Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఘజనీ మహమ్మద్ సోమనాథ్ దేవాలయంపై 17 సార్లు ఎందుకు దండయాత్ర చేశాడు? - Why did Ghazni invade Somnath Temple 17 times?

మహమ్మద్ గజినీ తన 30వ యేటినుంచి 60వ యేడు వచ్చేవరకు మొత్తం ఎంత సంపద పట్టుకెళ్ళాడో తెలియదు గానీ Central Asia ని మొత్తం పాలించే ...

మహమ్మద్ గజినీ తన 30వ యేటినుంచి 60వ యేడు వచ్చేవరకు మొత్తం ఎంత సంపద పట్టుకెళ్ళాడో తెలియదు గానీ Central Asia ని మొత్తం పాలించే రాజయ్యి ఉండి రాజ్యంలో ఘజనీ పట్టణ కోటలో కూర్చుని సుఖపడాల్సిన కాలం మొత్తం వీడు 2500 కిలోమీటర్ల దూరం సైన్యంతో సహా ఆసులో కండెలా సోమనాథ దేవాలయం చుట్టూ ఎందుకు తిరిగాడు.. ఇది వాస్తవాలతో కూడిన పూర్తి అధ్యయనం చేసి రాసిన వ్యాసం ఓపికతో చదవండి వాస్తవాలు తెలుస్తాయి.

తాడిచెట్టు ఎందుకు ఎక్కావురా అంటే దూడ గడ్డి కోసం! అన్నట్టు ఉంటుంది ఘజనీ మహమ్మదును సోమనాధ దేవాలయం మీద దాడికి ప్రేరేపించిన మూలకారణం! మన ఆలయాలనే కాదండి, మక్కా గుడిని కూడా మట్టగించేసి నల్లరాయిని బద్దలు కొట్టిన ధనపిశాచులు వాళ్ళు!

కేవలం మూడు వందల యేళ్ళలో 3000 ఆలయాల్ని ధ్వంసం చేశారు! ఆ తర్వాత మొఘల్ సామ్రాజ్యం ఏర్పడటంతో దాడి ఉధృతం తగ్గింది. స్థానిక ప్రజలకి వాటిపట్ల ఉండే ఆత్మీయతని బట్టి ఏ ఒక్క ఆలయమూ అనామకమైనది కాకపోయినప్పటికీ వాటిలో పది మాత్రం అప్పటికే ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాతి గాంచినవి. ఆ ప్రఖ్యాతియే ముస్లిములు పగబట్టి నాశనం చెయ్యడానికి కారణం అనేది వాస్తవం.

సోమనాధ ఆలయం (మొదటి దాడి సా.శ. 1026, ఆఖరి నిర్మాణం సా.శ. 1951) మొదట హిందూషాహి రాజవంశానికి చెందిన జయపాలుడు ఎదిరించాడు. ఈ యుద్ధంలో 15,000 మంది జైపాల్ సైనికులు చనిపోయారు. జైపాల్ ఓడిపోయి తన 15 మంది బంధువులతో వీడి ముందు తల దించుకుని నించోవాల్సి వచ్చింది. 5,00,000 మంది స్వేచ్చాజీవులైన భారతీయుల్ని బానిసల కింద తన రాజ్యానికి తీసుకుపోయాడు. జైపాల్ విడుదల కోసం 2,50,000 దీనార్లు డిమాండు చేసి వసూలు చేసుకున్నాడు. కానీ ఆ రాజు అవమానం భరించలేక తన రాజ్యం చేరిన వెంటనే ప్రాయోపావేశం చేసి స్వర్గస్థు డయ్యాడు. ఆయన కొడుకు ఆనంద పాలుడు రాజయ్యాడు.

ఇప్పుడు హిందూషాహి రాజవంశానికి చెందిన ఆనందపాలుడు ఎదిరించాడు. ఇతను మిగిలిన రాజుల్ని సహాయం కోసం పిలిస్తే Ujjain, Gwalior, Kalinjar, Kannauj, Delhi, Ajmer రాజులు ఇతని తరపున పోరాడటానికి యుద్ధరంగానికి వచ్చి నిలబడ్డారు. ఈసారి బలాబలాలు ఎంత సమానం అయ్యాయంటే గజినీకి గుండె జారిపోయి యుద్ధం మొదలుపెట్టటానికే చాలా సేపు పట్టింది! అప్పట్లో ఈ రాజ్యం ఎన్నో వైభవం గల ఆలయాలకు పేరు గాంచింది. దాంతో మిడతల దండు పొలం మీద పడినట్టు జనావాసాలతో సహా దారిలో ఉన్న సమస్తాన్నీ ధ్వంసం చేసుకుంటూ వచ్చి పడ్డాడు. వీడే కాదు, ముస్లిములలో ఎవడు ఏ నగరాన్ని పట్టినా ఇంతే, తిన్నదాంతో కక్కుర్తి చావక పళ్ళేన్ని నాలికతో నాకేసినట్టు తయారవుతుంది యుద్ధం పూర్తయ్యాక!

వీడు మధురలో అడుగుపెట్టినప్పుడు అడ్డుకునే నాధుడు లేడు. అంత చక్కని నగరాన్నీ అంత పెద్ద ఆలయాల్నీ చూసి గజినీ కళ్ళు తిరిగిపోయాయి. ఎంత దోచుకుపోయాడో తెలీదు. ఆ రాజ్ పాల్ అట్లా పిరికిగా ప్రవర్తించడం నచ్చని Kalinjar రాజులు మిత్రులతో కలిసి వచ్చి అతన్ని ఓడించి చంపేశారు. దాంతో ఉగ్రుడైన గజినీ వీళ్ళ మీద దాడి చేసి ఓడించేశాడు. రాజు సామంతుడిగా ఉండటానికి ఒప్పుకుని ఇచ్చిన కానుకలతో సంతోషపడి వెనక్కి వెళ్ళిపోయాడు.



ఈ దాడిలో ఏ ఆలయాన్నీ ధ్వంసం చెయ్యలేదు, ఏ రాజ్యాన్నీ కొల్లగొట్టలేదు. మరి ఎందుకొచ్చాడంటే 16వ దాడిలో సోమనాధ దేవాలయం తలుపులూ గట్రా మోసుకుపోతుంటే జాట్లు వెనకనుంచి కొట్టి ఏడిపించారు. వాళ్ళ మీద పడి పగ తీర్చుకుని పోయాడు.. మక్కా గుడి ప్రాంగణంలో ఉన్న 360 దేవీ దేవతల విగ్రహాలను అప్పట్లో ద్వసంచేశారు.. ఆ దాడిలో వారందరూ విశ్వసించే ఒక విగ్రహం అదే లెకపోతే సమస్య మొదలవుతుంది అనే ఆలోచన వచ్చింది అక్కడ ఉన్న ఖలీఫాకు,  అయినా సరే ఎందుకైనా మంచిదని జనాలకి అనుమానం వచ్చేలోపు "As late as the 14th century, Gujarati Muslim pilgrims were noted by Amir Khusrow to stop at that temple to pay their respects before departing for the Hajj pilgrimage." అని చెప్తున్న దాన్ని బట్టి పూర్వ ఇస్లామీయ కాలపు moon god stone బదులు ఆ కాలంలో moon god stone అని పేరు పడిన సోమనాధ లింగం తీసుకొచ్చి పెడితే సరిపోతుందని వాళ్ళు అనుకోవడం వల్ల భారతదేశం ఖర్మ కాలింది గానీ సామాన్య ముస్లిములకి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అనుమానమూ రాలేదు, ఇకముందు కూడా వస్తుందని నేను అనుకోవడం లేదు!

అలా ఒకసారి చేజారిపోయిన నల్లరాయి ఏమైందో తెలీని, జరిగిన మోసాన్ని జీర్ణించుకోలేని, పెద్ద రాయి స్థానంలో చిన్న రాళ్ళని చూసి సరిపెట్టుకోలేని రంధిలో వాళ్ళ కన్ను సోమనాధ లింగం మీద పడింది - అగ్నికి వాయువు తోడైనట్టు పూర్వ ఇస్లామీయ పాత అల్లా దేవుని పుత్రికలయిన Lãt, Manãt దేవతలు ముస్లిముల కొత్త అల్లా దేవుడు పంపించిన ఆఖరి ప్రవక్త ధాటికి జడిసి అక్కణ్ణుంచి పారిపోయి సోమనాధ దేవాలయంలో తల దాచుకున్నారనే పుకారు కూడా జత కలిసింది! వీళ్ళు చెప్పకుండా దాచెయ్యటం వల్ల ఈనాటి సామాన్య ముస్లిములకూ మనబోటి ముస్లిమేతరులకూ తెలియదు గానీ ఉజ్జయిని నుంచి వెళ్ళిన విక్రమార్క ప్రభువే మక్కాలో అశ్వేత లింగాన్ని ప్రతిష్ఠించి మక్కేశ్వరుడి ఆలయాన్ని నిర్మించి కురు వంశపు పండితులకు అప్పగించి వెళ్ళాడనేది అప్పటి వాళ్ళకి స్పష్టంగా తెలుసు!

"విగ్రహ్హారాధన మహ్హాపాపం!" అని మన దగ్గిర గంభీరమైన సుభాషితాలు చెప్పే ముసల్మాన్ సోదరులు ఏడాదికోసారి పెద్దరాయికి బదులు ఉన్న చిన్న రాళ్ళతోనే సర్దుకుపోయి ఇంత భీబత్సమయిన స్థాయిలో విగ్రహ్హారాధన అనే మహ్హాపాపం చేస్తూ రోజులు గడిపేస్తున్న కాలంలో Subuktagin అనే వాడికి పెద్ద కొడుకుగా Mahmud Ghaznavi పుట్టుకొచ్చాడు. లేత వయసులోనే జైపాల్ అనే హిందూ రాజుతో జరిగిన యుద్ధంలో తండ్రికి సహాయపడ్డాడు. అయితే తర్వాత కాలంలో తండ్రి ఎందుకో వీణ్ణి దూరం పెట్టేసినట్టు తెలుస్తుంది. సా.శ 997లో తండ్రి చనిపోయినప్పుడు చిన్న కొడుకు Ismail రాజయ్యాడు. కానీ ఇతను ఎక్కువ కాలం రాజ్యం చెయ్యలేదు,సా.శ 971లో పుట్టిన Mahmud సా.శ 998లో అతన్ని తొలగించి తన 27వ యేట రాజయ్యాడు. అన్నని కళ్ళు పొడిపించి జీవిత ఖైదుకి గురి చేశాడు - శేభాష్!

అతి తక్కువ కాలంలోనే అవక్ర పరాక్రమంతో విజృంభించి దాదాపు Central Asia మొత్తాన్ని తన స్వాధీనం చేసుకుని Ghazni పట్టణాన్ని రాజధాని చేసుకుని ఇస్లామిక్ ప్రపంచ చరిత్రలో తొలి సుల్తాన్ అయ్యాడు.ఇస్లామిక్ భావజాలంలో ఖలీఫాయే ముస్లిములందరికీ రాజు అనేదాన్ని బద్దలు కొట్టి సర్వస్వతంత్రుడైన పరిపాలకుడు అని అర్ధం వచ్చే ఆ బిరుధు ధరించడానికి చాలా దమ్ము కావాలి - ఈడు మగాడ్రా బుజ్జీ!!

అప్పుడిక సోమనాధ శివలింగాన్ని తెచ్చే ఘనకార్యం మీదకి దృష్టి మళ్ళింది. మన దేశపు మెకాలే మానసపుత్రులైన చరిత్రకారులు గజిని మతపరమైన కారణాలతోనే మన దేశం వచ్చాడనేది ఒప్పుకోవడం లేదు గానీ అదే అసలైన లక్ష్యం అని నమ్మడానికి గల రెండు ముఖ్యమైన కారణాల్లో అతని మనస్తత్వం ఒకటి. ఇతను స్వభావ రీత్యా విలాస పురుషుడని తెలుస్తున్నది. అలాంటివాడు చెయ్యాల్సిన యుద్ధాలన్నీ ముగిసిపోయి హాయిగా కాలం గడపాల్సిన వయస్సులో కొత్త యుద్ధాలకి ఎందుకు బయల్దేరతాడు? అప్పటికే Central Asia మొత్తాన్ని పట్టుకున్న వాడు ప్రతి సంవత్సరం 2500 కిలోమీటర్ల దూరం పోనూ రానూ సైన్యంతో కలిసి ప్రయాణించడానికి ఉరకలెత్తడం ఎంత పిచ్చి పని!సా.శ 1025 ఏప్రిల్ నెలలో సోమనాధ్ గుడిని పట్టాక తిరిగి గజిని ముల్తాన్ చేరుకునేసరికి నీళ్ళకి అల్లాడిపోయి చాలా గుర్రాలు చచ్చిపోయాయనీ ఇంకా 30,000 గుర్రాలు ఉన్నాయనీ అల్బెరూనీ రాశాడు. ఎక్కడో దూరాన ఉన్న సంపద కోసం అప్పటికే సంపదలో పొర్లుతున్న వాడు తన సైన్యాన్ని ఆ స్థాయిలో కష్టపెట్టటం అసాధ్యం - సోమనాధ లింగాన్ని తీసుకెళ్ళి మక్కా గుడిలో ఇరికించటమే వాడి లక్ష్యం అనేది పచ్చి నిజం!

రెండవదీ గజిని మతపరమైన కారణాలతో రాలేదని వాదించేవాళ్ళ అన్ని వాదనల్నీ తుత్తునియలు చెయ్యగలిగిన అంశం దాడులలో పాటించిన వ్యూహమే! మొత్తం పదిహేడు సార్లూ వేసవి కాలం మొదలయ్యే రోజుల్లో ఇక్కడికి చేరుకునేవాడు, మళ్ళీ వర్షాలు మొదలయ్యే లోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు. ఎందుకంటే వర్షాకాలంలో పంజాబ్ లోని అన్ని నదులూ మంచి పోటు మీద ఉంటాయి. వాళ్ళని మోసుకుపోయే గుర్రాలు గానీ ఒంటెలు గానీ నేల మీద పరిగెడతాయి గానీ నీళ్ళలో ఈదలేవు - ఎరక్కపోయీ వచ్చాను అబ్బ ఇరుక్కుపోయాను అన్నట్టు తయారవుతుంది గజినీ పరిస్థితి, దిక్కు లేని కుక్క చావు చస్తాడు!

నా దృష్టిలో వీడు దాడికి ఎంచుకున్న సమయం మనవాళ్ళని ఇబ్బంది పెట్టింది. చాణక్యుడు సైన్య సంచాలనానికి వసంత కాలం అనువైనదని చెప్పాడు - వేసవి ఫెళ్ళున మాడ్చేస్తుంది, చలి పులిలా చంపేస్తుంది, వర్షం నేలని చిత్తడి చేసి ముంచేస్తుంది. అదే నిత్యం ఎర్రటి ఎడారి గాలుల్లో మాడేవాళ్ళకి ఇక్కడి ఎండ చల్లగా ఉంటుంది! అది వాడికి ఎడ్వాంటేజి అయ్యింది.

మొత్తం ఎంత సంపద పట్టుకెళ్ళాడో తెలియదు గానీ 30వ యేటినుంచి 60వ యేడు వచ్చేవరకు మనిషైనవాడు ఇంటిపట్టున కూర్చుని సుఖపడాల్సిన కాలం మొత్తం వీడు 2500 కిలోమీటర్ల దూరం సైన్యంతో సహా ఆసులో కండెలా తిరగటంలో గడిపేశాడు,  కేవలం డబ్బు కోసమే అయితే ఇంత టార్చర్ భరించలేక నాలుగైదు రౌండ్లకే ఆగిపోయి ఉండేవాడు. సోమనాధ లింగాన్ని తీసుకెళ్ళి మక్కా గోడలో ఇరికించడం కూడా తనకి పుట్టిన దురద అయ్యుండదు - ఖలీఫా హుకుం జారీ చేసి ఉంటాడు. సుల్తాన్ హోదా తెచ్చుకున్నప్పటికీ ఖలీఫా పట్ల వినయంగానే ఉండేవాడు - వీడి అమ్మా బాబు లిద్దరూ ఖలీఫాకు బానిసలు!

ఠంచనుగా ఇక్కడికి వేసవి మొదలయ్యేటప్పటికి చేరుకోవాలంటే ఇంత దూరప్రయాణం చాలా ముందునుంచే మొదలు పెట్టాలి! ఠంచనుగా వర్షాలు మొదలయ్యేటప్పటికి ఇక్కణ్ణుంచి బైటపడి అంత దూరం పోవడానికి చాలా సమయం పడుతుంది! ఇక్కడికి రావటం, ఇక్కడ యుద్ధం చెయ్యటం, ఇక్కడి నుంచి వెళ్ళటం అనే శ్రమనుంచి కాస్త విశ్రాంతి తీసుకోంగానే ఠంచనుగా ఇక్కడ వేసవి వచ్చేసరికి చేరుకోవడానికి ప్రయాణం మొదలు పెట్టాల్సి రావటం అనేది మనం అనుభవించటానికే కాదు పగవాడికి కూడా కోరుకోకూడని బతుకు - ఎన్ని సార్లు గుక్కపట్టి యేడ్చి ఉంటాడో పాపం గజినీ!

మొదటి 15 దండయాత్రల్లో Kabul, Delhi, Kanauj, Mathura, Kangra, Thaneshwar, Kashmir, Gwalior, Malwa, Bundelkhand, Tripuri, Bengal, Punjab లను పట్టుకున్నది 16వ సారికి దారిని శుభ్రం చేసుకోవటం కోసమే! ఒక్కోసారి ఒక్కో రాజ్యాన్ని ఎంచుకుని వాళ్ళ సైన్యానికి పదింతల సైన్యంతో మిడతల దండులా పోయి పడేవాడు. మన దేశపు గజినీ అభిమానులు గొప్ప వ్యూహకర్త కాబట్టే గెల్చాడంటారు గానీ ఇందులో అంత జబ్బలు చరుచుకోవాల్సిన వ్యూహం ఏముంది? యుద్ధం చేసే పద్ధతిలో ఒక స్పష్టమైన తేడా వుండేది. మనవాళ్ళు వెన్ను చూపినవాణ్ణి చంపగూడదనీ పదాతి దళం పదాతి దళంతోనూ గజబలం గజబలంతోనూ యుద్ధం చేయాలనీ సామాన్య పౌరుల్ని హింసించగూడదనీ కొన్ని నియమాలతో యుద్ధం చెయ్యటానికి అలవాటు పడినవాళ్ళు కావడంతో నీతినియమాలు లేని ఎడారి తండాల పైశాచికత్వానికి తట్టుకోలేకపోవటమే మనవాళ్ళ ఓటమికి అతి ముఖ్యమైన కారణం! భారతదేశంలోని గజినీ మహమ్మదు అభిమానులు బాకా వూదుతున్నట్టు అప్పటి హిందూరాజుల్లో ఐకమత్యం లేక వోడిపోయారనేది పచ్చి అబద్ధం! చాలా యుద్ధాలలో ఒకరికొకరు సహాయాలు చేసుకున్నారు.

1008 AD: Anandpal, Peshawar ఈసారి Khokhar జాతికి చెందిన వీరులు కూడా కలిశారు.వీళ్ళు ధనుర్విద్యలో ఆరితేరినవాళ్ళు - గజినీ వైపున ఉన్న 6,000 మంది ఆర్చర్ల దాడిని వీళ్ళు తిప్పి కొడుతూ వీళ్ళు 5000 మంది ముస్లిములని బలి తీసుకోగలిగారు!

దురదృష్టం!ఆనందపాలుడి ఏనుగు బెదిరి యుద్ధరంగం నుంచి పారిపోయింది - హిందూ సైనికులు గందరగోళానికి గురయ్యారు.అలా పారిపోతున్న 20,000 మందిని ముస్లిములు వెంటాడి చంపేశారు! మ్యాచ్ ఓడిపోయే పరిస్థితి ఎదురై టీము కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి ఇరగదీస్తాడనుకున్న సచిన్ టెండూల్కర్ డక్కౌట్ అయినట్టు జరిగిన ఆ దురదృష్టకరమైన సన్నివేశం సోమనాధ దేవాలయం చరిత్రనే మార్చేసింది.

1009: Nagarkot Kangra వీడి భీబత్సం చూసిన కోట లోని వాళ్ళు తలుపులు తెరిచేశారు. చాలా పెద్ద మొత్తంలోనే వెండి, బంగారం, సంపద తీసుకుపోయాడు - ఇంత సంపద వాళ్ళ జన్మకి చూడని మొహాలు గనక వేలం వెఱ్ఱి కింద తయారై చుట్టూ గుమిగూడి ఎగబడి చూసి పిచ్చెక్కిపోయారని వాళ్ళ రాతల్ని బట్టే తెలుస్తున్నది.

1018-19: Mathura and Kannauj 1018 జనవరిలో కన్నౌజ్ మీద దాడి చేస్తే రాజ్ పాల్ ప్రతీహార్ వీణ్ణి చూసి పరుగు లంకించుకున్నాడు!దోచుకోదగిన ఆలయాల్ని కూలగొట్టేసి దొరికినవాళ్ళని దొరికినట్టు చంపేశాక రాజ్ పాల్ ప్రతీహార్ తక్కుతూ తారుతూ వచ్చి గజినీకి సామంతుడిగా ఉండటానికి ఒప్పుకున్నాడు.దాంతో గజినీ బంగారు గుడ్లు పెట్టే బాతుని పట్టేసిన ఆనందంతో వెనక్కి వెళ్ళాడు.

1025: Somnath, 16th Invasion, అప్పటికే గజినీ లక్ష్యం సోమనాధ దేవాలయ విధ్వంసమేనని తెలియడంతో రాజపుత్రులు ఆలయాన్నే కోటలా మార్చి అక్కడినుంచే యుద్ధం చెయ్యటం మొదలుపెట్టారు.ముస్లిముల "అల్లా హో అక్బర్!" నినాదాలకు పోటీగా "హర హర మహాదేవ!" నినాదాలు చేస్తూ తీవ్రమైన ప్రతిఘటన ఇచ్చారు.కానీ, వాళ్ళు లోపల ఉండి బయట ఉన్న వీళ్ళతో యుద్ధం చెయ్యాల్సి రావడం కష్టమైపోయి మూడు రోజుల తర్వాత ఆగిపోయారు.
ఈ దాడి వల్ల గజినీకి దక్కింది 20 మిలియన్ దీనార్లు - మొదటి దాడిలో తీసుకుపోయిన దానికన్న 80 రెట్లు అని చెబుతున్నారు! ఇక సోమనాధ విగ్రహ విధ్వంసం విషయానికి వస్తే ప్రఖ్యాత పర్షియన్ జియాలజిస్టు Al Kazvini కధనం ఇట్లా ఉంది సోమనాథ్ భారతదేశం యొక్క ప్రసిద్ధ నగరం, ఇది సముద్ర తీరంలో ఉంది మరియు దాని అలల తరంగాలతో కడుగుతుంది. ఈ ప్రదేశం యొక్క అద్భుతాలలో సోమనాథ్ అనే విగ్రహాన్ని ఉంచిన ఆలయం ఉంది. ఈ విగ్రహం ఆలయం మధ్యలో క్రింద నుండి మద్దతు ఇవ్వడానికి లేదా పై నుండి సపోర్ట్ లేకుండా ఉంది. దీనిని హిందువులు ఎంతో గౌరవంగా భావించారు, మరియు అది గాలిలో తేలుతున్నట్లు ఎవరైతే చూస్తారో,వారు అద్బుతమైన ఆనందాన్ని పొందుతారు.

ఆధునిక అయస్కాంత శక్తి/క్షేత్ర పరిశోధకులు కూడా అసాధ్యం అని తేల్చిన ఈ అద్భుతాన్ని మనవాళ్ళు అంత ప్రాచీన కాలంలోనే సుసాధ్యం చెయ్యడం నిజమే! మొదట నేనూ నమ్మలేదు,నమ్మకం లేకనే అబద్ధాలు రాయాల్సి వస్తుందేమోనని భయపడి సాటి బ్లాగర్లని కూడా అడిగి చూశాను. ఒక్కోసారి నిజమే చెప్పాలి అనే పట్టుదలతో నిజానిజాలు తేల్చుకోవడానికి నేను పడుతున్న శ్రమ చూస్తుంటే నాకే ముచ్చటేస్తుంది – మొత్తానికి నా శ్రమ ఫలించి సొమనాధ లింగం గాలిలో తేలడం నిజమేనని నిరూపించే ఆధారాలు దొరికాయి!

Pargiter అనే ప్రముఖ చారిత్రక పరిశోధకుడు పూ.సా 950 నాటిదని నిర్ధారించిన మహాభారత కావ్యంలో ప్రభాస క్షేత్రం గురించి ఇక్కడ చంద్రుడు శివుణ్ణి పూజించిన ప్రస్తావన ఉంది.ఆలయం ఉన్నట్టు చెప్పలేదు గానీ యాత్రాస్థలం అని పేర్కొన్నది.సా.శ 11వ శతాబ్దికి చెందినట్టు చెప్పబడుతున్న శివపురాణంలో బ్రహ్మ, విష్ణువు సృష్టికార్యం నిర్వహించే అవకాశం/అధికారం కోసం కలహిస్తుంటే శివుడు త్రిత్వ రూపమైన సమస్త విశ్వాన్నీ కుదించి ఒక జ్వాలాస్తంభం చేసి నిలబెట్టిన కధ ఉన్నది.ఆద్యంతాలు లేని ఈ జ్వాలాస్తంభం ప్రసన్నమైన వామన రూపం దాల్చితే శివలింగం అవుతుంది.జ్యోతిర్లింగాల వెనక ఉన్న సాంకేతికపరమైన విషయం ఏమిటంటే అవి రోదసి నుంచి భూమిపైకి జారిపడిన ఉల్కలు - అవి జారిపడేటప్పుడు శివపురాణంలో చెప్పబడిన జ్వాలాస్తంభం వలెనే గోచరిస్తాయి కదా!

సా.శ 10వ శాతాబ్ది నాటిదని భావిస్తున్న పద్మపురాణం సోమనాధ లింగం గురించి కొంత విస్తరించి చెప్పింది. కోడిగుడ్డు పరిమాణంలో ఉండి సూర్యకాంతితో పోటీపడి వెలుగులు విరజిమ్ముతూ ఉండేదని వర్ణించింది. భూమి లోపల ఉన్నట్టు చెప్తూ స్పర్శలింగం అని వ్యవహరించింది. శివలింగం గాలిలో తేల్తున్నదని చెప్తున్నవారు పరిమాణం కొంచెం ఎక్కవ అని చెప్తున్నారు. ఇది ఎలా జరిగి ఉంటుందో వూహించడం కష్టమే,అయినా పరిమాణపు లెక్కలు దూరం నుంచి చూసి చెప్తున్నప్పుడు మనిషి మనిషికీ మారుతూ ఉండటం సహజమే కదా!

పూ.సా 900 నాటి తొలినాళ్ళలో భూమిలోపల ఉన్న సోమనాధ లింగం తర్వాత కాలంలో ఆనాటి భారతీయ విజ్ఞానుల మేధోశక్తి వల్ల సుదీర్ఘ కాలం పాటు గాలిలో తేలియాడుతూ నిలబడి దాని వెనక ఉన్న సాంకేతికత యేమిటో తెలిసినవారిని కూడా ముఖమంటపం దాటి లోపలకు అడుగుపెట్టగానే సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది!

సోమనాధ విధ్వంసం గురించి మరింత వివరమైన నివేదిక ఇచ్చిన ఆరబ్ చరిత్రకారుడు Abulfeda కూడా గజినీకి సోమనాధ లింగాన్ని పగాలగొట్టడం సాధ్యం కాక మంటలతో కాల్చి కరిగించాల్సి వచ్చిందని చెప్పాడు. Iron-Nickel meteorites చాలా గట్టి పిండాలు, అయస్కాంత శక్తిని కూడా కలిగి ఉంటాయి కానీ ఆ ఒక్క పాయింటు తెలిసినంత మాత్రాన దాన్ని అలా గాలిలో నిలబెట్టెయ్యడం అంత తేలిక కాదు - మెటలర్జీలో అపారమైన పరిజ్ఞానం ఉండాలి,తిమ్మిని బమ్మిని చేసే స్థాయిలో క్రియేటివిటీ ఉండాలి!

ఒక వస్తువును ఏ ఆధారమూ లేకుండా గాలిలో నిలబెట్టడానికి ప్రాచీనులు చేసినదీ ఆంధునికులు చేస్తున్నదీ ఒకటే - magnetic levitation mechanism అంటారు దాన్ని!అయస్కాంత ధర్మాలు అనగానే మనకి సజాతి ధృవాలు వికర్షించుకోవడం,విజాతి ధృవాలు ఆకర్షించుకోవడం మాత్రమే తెలుసు.ఈ కాస్త తెలియగానే ఉబ్బిపోయి "ఓహ్హో!అన్ని వైపుల నుంచీ సమానమైన బలంతో లింగాన్ని లాగే అయస్కాంతాల్ని పెట్టి శివలింగానికి విజాతి ధృవాల్ని లింగం వైపుకి తిప్పేసి ఉంటారు, వెరీ సింపులూ!" అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. అయితే, లెవిట్రాన్ ఆటబొమ్మలో లా గాలిలో ఉన్న వస్తువు తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది,అది అలా తిరుగుతూ ఉండటం తప్పనిసరి. మరి మనవాళ్ళు అలా గిర్రున తిరక్కుండానే నిలబెట్టారు కదా!

దీనికి కొన్ని మూలకాలకి ఉన్న diamagnetic propertyని వాడుకున్నారు. వీటి లక్షణం సజాతి, విజాతి అనే తేడా లేకుండా అయస్కాంత లక్షణం ఉన్న వస్తువుల్ని దూరం తోసేస్తూ ఉంటాయి. బిస్మత్ అనే diamagnetic elementని వాడి మనవాళ్ళు ఈ ట్రిక్ సాధించగలిగారు. Al-Kazvini చాలా స్పష్టంగా చెప్పాడు “The edifice was built upon fifty-six pillars of teak, covered with lead” అని. చూడటానికి రెండూ ఒక్కలాగే ఉంటాయి గనక అతను పొరపాటు పడ్డాడు. Crude lead can contain up to 10% of bismuth. Lead has been smelted and used by Indian metallurgists since times immemorial. The open cast lead mine at Rampura-Agucha in Bhilwara district in Rajasthan which are geographically near to Somnath, and remaining picture you can draw yourself in your mind!

ఎంత అద్భుతం! మనకేంటి,బద్దలు కొట్టడానికి వచ్చిన గజినీకి కూడా దిమ్మ దిరిగి మైండు బ్లాంకయ్యి ఉంటుంది!ఈర్ష్యతో మరింత కసిపుట్టి నాశనం చేసి ఉంటాడు. ఈ పధ్నాలుగు వందల యేళ్ళ నుంచి ఇస్లామిక్ సమాజం ఇతరులు కట్టినవాటిని కూల్చటం, ఇతరుల కష్టార్జితాన్ని దోచుకోవటం, ఇతరుల ప్రాణాల్ని హరించటం తప్ప ప్రపంచానికి శాంతినీ ఆనందాన్నీ వృద్ధినీ కలిగించే ఒక్క వస్తువును కనిపెట్టలేదు, ఒక్క పుస్తకాన్ని రాయలేదు, ఒక్క కళారూపాన్ని సృజించలేదు, ఒక్క కన్నీటి చుక్కని తుడవలేదు, ఒక్క మంచిపని చెయ్యలేదు - అయినా మాదే గొప్పమతం అనే విరగబాటు, ఎందుకో!
ఇన్నేళ్ళపాటు కాలు గాలిన పిల్లిలా అటూ ఇటూ తిరిగిన గజినీ సాధించింది శూన్యం - ఈ కోడిగుడ్డంత సోమనాధ లింగాన్ని తీసుకెళ్తే ఆ మక్కాలో ఆ కాబాలో ఆ మూలలో ఆ గోడలో ఇరికించటం కుదరదు గాబట్టి నాశనం చేసి కసి తీర్చుకోవటం ఒకటే సంతృప్తి, అల్లా గారి కూతుళ్ళు ఇక్కడ దొరకలేదు గాబట్టి నిరాశతో కూడిన దుఃఖం ఒకటే మిగిలింది, దూరాభారం వొచ్చినందుకు డబ్బు కూడా హుషారు పుట్టించే స్థాయిలో దొరకలేదు. ఏడుపొకటే తక్కువైన కసితో ఆడా మగా అని చూడకుండా దొరికిన వాళని దొరికినట్టు వూచకోత కోసేశాడు. మిగిలిన చోట్ల ఓడిపోయిన వాళ్ళు ధనం ఇస్తే తీసుకుని వెళ్ళినవాడు ఇక్కడ కూడా చాలినంత దొరికితే అట్లా ఎందుకు చేస్తాడు?

మిగిలిన ఆలయాల మీద జరిగిన దాడుల్లో చెయ్యని రెండు పిచ్చిపనుల్ని గజినీ సోమనాధ విధ్వంసం అప్పుడు చేశాడు. అందులో మొదటిది మహాదేవుడికి తమ కళల్ని సమర్పించిన 400 మంది నర్తకీమణుల్ని బానిసల కింద తీసుకుపోవటం. వీ ళ్ళు మామూలు డ్యాన్సర్లు కాదు ఆయుర్వేదం, నిగమ సంగీతం, వైదిక విద్యలు తెలిసిన అఖండ ప్రజ్ఞాధురీణులైన మహిళామణులు! అయితే, వీళ్ళని తన రాజ్యం వరకు తీసుకు వెళ్ళలేకపోయాడు - .మధ్యలో చీకటి మాటున వీరి స్నేహితుల సహాయంతో తప్పించుకున్నారు. అప్పటికి తప్పించుకున్న వాళ్ళు తర్వాత క్రైస్తవ క్రూసేడర్ల చేతుల్లో మంత్రగత్తెల పేరున చంపబడ్డారు! బానిసల మార్కెట్టులో అమ్ముకోవడానికి తప్ప గజినీకి వీళ్ళెవ్వరూ ఇంకెందుకూ ఉపయోగపడే చాన్సు లేదు - వాడు నపుంసకుడు కాదు గానీ స్వలింగసంపర్కుడు. According to Tarikh-e-Ferishta, Sultan Mahmud had an obsession with buying the most beautiful slave boys wherever he could find them. He needed a new boy everyday. గుర్రాలూ గాడిదలూ ఖాళీగా ఉంటే తప్ప మోసుకెళ్ళడానికి తగిన సంపదే అక్కడ దొరికితే వీళ్ళ నెందుకు తీసుకెళ్తాడు?

మరొక పిచ్చిపని, అంత పెద్ద సైన్యంతో వచ్చి కూడా లోపలి వాళ్ళు తీస్తే తప్ప తెరుచుకోని ధృఢమైన ముఖద్వారపు తలుపుల్ని పట్టుకుపోవడం: సుందరీమణుల్ని బానిసల మార్కెట్టు కోసం కొట్టుకుపోయాడంటే అర్ధం చేసుకోవచ్చు, వీటికేం విలువ ఉంది? మోతబరువు తప్పిస్తే వీటివల్ల దమ్మిడీ ఆదాయం రాదు - ఆఖరికి అవి వాడి సమాధికి ఉపయోగపడ్డాయి, వాటి ఖర్మ అట్లా కాలింది!

తనకి మౌనభంగం కలగగానే చెట్టెక్కేసిన భేతాళుణ్ణి తీసుకెళ్ళటానికి మళ్ళీ చెట్టెక్కిన పట్టు వదలని విక్రమార్కుడిలా గజినీ సా.శ 1024 అక్టోబర్ 17న తన రాజ్యం నుంచి బయల్దేరి సా.శ 1024 నవంబర్ 20 నాటికి ముల్తాన్ చేరుకుని అక్కణ్ణించి సా.శ 1025 జనవరి 16 నాటికి సోమనాధ ఆలయం చేరుకునేవరకు మనవాళ్ళు ఏమీ చెయ్యలేనంత అజ్ఞానంలో ఉన్నారంటే నమ్మడం కష్టమే! ఇక్కడ పెద్ద సామ్రాజ్యం ఉండి ఉంటేనో అందరూ కలిసి పోరాడితేనో గెలిచి ఉండేవాళ్ళనీ ఐకమత్యం లేకపోవడం వల్లనే మనవాళ్ళు ఓడిపోయారనీ అంటున్న చరిత్రకారులకి మహాశక్తివంతుడైన ఔరంగజేబుని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించిన శివాజీ ఎందుకు గుర్తుకు రావడం లేదు? ఈ కారణాలు అన్నీ గజినీని ఎక్కువ చేసి మనవాళ్ళని తక్కువ చెయ్యడం కోసం ఆంగ్లేయ, కమ్యునిష్ట్, ముస్లిం చరిత్రకారులు చెప్తున్న కుంటిసాకులు - వీటిని నమ్మాల్సిన పని లేదు. దాన్ని పగలగొట్టటమే వాడి జీవితలక్ష్యం అని అక్కడి చరిత్రకారులే సాక్ష్యం చెప్తున్నారు కదా, అంతటి స్థాయిలో ద్వేషం ఉన్నవాడు ఇక్కడ మహా సామ్రాజ్యాలు ఉన్నా ఆగడు. మక్కా లోని moon god temple కన్న గొప్పదైన మరొక moon god temple ఉండకూడదనుకున్నవాళ్ళు కూల్చకుండా ఉండలేరు.

ఆంగ్ల ప్రభువుల కాలంలో ఈ తలుపుల చుట్టూ చాలా పెద్ద క్యామెడీ నడిచింది. మనవాళ్ళు అడిగారో వాళ్ళకే పుట్టిందో సా.శ 1843లో House of Commonsలో వీటి గురించి ఒక ఉత్తుత్తి చర్చ పెట్టేసుకుని హడావిడి చేసి గజినీ ఎత్తుకెళ్ళిన తలుపుల్ని వెనక్కి తెచ్చి సోమనాధ ఆలయానికి సమర్పించాలని ఒక గంభీరమైన నిర్ణయం తీసుకున్నారు. అప్పటి British East India Company యజమాని స్వంత బాధ్యతతో వాటిని గజినీ సమాధి నంచి వూడబెరికి తీసుకొచ్చి దేవాలయం ముందు నిలబెట్టాడు. ఆలయ ప్రధాన పూజారి చూసీ చూడగానే అవి నకిలీవని గుర్తుపట్టి అక్కర్లేదని తిరక్కొట్టేశాడు! మధ్యలో జరిగిన దొంగాటకం ఏంటంటే వూడబెరికిన అసలు తలుపుల్ని చారిత్రక ప్రాధాన్యత గలిగిన ప్రాచీన వస్తువుల వేలంపాటకి తరలించి డూప్లికేటు తలుపుల్ని మన మొహాన కొడదామనుకున్నారు. గుడిని కూల్చి సంబరపడేవాడు ఒకడు, తలుపుల్ని అమ్ముకుని బాగుపడేవాడు ఒకడు - దొందూ దొందే!
1026: The 17th and Last Invasion ఈ దాడిలో ఏ ఆలయాన్నీ ధ్వంసం చెయ్యలేదు, ఏ రాజ్యాన్నీ కొల్లగొట్టలేదు. మరి, ఎందుకొచ్చాడంటే 16వ దాడిలో సోమనాధ దేవాలయం తలుపులూ గట్రా మోసుకుపోతుంటే జాట్లు వెనకనుంచి కొట్టి ఏడిపించారు.వాళ్ళ మీద పడి పగ తీర్చుకుని పోయాడు, అతి కిరాతంకం జాట్ లను వేలమందిని చంపాడు...

1030లో మలేరియా వచ్చి చచ్చిపోయేముందు అప్పటికి మిగిలున్న తన కష్టార్జితాన్ని తెచ్చి తన యెదర పెట్టి చూపించమని అడిగి చుట్టూ పేర్పించుకుని చూశాక తన ముప్పయ్యేళ్ళ గాడిద చాకిరీని వొదిలేసి పోతున్నందుకు కుళ్ళి కుళ్ళి యేడ్చాడంట!... కేవలం మత పిచ్చతో లింగాన్ని నాశనం చేయడం తప్ప వాళ్ళు సాదించింది ఏమీ లేదు ఉన్న ధనాన్ని మొదట చేసిన పదిహేను దాడుల్లోనే దొచుకెళ్ళాడు..ఇదీ పూర్తి సోమనాథ దేవాలయాన్ని   ఘజనీ మహమ్మదు ఏ రకంగా నాశనం చేశాడు అనే సత్యాలు.. ఇప్పటికైన హిందువులు చైతన్యం కావలసిన సమయం ఆసన్నమైంది మన శక్తిని, జ్ఞానాన్ని గుర్తెరిగి ముందుకెళ్ళాలని మనవి  మీ హరిబాబు సూరనేని.


ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments