Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

తేనెతుట్టెను దగ్గర్నుంచి గెలికితే కుట్టకుండా ఉంటాయా..?? - megaminds

తేనెతుట్టెను దగ్గర్నుంచి గెలికితే కుట్టకుండా ఉంటాయా..?? వంచనకు_దర్పణం... ఆర్టికల్_35A పుల్వామా సంఘటన బాధాకరం. దేశమంతా ఒక్కతాటిపై (జి...

తేనెతుట్టెను దగ్గర్నుంచి గెలికితే కుట్టకుండా ఉంటాయా..??
వంచనకు_దర్పణం...
ఆర్టికల్_35A
పుల్వామా సంఘటన బాధాకరం. దేశమంతా ఒక్కతాటిపై (జిహాది మతస్తుల విషయంలో అనుమానమే) నిలబడి స్పందించింది. ఈ విషాదకర సంఘటన, జవానుల ప్రాణ త్యాగాలు ఒక్కసారిగా దేశప్రజల దృష్టిని కాశ్మీరు అంశంపైకి మళ్ళించింది. జవానుల మరణానికి ఆగ్రహంతో, చేతుల్లో జాతీయ జెండాలు పూని, ప్రదర్శనలకు దిగిన యువకులు, విద్యార్ధులు, పాకిస్తాన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారతమాతకి జై కొట్టారు. చాలా సంతోషకరము.
కాని యావన్మంది సోదర భారతీయులు, ముఖ్యముగా యువకులు, విద్యార్ధులు గమనించవలసిన అంశం ఒకటుంది. మన సోదరులంతా, ఈ దుస్సంఘటనకు, ఇలాంటివే చిన్నవో, పెద్దవో మరెన్నెంటికో, కేవలం పాకిస్తానే కారణమన్న అపోహలో ఉన్నారు. ఖచ్చితంగా పాకిస్తాన్ దోషే. తన భూభాగం నుండి ఉగ్రమూకలకు, ఆర్ధిక, సైనిక, ఆయుధ సహాయాలనందిస్తూ, భారత్ లో కల్లోలం రాజేస్తూనే ఉంది.
పాకిస్తాన్ పాత్రను పక్కన బెడితే, కాశ్మీరులో జరుగుతున్న అనర్ధాలకు అవకాశం కల్పించే మూలాలు దురదృష్ణవశాత్తూ మన రాజ్యంగంలోనే
ఉన్నాయి. అవి
1. ఆర్టికల్ 370
2. ఆర్టికల్ 35 A
ఆర్టికల్ 370 అనేది పూర్తిగా ప్రప్రధమ భారత ప్రధాని నెహ్రూగారి మానస పుత్రిక. ఆయన అనుంగు సహచరుడు, కాశ్మీరులో రాజరికానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన షేక్ అబ్దుల్లాల మధ్య కుదిరిన అవగాహన మేరకు, ఈ ఆర్టికల్ ను రూపొందించి భారత రాజ్యాంగ పరిషత్ ద్వారా, భారత రాజ్యాంగంలో తాత్కాలిక ప్రాతిపదికన చేర్చటం జరిగింది.
1990లలో లాల్ కృష్ణ అద్వాని జరిపిన రధయాత్రతో తొలిసారి ఈ అంశం భారతీయుల దృష్టిని తాకింది. అప్పటినుంచి దీనిపై విస్త్రతమైన చర్చ జరుగుతూనే ఉంది. నేడు సామాన్య పౌరులకు సైతం ఆర్టికల్ 370 యొక్క దుష్పలితాలు వివరంగా కాకపోయినా, దాని వలనే అనర్ధాలన్నీ జరుగుతున్నాయన్న అవగాహన ఉంది. అందుకే తరచూ ఆ ఆర్టికల్ ను భారత రాజ్యాంగం నుండి తొలగించాలని డిమాండ్లు వినబడుతున్నాయి. జాతీయ భావనలు కల్గినవారు ఈ డిమాండ్ చేసినప్పుడల్లా, కమ్యునిష్టులు, జిహాది మతస్తుల ఓట్లకోసం వెంపర్లాడే రాజకీయ పక్షాలు, సదరు ఆర్టికల్ కు మద్ధతుగా మాట్లాడటం, దాని జోలికొస్తే, సహించబోమంటూ వీరంగాలు వేయటం షరా మామూలే.
ఆర్టికల్ 370 సంగతి పక్కన బెడదాం. దీనిని అధికారికంగానే భారత రాజ్యాంగంల చేర్చటం జరిగింది.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ అన్నీ అందులో భాగమైన విధానం.
భారత రాజ్యాంగం రచన 1946 లో ప్రారంభమై, 26 నవంబరు, 1949న ముగిసింది. తర్వాత 26 జనవరి, 1950న అమలులోకి వచ్చింది. భారత రాజ్యాంగాన్ని రాయటానికి భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. 500 మంది పైచిలుకు సభ్యులు ఇందులో ఉన్నారు. రాజ్యాంగ రచన కోసం వీరంతా పలు కమిటిలు గా ఏర్పడి తమ విధులు నిర్వర్తించారు. వాటిలో ఒకటి డా. బి.ఆర్. అంబేడ్కర్ నాయకత్వాన ఏర్పడిన ముసాయిదా(డ్రాఫ్టింగ్) కమిటి. ఈ కమిటేయే గుండెకాయ. వీరు రాజ్యాంగ ముసాయిదా రాసి, అనంతరం దానిని రాజ్యాంగ పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రవేశపెట్టారు. అనేక తర్జన, భర్జనలు, మీమాంసలు, నిశిత విమర్శలు, చేరికలు, తొలగింపులు, ప్రక్షాళనలు పూర్తిచేసుకున్న అనంతరం, భారత రాజ్యాంగ పరిషత్ చేత, రాజ్యాంగం ఆమోదించబడింది. అంతటితో భారత రాజ్యాంగపరిషత్ దానంతటదే రద్దయిపోయింది.
26 నవంబరు,1950న అమలులోకి వచ్చేనాటికి భారత రాజ్యాంగంలో మొత్తం 395 ఆర్టికల్స్ ఉన్నాయి. ఆ తర్వాత కూడా మరికొన్ని ఆర్టికల్స్ ను రాజ్యాంగంలో చేర్చటం జరిగింది. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత చేర్చబడిన ఆర్టికల్స్ అన్నింటిని భారత పార్లమెంటు రూపొందించింది. వాటికి సంబంధించి ముసాయిదా బిల్లులను, న్యాయశాఖచే రూపొందించబడి, పార్లమెంటులోని రెండుసభలలో నిర్ధేశిత మెజార్టితో ఆమోదించబడిన పిదప, భారత రాష్ట్రపతి సంతకంతో, యీ కొత్త ఆర్టికల్స్ అన్నీ, భారత రాజ్యాంగంలో భాగమయ్యాయి.
ఆర్టికల్ 35 A
పైన పేర్కొన్న అంశంలో ఒక ఆర్టికల్ భారత రాజ్యాంగంలోకి ఎలా జేరుతుందో చర్చించుకున్నాము.
1. 1950కి ముందైతే, భారత రాజ్యాంగ పరిషత్ చే ఆమోదించబడి ఉండాలి.
2. 1950 తర్వాత అయితే, భారత పార్లమెంటుచేత ఆమోదించబడి ఉండాలి.
భారత రాజ్యాంగంలో ప్రస్తుతమున్న ఆర్టికల్స్ లో ఒకే ఒక్కటి మాత్రం, ఈ రెండు విధానాలలో దేనిని పాటించకుండానే, ఎంచక్కా వచ్చి కూర్చున్నది.
టిక్కెట్ కొనకుండా, మరేవిధమైన పాస్ లేకుండా బస్ లో సీటులో కూర్చొని ప్రయాణిస్తున్న ప్రయాణికుడి వంటిది ఆర్టికల్ 35A.
ఇంతకీ ఆర్టికల్ 35A గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాము.
భారత రాష్ట్రపతి చే జారీ కాబడిన పాలనాపరమైన ఉత్తర్వు ద్వారానే ఈ ఆర్టికల్ ను భారత రాజ్యాంగంలో చేర్చారు. అయితే దీనిని రాజ్యాంగ ప్రధాన భాగంలో కాకుండా, అనుబంధం.1 (అనెక్జర్.1 ) రూపంలో చేర్చటం జరిగింది. అందువలననే ఎవరైనా రాజ్యాంగం చదువుతుంటే, ఆర్టికల్ 370 కనబడుతుంది కాని ఆర్టికల్ 35A మాత్రం కనబడదు. సాధారణంగా ఎవరూ అనుబంధం చదవరు. అసలు అనుబంధం ఒకటి ఉందనే సంగతి చాలమంది న్యాయనిపుణులకు కూడా తెలియదు.
ఇంతకీ ఆర్టికల్ 35A  ఏ విధంగా కాశ్మీరు సమస్యలకు మూలకారణమో పరిశీలిద్దాం.
ఎవరిని భారతదేశ పౌరులుగా పరిగణించవచ్చు అనే విషయాన్ని భారత రాజ్యాంగం నిర్వచిస్తుంది. కాని ఎవరు కాశ్మీరు పౌరులు అవుతారో చెప్పేది జమ్మూకాశ్మీర్ శాసనసభ మాత్రమే.
ఈ ఆర్టికల్ 35A జమ్మూకాశ్మీర్ లో శాశ్వత నివాసులెవరో నిర్ణయిస్తుంది. ఎవరిని జమ్మూకాశ్మీర్ శాశ్వత నివాసులుగా గుర్తించాలి అనే హక్కును జమ్మూకాశ్మీర్ రాష్ట్రప్రభత్వానికి కట్టబెడుతుంది. శాశ్వత నివాసుల గుర్తింపు విషయంలో జమ్మూకాశ్మీర్ శాసనసభదే తుది నిర్ణయం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కోస్తా, రాయలసీమ, తెలంగాణా అనే ప్రాంతాలు ఉన్నట్లు, జమ్మూకాశ్మీర్ కూడా మూడు ప్రాంతాల సమాహారం.
1. కాశ్మీరు లోయ
2. జమ్మూ ప్రాంతం
3. లడఖ్ ప్రాంతం
కాశ్మీరులోయలో దాదాపు అందరూ ముస్లింలే ఉంటారు.1990ల కు ముందు కాశ్మీరు పండిట్లనబడే హిందువులు సుమారుగా ఉన్నా, నాటి ప్రభుత్వాల అసమర్ధత వలన వారంతా, ఉగ్రవాద దాడులకు గురై, ప్రాణాలరచేత బట్టుకుని, ఢిల్లీ, జమ్మూ ప్రాంతాలకు శాశ్వతంగా వలస పోయారు. నాటి నుండి కాశ్మీరులోయలో నూరు శాతం ముస్లింలే ఉంటున్నారు.
జమ్మూ ప్రాంతలో ఆది నుండి హిందువులు అధిక సంఖ్యాకులు. ముస్లింలు, సిక్కులు కూడా కొద్దిమంది ఉన్నారు.
ఇక మూడవ ప్రాంతమైన లడఖ్ లో జనసంఖ్య చాల స్వల్పం. ఆ ఉన్న కొద్దిమంది బౌద్ధులు.
ఇలా మూడు ప్రాంతాలు, మూడు మతాల ప్రజల ప్రాబల్యంతో ఉన్నాయి.
కాశ్మీరు భారత్ లో విలీనమైన వెంటనే, ఆ రాష్ట్రంలో రాజరికం తొలగిపోయి, ప్రజాస్వామ్య విధానంలో రాష్ట్ర అసెంబ్లి ఏర్పాటుచేయబడింది. జమ్మూకాశ్మీరు అసెంబ్లిలో ఎన్ని స్ధానాలు ఉండాలి అనేది నిర్ణయించాల్సి వచ్చింది. తక్కిన భారత దేశంలో కేంద్ర లోక్ సభతో సహా, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో, కేవలం జనాభా ప్రాతిపదినే సీట్లు నిర్ణయిస్తారు. అదే విధానాన్ని జమ్మూకాశ్మీరుకు సైతం వర్తింపజేయాల్సివుండగా, నెహ్రూ-షేక్ అబ్దుల్లా ద్వయం దానిని పాటించలేదు.
షేక్ అబ్దుల్లా గారు జమ్మూకాశ్మర్ రాష్ట్ర అసెంబ్లీలో ఎట్టి పరిస్ధితులలో ముస్లిం జనాభా అధికంగా గల కాశ్మీరు లోయ ప్రాంతానికి ఎక్కువ సీట్లు ఉండేటల్లు చక్రం తిప్పారు. జనాభా ప్రాతిపదిక గా అసెంబ్లీ సీట్లు నిర్ణయించాల్సి వుండగా, అబ్దుల్లాగారు మాత్రం తనకు తోచినట్లుగా, కాశ్మీరు లోయ ప్రాంతానికి ఎప్పటికీ రాష్ట్ర అసెంబ్లీలో ఆధిక్యత ఉండితీరేలా సీట్ల సంఖ్య ను నిర్ణయిస్తూ లేఖ రాశాడు. ఆ లేఖను నాటి ప్రధానమంత్రి నెహ్రూ ఎటువంటి అధ్యయనం లేకుండా ఆమోదించటం జరిగింది. దాని ప్రకారం సీట్ల నిర్ణయం క్రింది విధంగా జరిగింది.
 
జమ్మూకాశ్మీరు అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య.... 111.
1. పాక్ ఆక్రమితకాశ్మీర్ ప్రాంతానికి............  24
2. కాశ్మీరు లోయ ప్రాంతానికి ............ 46
3. జమ్మూ ప్రాంతానికి ............. 37
4. లడఖ్ ప్రాంతానికి ..............  4
పాక్ ఆక్రమిత కాశ్మీరుకి కేటాయించిన స్ధానాలు అలా ఎప్పుడూ ఖాళిగా ఉంటాయి. జమ్మూ, లడఖ్ లకు ఉన్న  స్ధానాలు కలిపినా 41 మాత్రమే. కాశ్మరు లోయకు మాత్రము 46. (తక్కిన భారతదేశంలో వలే జనాభా ప్రాతిపదికన నిర్ణయిస్తే జమ్మూ ప్రాంతానికి కొన్ని సీట్లు వచ్చివుండేవి. ఆ మేరకు కాశ్మీరు లోయకు తగ్గి ఉండేవి.) దీనివలన కాశ్మీరు ప్రభుత్వం అనేదే ఎప్పటికీ కాశ్మీరు లోయ ప్రాంతానికి చెందినవారిదే అయి ఉంటుంది. అటువంటి ప్రభుత్వం ఎవరు జమ్మూకాశ్మీరు వాసులో నిర్ణయించటంలో పూర్తి పక్షపాతంలో వ్యవహరిస్తుందనటంలో సందేహం లేదు.
 
ఈ ఆర్టికల్ 35A ఆధారంగా జమ్మూకాశ్మీరు అసెంబ్లీ  అర్హులైనవారికి శాశ్వత నివాస గుర్తింపు సర్టిఫికెట్ జారీ చేస్తుంది. దీనినే Permanent Residence Certificate (PRC) అంటారు. ఈ సర్టిఫికెట్ ఉన్నవారు మాత్రమే భూముల కొనుగోలు, అమ్మకాలు చేయవచ్చు. వారికి మాత్రమే ఉద్యోగాలు చేసే అవకాశం, ఓటు వేసే హక్కు లభిస్తాయి. జమ్మూకాశ్మీర్ రాష్ట్ర పౌరులుగా వారికి మాత్రమే సర్వ హక్కులు లభిస్తాయి.
1947లో జమ్మూ,కాశ్మీర్, భారత్ లో విలీనమయ్యేటప్పటికున్న ప్రజలతో పాటు, అదనంగా ఈ క్రిందివారికి పి.ఆర్.సి లభించింది. వారు
1. 1959లో చైనానుండి వలస వచ్చిన ఉగీర్ ముస్లింలు.
2. టిబెటన్ ముస్లింలు.
3. ఇటీవల బర్మా నుండి కాశ్మీరుకు వలస వచ్చిన రోహింగ్యా ముస్లింలు.
పి.ఆర్.సి కోసం వేచిచూస్తున్న చకోర పక్షులు..
1. దేశ విభజన సమయంలో ఎక్కువమంది హిందువులు ఢిల్లీకి వలస వచ్చారు. కొద్దిమంది కాశ్మీరు వలస వచ్చిన హిందువులెవరికీ నేటీకి పి.ఆర్.సి లభించలేదు.వీరికి ఓటు హక్కు సైతం లేదు. ఈ హిందువులు కేవలం టయిలెట్ లలోని పనులకు మాత్రమే అర్హులు(సఫాయి కర్మచారీ). వేరే ఉద్యాగాలు చేయటానికి అవకాశం లేదు.
2. కొందరు షియా ముస్లింలకు, గూర్ఘా సైనికుల వారసులు సైతం పి.ఆర్.సి లేదు.
వాస్తవానికి ఈ రకమైన ఆర్టికల్ ఒకటి ఉందన్న సంగతి ఇటీవలి కాలం వరకూ చాలమందికి తెలియదు. ఈ ఆర్టికల్ ను 14, మే...1954వతేదిన భారత రాష్ట్రపతి ఆదేశాల మేరకు భారత రాజ్యాంగంలోకి చొప్పించారు.
జమ్మూ నగరానికి చెందిన  “We, The Citizens”  అనే స్వచ్ఛంద సంస్ధ, ఈ ఆర్టికల్ పై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అటు రాజ్యాంగ నిర్మాణ సభ, లేక భారత పార్లమెంటులతో సంబంధం లేకుండా భారత రాజ్యాంగంలోకి చొరబడ్డ ఈ ఆర్టికల్ 35A యొక్క చట్టబద్ధతను ఆ సంస్ధ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఈ పిటిషన్ పై విచారణ జరుపుతుంది. సుప్రీంకోర్టు ఈ ఆర్టికల్ చెల్లుబాటును కొట్టివేస్తే,, దీని పీడ విరగడైనట్టే. అదే సమయం లో ప్రభుత్వం దీనిని అంతం చేయటానికి సకల శక్తులు వినియోగించాలి.
భారత రాజ్యాంగంలోకి జవహర్ లాల్ నెహ్రూ, షేక్ అబ్దుల్లాల చే అక్రమంగా చొప్పించబడిన, ఈ ఆర్టికల్ వల్లనే కాశ్మీరులో వేర్పాటు వాదులు ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఆర్టికల్ 370తో పాటు, ఆర్టికల్ 35A   కూడ రద్దయిన రోజునే, ఒకప్పుడు దారితప్పిన పంజాబ్ ను దారిలోకి తెచ్చినట్లు, కాశ్మీరును కూడా కంట్రోలులోకి తీసుకురావచ్చు. ఆర్టికల్ 370 కి రాజ్యాంగ బద్ధత మీద చాలా సందేహాలున్నాయి !
సుబ్రహ్మణ్య స్వామి అభిప్రాయం ప్రకారం ఆర్టికల్ 370 కి అసలు రాజ్యాంగ బద్ధత లేదు ! అది కేవలం నెహ్రూకు, షేక్ అబ్దుల్లా కు మధ్య జరిగిన చీకటి వప్పందం మాత్రమే ! దాని మీద అప్పట్లో పార్లమెంట్ లో చర్చే జరగలేదు ! కాబట్టి చట్ట సవరణ అవసరం లేదు !  కాబినెట్ రాటిఫికేషన్ చేసి ! దాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించేస్తే సరిపోతుంది అని ! సుబ్రహ్మణ్య స్వామి వాదన !
ఒకవేళ దానికి రాజ్యాంగ బద్ధత వున్న మాట వాస్తవమే అయితే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి  2/3 మెజారిటీతో దాన్ని రద్దు చేయలేమా ?
ఇప్పుడున్న పబ్లిక్ సెంటిమెంట్ ని కాదని, కాంగ్రెస్ తదితర సూడో పార్టీలు అడ్డుకోగలవా ?
అలా చేస్తే ప్రజాగ్రహ జ్వాలల్లో మాడి మసై పోరా ?
ఆ ప్రయత్నం చేయడానికి ఇదే సరైన సమయం కాదా ? ఇంతకీ మోడీ మనసులో ఏముందో అంతు చిక్కడం లేదు !
రెండేళ్ల కింద ఎకనామిక్ టైమ్స్ లో ఒక ఆర్టికల్ చదివాను ! అందులో అంశాలు చూస్తే ఎవరికైనా మతి పోతుంది !
1947 నుంచి ఇంతవరకూ జమ్మూకాశ్మీర్ రక్షణ మీద మనం పెట్టిన మొత్తం ఖర్చు లెక్కేసి ! కశ్మీర్ భూభాగం మొత్తాన్ని దానితో భాగిస్తే  ఒక్కొక్క ఎకరాకి సగటున 5 నుంచి 6 లక్షల వరకూ మనం ఖర్చు పెట్టినట్టు తేలింది !
అంటే మనదైన భూభాగాన్ని ఒక్కొక్క ఎకరాకు 6 లక్షలు ఖర్చు పెట్టి మనం కొన్నామా ? అని సామాన్యులకు సందేహం రాక మానదు !
ఇంత చేసినా ఇంకా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు ! ఇంకా ఎంత కాలమిలా ?
కేవలం డబ్బు సమస్య కాదు ! ఎంత మంది సైనికుల, సామాన్యుల విలువైన ప్రాణాలు కోల్పోయాం ? కాశ్మీరీ పండితులైతే కొన్ని లక్షల కుటుంబాలు ఇప్పటికీ బిక్కు బిక్కు మంటూ దిక్కుమాలిన బతుకు బతుకుతున్నారు ?
ఇదంతా ఎవరి కోసం ? కేవలం నెహ్రూ కీర్తికాంక్ష కోసమేనా ? ఒక మనిషి కీర్తి దాహాన్ని తీర్చడానికి దేశం ఇంకా ఎన్నాళ్లు మూల్యం చెల్లించాలి ?
ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేస్తే ఈ విషయాలన్నీ చర్చకు వస్తాయి కదా ? ముఖ్యంగా ఈ సమస్యకి మూలాలు ఎక్కడున్నాయో తెలియని ప్రస్తుత తరానికి అవగాహన కల్పించినట్టు అవుతుంది కదా ? లేకపోతే ప్రస్తుత తరం ఈ సూడో నాయకుల అసత్య ప్రచార ప్రవాహంలో పడి కొట్టుకు పోయే ప్రమాదం ఉంది.
Strike While the Iron Is Red Hot !
మంచి తరుణం మించిన దొరకదు ! మొద్దునిద్రకి అలవాటు పడ్డాం!
ఇప్పుడు ఆయాచితంగా వచ్చిన ఈ అవకాశాన్ని ఎందుకు వృధా చేయాలి ?
కుడితే కుట్టాయిలే 2 దేశాల తేనెటీగలు...యాదిరెడ్డి

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments