Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

సుభాష్ చంద్రబోస్ తన సోదరుడు శరత్ చంద్రబోస్ కి రాసిన ఒక ఉత్తరం - Subhash chandra bose letter to His brother sarath

ఈ దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది అన్నదమ్ములు కలిసి పనిచేశారు ఎంతోమంది బందువులు దేశంకోసం కలిసి త్యాగం చేశారు అటువంటి వారిలో సుభాష్ చంద్...


ఈ దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది అన్నదమ్ములు కలిసి పనిచేశారు ఎంతోమంది బందువులు దేశంకోసం కలిసి త్యాగం చేశారు అటువంటి వారిలో సుభాష్ చంద్రబోస్ సోదరులు కూడా సుభాష్ తన సోదరుడు శరత్ చంద్రబోస్ కి రాసిన ఒక ఉత్తరం లో ఇలా ఉంది...
కటక్,
8.1.1913.
ప్రియమైన అన్నగారికి,
ఒక సంవత్సరం గడిచిపోయింది. ఈ పండ్రెండు నెలల్లో మనం ఏదైనా ప్రగతి సాధించి ఉన్నా, లేకున్నా భగవంతుని పట్ల మాత్రం మనకు భాధ్యత ఉందని భావించాలి.
గడిచిన సంవత్సరపు కార్యకలాపాలను గురించి ఆలోచించినప్పుడు నేను జీవిత లక్ష్యాన్ని గురించి కూడా ఆలోచనల్లో పడిపోతూ ఉంటాను. టెనిసన్ను ఒక తిరుగులేని ఆశావాది అయిన కవిగా నేను భావిస్తాను. ప్రపంచం రోజు రోజుకు ప్రగతి సాధిస్తూ ఉందని ఆయన నమ్మాడు. కానీ, ఇది వాస్తవమేనా? మన ప్రియ భారతదేశం ప్రగతి అనే రాజమార్గం పైన ముందుకు సాగుతోందా? నేను అలా అనుకోలేకపోతున్నాను. చెడులోనే మంచి దాగి ఉండవచ్చునేమో! భారతదేశం పాప దురాచారాల దారి గుండా నడిచి ప్రగతివైపుకు సాగుతుందేమో! కానీ, వివేకము, దూరదృష్టి, భవిష్య దృష్టి నుంచి అందే సూచనలు బట్టి చూస్తేనేమో అన్ని వైపులా అంధకారం గాఢాంధకారమే. అందులో నిజమైన కార్యకర్త, ఉదాత్త దేశభక్తుడు రూపంలో సంతోష పడడానికి ఎక్కడో ఒకటిగా కొన్ని అశాకిరణాలు తళుక్కు మంటూంటాయి. ఒక్కొక్కప్పుడు ఈ కిరణాల వెలుగు ప్రసరిస్తున్నట్లు కనిపిస్తే మరొకప్పుడు అంధకార సామ్రాజ్యమే ఇక ముందు కొనసాగుతూ ఉంటుందేమోననిపిస్తుంది. భారతదేశపు భవిష్య చరిత్ర తుపాను కల్లోలంతో కూడిన అంధకారమయమైన ఆకాశంలాగా ఉంది. ఇంగ్లండు, సంపూర్ణ ఐరోపా బహుశా ప్రగతిపథంలో ముందుకు సాగిపోతూ ఉండవచ్చు. ఐరోపా ఆకాశంలో ధర్మ నక్షత్రం ఉదయిస్తూ ఉంది. కానీ భారతదేశపు అకాశంలో అది మెల్లమెల్లగా అస్తమిస్తోంది. భారతదేశం ఒకప్పుడు ఎలా ఉండేది. ఇప్పుడు ఎలా ఉంది! ఇది ఎంత భయంకరమైన పరివర్తన! ఆ ఋషులు, మునులు, తత్త్వజ్ఞానం ఇప్పుడు ఎక్కడున్నారు? జ్ఞానపు చివరి అంచులదాకా తమ ప్రసరింపజేయగలిగిన మన పూర్వికులు నేడు ఎక్కడున్నారు? వారి తేజోమయమైన వ్యక్తిత్వం ఎక్కడ అంతరించిపోయింది? వారిలాంటి నిష్ణాపరులైన బ్రహ్మచారులు ఈనాడు ఎక్కడున్నారు? వారు పొందిన భగవదనుభూతి ఎక్కడుంది? నేడు మనం చర్చించుకొని సంతృప్తిపడే అలనాటి వారి ఆత్మ-పరమాత్మల సంగమమెక్కడుంది? అంతా మటుమాయమై పోయింది కదా! వారు చేస్తూ ఉండిన వేద మంత్రోచ్చారణ ఇప్పుడు ఎక్కడా వినపడదు. పవిత్ర గంగాతీరంలో ఇప్పుడు సామవేద ధ్వని ప్రతిధ్వనించదే! అయినా, అశ ఇంకా మిగిలి ఉంది. కనీసం నాకు అలా అనిపిస్తుంది. మన కొడిగట్టిన ఆత్మలను మళ్ళీ ప్రకాశవంతం చేయడానికి, మన సోమరితనాన్ని వదలగొట్టడానికి ఆశాదేవి మన మధ్యకు వచ్చేసింది. ఆమె ఆవిర్భావం స్వామి వివేకానందుని రూపంలో జరిగింది. అక్కడ చూడండి. దివ్య తేజస్సు తో వెలుగొందే ఆయన ముఖమండలం, మర్మాన్ని ఛేదించే విశాలమైన ఆయన కళ్ళు, పవిత్రమైన ఆయన కాషాయ వస్త్రాలు హిందూ మతంలో జీర్ణించుకు పోయిన పవిత్ర సత్యాలను ఆయన సమస్త ప్రపంచానికి అందజేస్తున్నాడు. సంధ్యా నక్షత్రం అస్తమించింది. ఇప్పుడు చంద్రోదయం తప్పక అవుతుంది. భారతదేశ భవిష్యత్తు ఆశాజ్యోతులతో జాజ్వల్యమానంగా ఉంది. భగవంతుడు ఎల్లప్పుడూ హితము చేకూర్చేవాడే. పాపం, అధర్మం అనాచారం ఇలాంటి చెడులనుండి దూరంగా ఆయన మనలను మన ఏకైక లక్ష్యం వైపు తీసుకుపోతున్నాడు. అన్ని దిశల నుండి సమస్తము దాని వైపు
ఆకర్షితమవుతూ ఉందో, సమస్త సృష్టి దేనివైపు తప్పనిసరిగా పయనించాలో, ఆ అయస్కాంతమే పరమాత్మ. మనదారి ప్రమాదకరమైందీ రాళ్ళు అప్పలమయమైందీ కావచ్చు. మన యాత్ర కష్టదాయకం కావచ్చు. అయినా మనం ముందుకు సాగిపోవాల్సిందే. చిట్టచివరికి మనం అందులో లీనం కావలిసిందే. అలాంటి రోజు ఎంతో దూరం ఉండవచ్చు. కానీ, అది రాక తప్పదు. ఈ ఆశనే నేను కాపాడుకుంటూ వస్తున్నాను. ఈ ఆశ తప్ప మిగిలినదంతా నాకు నిరుత్సాహం కలిగించేదిగానూ, మనసును విరిచేదిగానూ మాత్రమే ఉంటుంది.
భగవంతుడు తన అయస్కాంత శక్తితో మనలను తన వైపు లాక్కుంటున్నట్లు అనిపించడం లేదా? నా మటుకు నాకు అలా అనిపిస్తుంది. ఆయన నలువైపులా ప్రాకృతిక సౌందర్యాన్ని వ్యాపింపజేసింది. ఆయన అస్తిత్వాన్ని మనం మరవకుండా ఉండాలనే కదా? ఆయన తన మహిమను కీర్తించమని అసంఖ్యాకమైన నక్షత్రాలను ఆదేశించలేదా? ఆకాశపు అనంతత్వం మానవునికి ఆయన అనంతత్వపు పాఠాన్ని నేర్పించడం లేదా? ఆయన మన మనసుల్లో ప్రేమను సంచరింపజేసింది మనపట్ల ఆయనకున్న ప్రేమను ఎల్లప్పుడూ మనం గుర్తు చేసుకుంటూ ఉండాలని కాదా? అహా.. ఆయన ఎంత మంచి వాడు! మనం ఎంత దుష్ట స్వభావులం! ప్రియమైన అన్నగారూ, నేనిదంతా ఇలా ఎందుకు రాస్తున్నానో నాకు తెలియదు. అప్పుడప్పుడు నేను మనసులోని బరువు దించుకునేందుకు వ్యాకులపడిపోతూ ఉంటాను. బహుశా ఇది కూడా అలాంటి విచిత్ర క్షణమేనేమో!.
నిన్నటి టపాలో మీ ఉత్తరం రావడం నాకు చాలా సంతోషం కలిగించింది. ఈ దూరం నానుండి మిమ్మల్ని వేరు చేసిందని కొద్ది రోజుల నుండి నాకు అనిపిస్తూ ఉంది. కానీ, ఈ పవిత్ర పత్రదూత ఆ కొరతను అవసరాన్ని మించి పూరించింది.
స్వర్గస్తులైన మా సహాయక ముఖ్యాధ్యాపకులు బాబూ సురేశ్ చంద్ర గుప్త స్మృతి చిహ్నంగా ఏదైనా ఒక వస్తువు స్కూల్ లో ఉండాలని మేము అనుకుంటున్నాం. పక్షం వరకు ఉండే ఆయన విగ్రహం మాకు ఇంగ్లాండు నుండి నేరుగా అందితే బాగుంటుందనుకుంటున్నాం. ఒకవేళ అది ఒక పౌండు దొరికేట్లైతే నిజంగానే చౌకే. దాన్ని ఇక్కడికి చేర్చడానికి బాడుగ మీ అంచనా ప్రకారం ఎంతవుతుంది? 35-40 రూపాయల్లో దాన్ని ఇంగ్లాండు నుండి నేరుగా తెప్పించడం వీలవుతుందా?
ఇప్పుడు మా పరీక్షలు జరుగుతున్నాయి. మేము బాగా రాస్తున్నాం. మేమంతా ఇక్కడ క్షేమం. మీరు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తూ. నమస్కారాలతో,
మీ స్నేహపాత్రుడు
సుభాష్.
కానీ ఇలాంటి ఉత్తరాలు చదుతున్నప్పుడు నాకనిపిస్తుంది ఎంతోమంది అన్నదమ్ములు, స్నేహితులు దేశం కోసం త్యాగాలు చేస్తే ఇప్పుడు మాత్రం దేశం లో కుతుంబాలు కుటుంబాలు దేశం సంపదను దోచుకునే ప్రయతనం చేస్తున్నారు చాలామంది ఇప్పటికే దోచుకుంటున్నారు మరల మనదేశ వైభవం ఎలుగెత్తి చాటేదెప్పుడు? దేశం గురించి ప్రతి ఒక్కరిలో ఆల్"ఓచన రగిలిద్దాం.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.


No comments