సమర్థరామదాసు : గోదావరి తీరంలో పంచవటిలో శ్రీరామ జయరామ జయరామ అనే త్రయోదశాక్షరీ మంత్రాన్ని జపిస్తూ 12ఏళ్లు కఠోరమైన తపస్సు చేసి శ్రీ రామచంద...
సమర్థరామదాసు : గోదావరి తీరంలో పంచవటిలో శ్రీరామ జయరామ జయరామ అనే త్రయోదశాక్షరీ మంత్రాన్ని జపిస్తూ 12ఏళ్లు కఠోరమైన తపస్సు చేసి శ్రీ రామచంద్రుని సాక్షాత్కారాన్ని పొందిన సాధు పురుషుడు, హిందూ సామ్రాజ్య నిర్మాతయైన ఛత్రపతి శివాజీకి మంత్ర దీక్ష నిచ్చిన గురువు మార్గదర్శకుడు.
సమర్థరామదాసు 17 వ శతాబ్ది కాలమునాటి వాడు. మహారాష్ట్రలో జాబ్ అనే గ్రామంలో జన్మించాడు. తండ్రి సూర్యాజీ పంత్ రోస్టర్. తల్లి రౌణాబాయి, తల్లి దండ్రులు ఇతనికి నారాయణ అని పేరు పెట్టారు. బాల్యం నుండే ఆయన చాలా వీరుడుగా ఉండేవాడు. వివాహ మంటపంలో పురోహితులవారు చెప్పున్న వేద మంత్రాల్లో సావధాన అనే శబ్దం వినబడే సరికి నారాయణ పెళ్లి పీటల మీద నుండి పరుగెత్తుకొని పారిపోయాడు.
అక్కడ నుండి పూర్తిగా సన్యాసి జీవితం ప్రారంభించాడు. తపస్సు పూర్తయినాక 12 ఏళ్ల పాటు కాలినడకన యావద్భారత దేశంలోని తీర్ధయాత్రలను సేవించాడు. దేశమంతటా మహమ్మదీయుల పాలనలో హిందువు అనుభవిస్తున్న బాధలను హిందూధర్మానికి కలుగుతున్న గ్లాని ఆయన కళ్లారా చూశాడు. ఈ పతనావస్థనుండి సమాజాన్ని ఉద్దరించాలంటే సమాజంలో శక్తి సామర్ధ్యాలను నిర్మాణం చేయాలని ఆలోచించాడు. అదే విషయాన్ని అంటే శక్తి రూప సమాజం నిర్మాణం కావాలని అందరికి ఉపదేశించేవాడు.
ప్రజలను ధార్మిక, జాతీయ భావాలు చైతన్య పరచువాడు. ప్రతి చోట వీర హనుమాన్ విగ్రహం ప్రతిష్టాపన చేయించేవాడు. కోదండ రాముణ్ణి, హనుమంతుణ్ణి ఉపాసించమని ప్రచారం చేశాడు. యవనుల అత్యాచారాలకు ప్రతీకారం చేయమని ప్రజల నుత్తేజపరచేవాడు. అనేక చోట్ల వేలాది సంఖ్య లో మఠాలు, వ్యాయామశాల లను స్థాపించి జాతి ఆధ్యాత్మిక, జాతీయ భావల తో శక్తిశాలిగా రూపొందేలా జన జాగరణ చేసి సంఘటనలు నిర్మాణం చేశాడు.
సమర్థ రామదాసు నిర్మించిన ఈ సంఘటన శివాజీ మహారాజు స్వాతంత్ర్యోద్యమంలో ఎంతగానో ఉపయోగపడింది. రామదాసు సంఘటనాలి, సంఘటన కుశుడు, మాత్రమేగాక మహారాష్ట్ర ప్రాంతంలో ఒక శ్రేషుడైన మహాకవి, రచయిత కూడా, వీరి రచనలలో పారమార్థిక చింతన కి సంబంధించిన గ్రంథములేకాక లౌకిక ప్రపంచానికి కావలసిన వివేచనా శక్తి, రాజనీతి, కార్యసామర్థ్యాన్ని పెంపొందించే విషయలతో కూడిన గ్రంథాలు కూడా ఉన్నాయి. దాసబోధ, ఆత్మారాం, మనోబోధ మొదలు గ్రంథాలలో సమర్ధరామదాసుని తాత్త్విక వ్యావహారిక భావాలు వెల్లడవుతాయి. దాసబోధ గ్రంథము సమర్థుడు శివాజీకి బోధించిన రాజనీతి శాస్త్రం.
జాతీయ సాహిత్యం కొరకు సంప్రదించండి:
ప్రతులకు : సాహిత్యనికేతన్
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్ – 500 027
ఫోన్ : 040-27563236
సాహిత్యనికేతన్, ఏలూరు రోడ్,
గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్ : 9440643348.
ప్రతులకు : సాహిత్యనికేతన్
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్ – 500 027
ఫోన్ : 040-27563236
సాహిత్యనికేతన్, ఏలూరు రోడ్,
గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్ : 9440643348.
No comments