లవణము యొక్క వినియోగం భోజనమందు దినదిన ప్రవర్ధమాన గు చున్నది. రుచికరములగు మసాలాలతో గూడినటి తిను పదార్థములను నిత్యనియమిత రూపమున వృద్ధి యగుచ...
లవణము యొక్క వినియోగం భోజనమందు దినదిన ప్రవర్ధమానగుచున్నది. రుచికరములగు మసాలాలతో గూడినటి తిను పదార్థములను నిత్యనియమిత రూపమున వృద్ధి యగుచున్నది. చక్కెర వలే లవణము
మన శరీరమునకు మిక్కిలి హానికరం. ఇది శరీరమునకు అనివార్య మేకాని ఆరోగ్యదష్ట్యా పరిశీలించిన ఆవశ్యకములగు లవణాల ప్రమాణము మనకు ప్రాకృతిక రూపమున ఆహార పదార్థముల ద్వారానే సమ కూరుచున్నది, మనముపయోగించు పచ్చని కూరలందును అంకురిత బీజము లు మొదలగు వాని వలన మన శరీరమందు లవణము స్వతహాగానే పూరింపబడును.
కొన్ని సంవత్సరములకు పూర్వం ఒక ప్రసిద్ధ వార్త పత్రిక తన గ్రాపు ప్రకటించి లవణము శరీరమునకు విషము కంటే అధిక ప్రమాదకారి అనే కథనమును బలపరిచినది. చికిత్స విజ్ఞాన పరిశోధకులు సైతం బ్లడ్ ప్రెషర్ రోగాలకు ముఖ్య హేతువు లవణం అని సత్యమును బలపరిచిరి. ఈ కారణం వలన బ్లడ్ ప్రెషర్ కలిగిన రోగులకు ఆహారం నందు లవణమును నిషేధించింది. లవణము త్యజించిన వారు ఈ రోగం నుండి విముక్తులగుదురు, త్యజింపని వారు రోగ గ్రస్తులగుదురు.
ఒక పరిశోధన వలన సుదూరారణ్య పర్వత ప్రదేశములందు నివసించే అనేక ఆదివాసుల ఆహార పద్దతిలో లవణమునకు స్థానం లేదు. ఆధునిక సౌకర్యములచే వంచితులైన ఆ యాదీవాసులు ఆరోగ్యదృష్టితో నేడు మన కంటే బలిష్టులుగను, ఆరోగ్యులుగను ఉన్నారు. ఆహార పదార్ధములలోనే లవణములను పూరించు కొందురు.
లవణము ఎక్కువగా తీసికొనుటవలన రోగనిరోధకశక్తి సన్నగిల్లు, తత్ఫలితంగా పెక్కు రోగముల పాలబడవలసి యుండును.
కనుక దీర్ఘాయుషును గోరువారు ఎల్లప్పుడు ఆరోగ్యులుగను, ప్రసన్నులు గాను ఉండవలసి యుండును. సాధనామయ జీవితము గడుపవలసి యుండును. అట్టి వారు లవణాలను సంపూర్ణముగా త్యజింపవలెను. లేదా వారమునకొకటి రెండుసార్లు లవణము లేని ఆహారం తీసికొనుచు నిత్య జీవితం నందు వీనిని అతి స్వల్పం గా తీసుకొనవలెను.
సాధకులు ఆహార పదార్థాలు లందు లవణము అతి స్వల్పం గా తీసుకొనవలెను. దీని వలన ఆరోగ్యము, ప్రసన్నత నిలిచి యుండు. భగవద్భక్తి అధిక సమయం చేకూరును.
No comments