Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

మంచి ఆరోగ్యము కొరకు తప్పక తెలుసుకోవలసిన 24 విషయాలు - 24 health tips for good health in telugu

1. ఉపవాసము ఉపవాస కాలము నందు రోగి శరీరమును క్రొత్త మలముత్పన్నము కాదు. ప్రాణ శక్తిని పెంచుటకు వెనుక ప్రోగు పడిన మలమును తొలగించు సవకాశం లభి...


1. ఉపవాసము ఉపవాస కాలము నందు రోగి శరీరమును క్రొత్త మలముత్పన్నము కాదు. ప్రాణ శక్తిని పెంచుటకు వెనుక ప్రోగు పడిన మలమును తొలగించు సవకాశం లభించును. ఇట్లు మాల శుద్ధి ద్వారా ఆరోగ్యం లభించును.
ఉపవాసము ఆహారం తీసుకొనకుండుట. జనులు ఉపవసింతురు కాని ఉపవాసము వదిలిన తరువాత ఏమి తినవలెనో ఆలోచింపరు. కనుక అధిక లాభము కలుగదు. ఉపవాసం ఎన్ని దినములు చేయుదురు ఉపవాసం
విడిచిన తర్వాత ఎన్ని రోజులు పెసలు నా వేసిన నీరు, అంతకు రెట్టింపు కాలం నానిన పెసలు తినవలెను. ఆ తరువాత పులగము, అన్నం మొదలగునవి తినవలెను. అంతమున సామాన్య భోజనం చేయవలెను.
2. ఏ రోగ ప్రారంభ కాలమునందైనను ఉపవాసముండి పెసలు నాని వేసిన నీరు, నానిన పెసలు, ఉడకబెట్టిన శనగలు, బియ్యపు గంజి మనవి తీసుకొనవలెను. ఔషధం సేవించు విధానం తెలుపనిచో నీటిలో కాని తేనె లో కాని ఆ ఔషధం సేవింపవలెను.
3. పరగడుపున తీసికొని ఆయుర్వేద ఔషధము అధిక లాభదాయకము, పరగడుపున మధ్యాహ్నం, రాత్రి భోజనమునకు పూర్వము మందు తీసుకొనవలెను. కాని ఫలానా విధంగా తీసుకొనవలెనని చెప్పబడినపుడు అట్ల తీసుకొనుట యందు శ్రద్ధ చూపించవలెను.
4. సామాన్యముగా ఔషధము 4 గంటల వ్యవధిలో దినమునకు మూడు సార్లు తీసుకొనవలెను.
5. వివిధ ఔషధముల ప్రమాణము చెప్పబడనిచో దానిని సమాన ప్రమాణము లలో తీసుకొనవలెను.
6. ఔషధ ప్రమాణము సందేహమున్న ప్రారంభ కాలమున కొలది ప్రమాణముతోను ఆ తరువాత క్రమముగా పెంచుచూ బోయి వైద్యుని సలహా తీసుకొనవలెను.
7. ముష్టి విత్తులు, జాజికాయలో నగు ఉగ్రౌధమును జాగ్రత్తగానే, తక్కువ ప్రమాణములోను తీసుకొనవలెను.
8. కరక్కాయ తినుట మిక్కిలి హితకారి, భోజనమైన పిమ్మట పోకలవలె, రాత్రి యందు కరక్కాయ తప్పక తీసుకొనవలెను. దీనిని రెండవ తల్లియనియు అందరు. కాని అలసిన వారు, బలహీనులు, దప్పిగొన్నవారు, ఉపవాసమున్న వారు, గర్భవతులు కరక్కాయ తినరాదు.
9. ఉసిరి తినుట మిక్కిలి హితకరము. కనుక భోజన ప్రారంభమునకు మధ్య, అంతములందు నిత్యము సేవించవలెను.
10. భోజనానంతరం ఒక గంట తర్వాత నీరు త్రాగుట ఆరోగ్యము.
11. మధ్యాహ్న భోజనం తర్వాత నూరడుగులు నడిచి పది నిమిషాలు ఎడమవైపు పరుండుట ఆరోగ్యమునకు మంచిది.
12. కుడి ముక్కు శ్వాసను పీల్చుతూ భోజనమును, ఎడమ ముక్కు శ్వాసను పీల్చుతూ ద్రవమును తీసుకొనుట ఆరోగ్యమునకు మంచిది.
13. అన్నం, కూర లతో పాటు పండ్ల రసం ఎంత మాత్రము తీసుకొనరాదు. రెండింటి మధ్య రెండు గంటల వ్యవధి ఉండవలెను.
14. పాలతో పాటు పెరుగు, తులసి, అల్లం, వెల్లుల్లి, నువ్వులు, బెల్లం, ఖర్జూరము, చేపలు, ముల్లంగి, నిమ్మ, అరటిపండ్లు, బొప్పాయి పండ్లు, అన్ని రకాల పండ్లు కాని,వాటి రసాలు గాని, ఫ్రూట్ ఐస్ క్రీములు గాని తీసుకొనరాదు.
15. పండ్ల రసాలు పగటి పూట తీసుకొనవలెను. రాత్రి పండ్లు రసం ఎంత మాత్రము తీసుకొనరాదు.
16. మామిడి పండు రసముసకు బదులు మామిడి పండు ను తినుట ఆరోగ్యం.
17. అరటి పండు ఉదయము తినుట రాగి విలువను , మధ్యాహ్నం తినుట వెండి విలువను , సాయంత్రం తీసుట స్వర్ణం అంత విలువను కలిగి యుండును శ్రమ చేయని వారు ఎక్కువగా అరటి పండ్లు తింటే హానికరం.
18. వ్యాధి యున్నప్పుడు అరటి పండు, మామిడి పండు, జామపండు. బొప్పాయి పండు, సొరకాయ, టమోటా, పెరుగు, మొక్క మొలిచిన ధాన్యము. జున్ను, ఎండిన కూరలు, చేపలు, పులియబెట్టిన పిండి, బేకరీ, ఫ్రిజ్ వస్తువులు, చాక్లెట్లు, బిస్కట్లు, కూల్ డ్రింక్స్ మున్నగు వాడిని ఎప్పుడూ తినరాదు, త్రాగరాదు, మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, ఆలుగడ్డలు, వేరుశనగ, అరటి పండు, బొప్పాయి పండు, నారింజ పండు మొదలైనవి త్వరగా జీర్ణం కావు. ఆయుర్వేదము వీనిని ఘనపదార్ధములనుట వలన దీనిని తీసుకొనకూడదు.
19. టమాటా : వాపులు, కీళ్ల వాతం, ఆమ్ల వాతము, ఆమ్ల పైత్య రోగులకు అనుకూలమైనది కాదు. శీత పైత్య వ్యాధి కలవారికి, శిరమున అధికోష్ణము గలవారికి, జఠర ఆంత్యము లేక గర్భాశయము నందు పుండ్లు గల వారికి,
అతి సారము గల వారికి, పులుపు పడని వారికి టమోటాలు హానికరము.
20. రాత్రి యందు, వసంత, గ్రీష్మ, శరద్, వర్ష ఋతువు లందు పెరుగు తింటే హితకరము గాదు. జ్వరం, నంజు, రక్త పైత్యము, కఫము, పైత్యము, చర్మరోగము, బోదకాలు, రక్త వికారము, పాండు రోగం, మండుట మొదలగు
వాని యందు పెరుగు తినరాదు.
21, బాదం పప్పు నిండియున్న సీసా లో రెండు చెంచాలు చక్కెర వేయుట వలన నెలల తరబడి బాదం రుచిని కోల్పోదు.
22. శిరము, ఛాతి పై ఎక్కువగా కాపు పెట్టుట హానికరము.
23. స్నానమునకు పూర్వం మాలిష్ చేసుకొని వ్యాయామం చేయవలెను. వ్యాయామం అనంతరం వెంటనే స్నానం చేయరాదు తర్వాత చేయవలెను.
24. రోజూ కనీసం 6 లీటర్ల నీరు తాగే ప్రయత్నం చేయండి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia


2 comments