూర్తితో భక్తిశ్రద్ధలతో జరుపు కొనుట. పుట్టిన రోజును మనదైన పద్ధతులలో దీపం వెలిగించి జరుపుకొనుట.
32. పెళ్లి వంటి శుభకార్యాలలో దుబారా ఆడంబరాలు లేకుండా చేసుకోనుట. సంస్కృతి ప్రతిబింబించే కార్యక్రమములు నీర్వహించుట.
33. మనదైన పంచాంగం ననుసరించి పండుగలు, మహాత్ముల జయంతిని, మన పుట్టిన రోజులు జరుపుకొనుట.
34. మన వే భాషలందు భారతీయ సంస్కారం కలిగియుండుట.
35. అన్నింటిలో పరహితము, ధర్మహితము, దేవహితము, విశ్వహితములకు ప్రాధాన్యతనిచ్చుటు.
36. ప్రతిఒక్కరూ సజ్జనుల తో స్నేహం చేయడం, సత్సంగములలో పాల్గొనడం, సాధకుడిగా జీవించడం.
37. చాణుక్యుడు గృహస్థాశ్రమం గురించి అర్థశాస్త్రంలో చెప్పిన క్రింది శ్లోకం అందరూ గుర్తు పెట్టుకోవాల్సిందే!
సానందంసదనం సుతాశ్చను థియః కాంతా ప్రియ భాషిణి
సన్మిత్రం సుధనం సయోషితిరతశ్చ : ఆజ్ఞాపరాసే పక్కా
ఆతిథ్యం శివపూజనం ప్రతి దినం మృష్టాన్న పానం గృహే
సాధుః సంగముపాసతేహి సతతం ధన్యోగృహనమః

భావము: 1. ఇల్లు ఆనందానికి నిలయం 2. పిల్లలు బుద్ధి మంతులు 3. ఇల్లాలు ప్రియ భాషిణి ఓ చక్కటి స్నేహితులున్నారు 5. సత్సంపాదన 6 పత్నితోనే శారీరక సంబంధం 7. ఆజ్ఞను పాలించే సేవకులు 8. అతిధులను పిలిచి ఆతిధ్యమివ్వడం 9. ప్రతి రోజు శివ పూజ 10. ఇంటనే మృష్టాన్న భోజనం 11. సాధుసంతులు ఇంటికి నిత్యమూరావడం.
ఈ పై విషయాలను పాటిస్తే ఇల్లు స్వర్గతుల్యమవుతుంది.
ఒక దీపంతో మరియోక దీపం వెలిగించాలి.
నీలో దీపం వెలిగించు, నీవే వెలుగై వ్యాపించు -తాడేపల్లి హనుమత్ ప్రసాద్.

4 comments

  1. అమ్మ ఉన్నదీ, ఆమె హయాంలో అన్ని విధాల ఇలాగే జరుగుతోంది. యాంత్రిక జీవనం గడుపుతున్న మేము ఆమె తదనంతరం కూడా ఈ విషయాల్లో మా ఇంట ఇలాగే జరగాలని ఆ సర్వాంతర్యామి నీ ప్రార్థిస్తాను��

    హనుమత్ ప్రసాద్ గారికి ధన్యవాదములు.

    ReplyDelete
  2. 80% మా ఇంట్లో నిత్యం జరుగుతూ ఉంటుంది మిగతా ట్వంటీ పర్సెంట్ కూడా జరగడానికి ప్రయత్నం చేస్తాను తప్పకుండా మంచి విషయాన్ని తెలియజేశారు హిందూ ధర్మంగురించి ధన్యవాదాలు

    ReplyDelete
  3. Great post much appreciate the time you took to write this

    ReplyDelete