కంబన్: తమిళ రామాయణ రచయిత గా లోక ప్రసిద్ధి చెందాడు. కంబన్ వ్రాసిన రామాయణం కంబరామాయణంగా వాడుకలో ఉంది. ఉత్తర భారతదేశంలో తులసి దాసు వ్రాసిన ...
కంబన్: తమిళ రామాయణ రచయిత గా లోక ప్రసిద్ధి చెందాడు. కంబన్ వ్రాసిన రామాయణం కంబరామాయణంగా వాడుకలో ఉంది. ఉత్తర భారతదేశంలో తులసి దాసు వ్రాసిన రామచరిత మానస్ ఎంతటి ఉన్నత శిఖరాలనధిరోహించిందో, దక్షిణ భారతంలో కంబరామాయణానికి అంతటి అత్యున్నత స్థానం కలిగింది.
తమిళనాడు లోని శైవ మరియు వైష్ణవ భక్తులందరికీ కంబమహాకవి పట్ల అపారమైన శ్రద్ధ గౌరవాలున్నాయి. రమారమి నేటికి వేయి సంవత్సరాల పూర్వము తమిళనాడులోని తిరువ యుందర్ అనే గ్రామంలో కంబకవి జన్మించాడు. ప్రతిభాశాలియైన ఈ మహాకవికి శ్రీరంగంలోని పండిత మండలి 'కవిచక్రవర్తి' అనే బిరుదునిచ్చి సత్కరించింది.
కంబన్ తమిళనాట తన రామాయణం ద్వారా జీవనపర్యంతం రామగాథను ప్రచారం చేశాడు. ఎందరో మహానుభావులు ఆయనను సత్కరించి ధన్యులైనారు. వడయప్ప మొదలియార్ అనే జమిందారు ఆయనను పోషించాడు. తమిళ సాహిత్య చరిత్రలో 9వ శతాబ్ది నుండి 14వ శతాబ్దము వరకు కంబయుగమని పేరు. ఈ కాలం లోని కవులు, రచయితలు, కంబన్ మరియు అతని రామాయణంలో సాహిత్యం వెంట నడిచారు.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia
No comments