శివుడికి చెందిన వివిధ రకాల వారున్నారు. ఎటువంటి ఆరాధనకీ పరిమితమైపోని మార్మికులు ఉన్నారు - వీళ్ళు ఆలయాలకో, మందిరానికో వెళ్ళరు, ఎటువంటి ...
తమిళనాడుకు చెందిన గొప్ప యువతి కారైకాల్ అమ్మాళ్. ఈవిడ ఎవరితోనూ తన పేరు కూడా చెప్పలేదు. ఆవిడ కారైకాల్ అనే ఊరి నుంచి వచ్చింది కాబట్టి ఆవిడను కారైకాల్ అమ్మాళ్ అన్నారు. ఆవిడ శివుడి మీద తనకున్న భక్తిని, ఇష్టాన్ని ఎంతో గొప్పగా, మధురంగా వ్యక్తపరచింది. ఈవిడ కైలాస పర్వతానికి కాలి నడకన వెళ్లింది. మనం ఇక్కడ ఏమి అర్థం చేసుకోవాలంటే, తమిళనాడు నుంచి కైలాస పర్వతం వరకూ నడవడం, కైలాస పర్వతాన్ని చేరుకోవడం..అందునా ఒక స్త్రీ..! ఈవిడకి, ఇప్పుడు మనకు ఉన్నట్లుగా ప్యాంట్లుగానీ, స్వెటర్లు గానీ, థర్మల్స్ గానీ లేదా వెదర్ ప్రూఫ్ జాకెట్స్ కానీ- అలాంటివేమీ లేవు. ఆవిడ కేవలం అలా నడచుకుంటూ వెళ్లింది. ఆవిడ అక్కడికి చేరుకున్న తరువాత ఆ ప్రదేశం ఆవిడకి శివుడి శరీరంగా తోచింది. అందుకని, ఆవిడ అక్కడ ఆ కైలాస పర్వతం మీద కాలు మోపలేకపోయింది.
ఈ రోజున అది మూడు రోజుల యాత్ర. అటువంటి పరిమాణంలో ఉన్న కైలాస పర్వతాన్ని మొత్తం, ఆవిడ చేతుల మీద నడిచింది. ఎందుకంటే, ఈవిడకి ఆ భూమి ఎంతో పవిత్రంగా తోచింది. కైలాస పర్వతం మీద ఆవిడ పాదం మోపలేకపోయింది. అందుకని మొత్తం కైలాస పర్వతం చుట్టూ చేతులతో నడచింది. ఇలాంటి వారు ఇంకా ఎంతోమంది ఉన్నారు. మన గడ్డమీద నుంచి కూడా ఎంతోమంది స్త్రీలు ఉన్నారు.
No comments