జామి మసీదు(సా.శ 1140/1296) ప్రస్తుత గుజరాత్ రాష్ట్రంలోని Mehsana జిల్లాకు చెందిన Siddhpur నగరంలో ఉంది. క్రీస్తుశకం 1296 లో (స...
జామి మసీదు(సా.శ 1140/1296) ప్రస్తుత గుజరాత్ రాష్ట్రంలోని Mehsana జిల్లాకు చెందిన Siddhpur నగరంలో ఉంది. క్రీస్తుశకం 1296 లో (సంవత్ 1353) ఒక ఆలయ సముదాయాన్ని కూల్చివేసిన ఉలుగ్ ఖాన్ మరియు నుస్రత్ ఖాన్ ఆధ్వర్యంలో అలావుద్దీన్ ఖల్జీ సైన్యాన్ని పంపాడు. హిందూ ఆలయాన్ని ద్వసం చేశారు సగానికి పైబడి మరియు దాని పశ్చిమ భాగాన్ని 1414 లేదా 1415 లో ముజాఫరిడ్ రాజవంశానికి చెందిన అహ్మద్ షా I (1410–44) సమ్మేళన మసీదు (జామి మసీదు) గా మార్చారు.
అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న జామి మసీదు స్థానంలో ఉండవలసిన రుద్రమహాలయాన్ని సా.శ 12వ శతాబ్దంలో నిర్మించిన సిద్ధరాజ్ జైసింహ అనే రాజు పేరు మీద వచ్చింది. ఈ ఆలయం మొత్తాన్ని ఈయన కట్టలేదు, సా.శ 943లో అప్పటి సోలంకి మహారాజు మొదలుపెట్టిన రుద్ర మహాలయం సా.శ 1140లో సిద్ధరాజ్ జైసింహ చేత పూర్తి చెయ్యబడింది. మొదట సా.శ 1296లో అల్లావుద్దీన్ ఖిల్జీ కొంత కూల్చితే తర్వాత అహ్మద్ షా - I ఇంకొంత కూల్చి పడమటి దిక్కున ఇప్పుడున్న జామి మసీదును కట్టాడు.
గత కొన్నేళ్ళుగా ఆలయానికి సంబందించిన కొన్ని విషయాలు పరిశీలిద్దాం, సా.శ 1983 ఏప్రిల్ 19న Minorities Commission రాష్ట్రపతికి సమర్పించే 4వ వార్షిక నివేదికలో గుజరాత్ రాష్ట్రంలోని Mehsana జిల్లాలో ఉన్న Siddhpur నగరంలో ఉన్న Jami Masjid గురించిన ఒక వివాదాన్ని ప్రస్తావించింది. ఆ మొత్తం విషయం మధ్య యుగాల నాటి ముస్లిం పాలకుల చర్యల వల్ల ఆధునిక కాలంలో ఏర్పడుతున్న సమస్యల పట్ల కొన్ని సందేహాలను రేకెత్తిస్తున్నది.
దేశానికి ఆంగ్లేయుల నుంచి స్వతంత్రం వచ్చిన నాటినుంచే ఈ సమస్య రాజుకోవడం మొదలుపెట్టింది. అప్పటి బరోడా సంస్థానపు మహారాజు మసీదునీ ఆలయ శిధిలాల్నీ కలిపి చారిత్రక ప్రాధాన్యత కలిగిన కట్టడం కింద గుర్తించాలని డిమాండు చేశాడు. అది నెరవేరింది.సా.శ 1954 మార్చ్ 31న మసీదు ట్రస్టీలకీ ASI కీ మధ్యన కుదిరిన ఒప్పందం వల్ల మసీదు ASI అధీనంలోకి వచ్చింది.
ఆ ఒప్పందంలో ప్రార్ధనని ఆపటానికి వీల్లేదని ముస్లిములు పెట్టిన ఒక కండిషన్ ఉంది."అంతే నాకు చాలు, తమలపాకు తొడిమే పది వేలు!" అన్నట్టు ప్రార్ధనకి ఇబ్బంది కలిగించకుండా మసీదుని కదల్చకుండా మిగతా ప్రదేశం మీ ఇష్టం అనటంలోని ప్రమాదం ముస్లిములకి అప్పుడు తెలియలేదు!
మసీదుకి చిన్న చిన్న రిపేర్లు కూడా ఇప్పుడు వాళ్ళు సొంతంగా చేసుకోవటానికి వీల్లేదు, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఒక ప్రభుత్వ సంస్థ - వీళ్ళు చెయ్యమన్న ప్రతి పనీ వాళ్ళెందుకు చేస్తారు? ముస్లింలు దీనిమీద హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. అయితే, ASI వాళ్ళు రాజీకి రావటంతో ముస్లింలు కేసు ఉపసంహరించుకున్నారు. కానీ, ఈ రాజీ ప్రతిపాదనల్ని ఎలా ఇంప్లిమెంట్ చెయ్యాలి అన్న చర్చలు జరిగి అవి కార్యరూపం దాల్చే లోపునే కొత్త లిటిగేషన్ పుట్టుకొచ్చింది. మళ్ళీ ముస్లిములు హైకోర్టు గడప ఎక్కారు. మళ్ళీ ASI వాళ్ళు దీనికి కూడా రాజీ ప్రతిపాదన పంపించి పరిష్కారం కుదుర్చుకున్నారు.
ఇల్లు ఇరకటం ఆలి మరకటం అన్నట్టు అసలు సమస్య వేరే ఉంది. ముస్లిముల ఫిర్యాదు యేమిటంటే, Archaeological Survey of India రిపేర్లు చెయ్యటానికి బదులు ఎక్కడ బడితే అక్కడ తవ్వేస్తూ ఉంటే తవ్విన చోటల్లా రుద్రమహాలయం శిధిలాలు బయట పడుతున్నాయి ఇవి కాస్తా హిందువుల కళ్ళలో పడి వాళ్ళు వీటిని రక్షించడంతో పాటు ముస్లిముల్ని ప్రార్ధన చెయ్యనివ్వకూడదనీ అలా కాని పక్షంలో త్రవ్వకాల్లో బయటపడిన శివలింగానికి పూజలు చేసుకోవడానికి తమనీ అనుమతించాలని పట్టుపట్టటం మొదలుపెట్టారు!
మసీదు ట్రస్టీలు రాసిన అర్జీని పట్టుకుని సా.శ 1979 అక్టోబర్ 4 నుంచి Minorities Commission రంగంలోకి వచ్చింది. ట్రస్టీలు కమిషన్ సభ్యులకు చేసిన విన్నపం ప్రకారం సా.శ 1979 సెప్టెంబర్ 6న యోగేశ్వర్ దత్ అనే వ్యక్తి పెద్ద గుంపును వెంటబెట్టుకుని వచ్చి మసీదును అప్పగించమని గొడవ చేశాడు. అప్పటినుంచి అతను పదే పదే ఆ వొత్తిడిని కొనసాగిస్తూనే ఉన్నాడు. సహజంగానే కమిషన్ ఆర్కియలాజికల్ సర్వేని ఒక రిపోర్టు ఇమ్మని అడిగింది.ఈ రిపోర్టు వచ్చేలోపు ముస్లిం ఎమ్మెల్యే Begum Ayesha Sheikh ఇది ఆరెస్సెస్ శక్తుల పని అంటూ విమర్శలు మొదలుపెట్టి మైనారిటీ కమిషన్ ముందుకి వచ్చారు. హిందువుల వైపునుంచి చట్టవిరుద్ధమైన ప్రయత్నాలు మొదలు కావడంతో జటిలమైన సమస్య ముస్లిముల వైపునుంచి రాజకీయపరమైన ప్రతిఘటన మొదలు కావడంతో ఇక సామరస్యంగా పరిష్కారం కావడం అసంభవం అనిపించే పరిస్థితి నెలకొన్నది.
ASI ఎంత జాగ్రత్తగా వ్యవహరించి ఏ చిన్న పని చెయ్యడానికి పూనుకున్నా అనుకోకుండానే రుద్రమహాలయం అవశేషాలు బయటపడటం, ముస్లిములే పనులు ఆపెయ్యమని బతిమిలాడుకోవటం జరుగుతూ వస్తున్నది ముస్లిముల పరిస్థితి ముందుకెళ్తే నుయ్యి వెనక్కెళ్తే గొయ్యి అన్నట్టు తయారైంది.
క్రింద కొన్ని చిత్రాలు ఇవ్వడం జరిగింది వాటిని పరిశీలించండి వాస్తవాలు తెలుస్తాయి ఇవి సరిపోతాయి అనుకుంటాను..
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
No comments