ముస్లిములు సంవత్సరాని కొకసారి చేస్తున్న మక్కా యాత్రలోని ప్రతి అంశమూ పూర్వ ఇస్లామీయ మక్కేశ్వర నిలయ పూజారివర్గం నిర్దేశించిన వై...
ముస్లిములు సంవత్సరాని కొకసారి చేస్తున్న మక్కా యాత్రలోని ప్రతి అంశమూ పూర్వ ఇస్లామీయ మక్కేశ్వర నిలయ పూజారివర్గం నిర్దేశించిన వైదిక సంప్రదాయం కాదూ!
నిత్య కలహాలతో అతలాకుతలమౌతున్న పూర్వ ఇస్లామీయ అరేబియన్ తెగలను పూర్వ సామాన్య శకం 100వ సంవత్సరంలో ఉజ్జయిని పరిపాలకుడు విక్రమార్క మహారాజు జయించి సనాతన ధార్మిక సంస్కృతిని పరిచయం చేశాడు. వారిలో సఖ్యతను నిలబెట్టటానికి అతడు చేసిన ముఖ్యమైన ఏర్పాటు మక్కాలో కాబా గుడిని నిర్మించి వైదిక చాతుర్మాస్యపు నిబంధనని పోలిన పవిత్ర మాసపు నిబంధన పెట్టటం - ఆ పవిత్ర మాసంలో ఇతరులతో కలహాలు మానివెయ్యటమే కాక పాత కలహాలను మర్చిపోయి మక్కా లోని కాబా గుడి వద్ద జరిగే ఆరాధనోత్సవాల్లో పాలు పంచుకుంటూ ఉండేవాళ్ళు! దీనికి సంబంధించిన ప్రస్తావనలు ఖురానులోనూ వున్నాయి.ఆనాటి పూర్వ ఇస్లామీయ మక్కా యాత్ర లోని విగ్రహారాధన పద్ధతులనే ఇప్పటికీ పాటిస్తున్నారు విగ్రహారాధన మహాపాపం అని అంటున్న ముస్లిములు!
"Mohammad's grandfather and uncles were hereditary priests of the Kaaba Temple which housed 360 Vedic Idols!" అని Encyclopedia Islamia ఎప్పుడో ఒప్పుకున్నది. మొదట్లో ఆ మక్కాలో ఆ కాబాలో ఆ మూలలో ఆ గోడలో ఇరికించిన నల్లరాయి చుట్టూ ముస్లిములు చేస్తున్న అపసవ్య ప్రదక్షిణలను గురించి తెలుసుకున్నప్పుడు ఇతర మతాల నుంచి కాపీ కొట్టినవాటిని అసలు మతం వాళ్ళు గుర్తుపట్టి పోట్లాడి పరువు తియ్యకుండా ఉండటానికి లేబుల్స్ మార్చటమో రివర్సు చెయ్యటమో చేసిన అలవాటు చొప్పున చేశాడనుకున్నాను గానీ కాదు, అది శివుడికి సహజమైన చండీ ప్రదక్షిణయే!
ఆలయాలకి, గిరులకి, తరువులకు, ప్రదక్షిణంచేయడం సనాతన ధర్మంలో భాగమే! ప్రదక్షిణం అంటే మన కుడి భుజం ఆలయం వైపు లేదా గిరివైపుగా ఉండగా చుట్టూ తిరగడమే ప్రదక్షిణం, ఎడమవైపుగా ఉండడం అప్రదక్షిణం. అన్ని ఆలయాల్లోనూ ప్రదక్షిణం మూడు సార్లు చేస్తాం. శివాలయంలోనూ ప్రదక్షిణం మూడు సార్లే చేస్తాం. కాని అన్ని గుడులలోనూ చేసినట్టు కాదు. శివాలయాన్ని పరిశీలిస్తే, వెళ్ళగానే కనపడేది ద్వజస్థంభం. దీనికి సరళ రేఖలో నంది, నందికి సరళ రేఖలో శివలింగం కనపడతాయి.
శివ ప్రదక్షిణం చేయాలంటే ధ్వజస్థంభం ఈవలినుంచి కుడి వైపుగా అనగా అప్రదక్షిణంగా బయలుదేరి సోమ సూత్రం దాకా వెళ్ళి అక్కడనుంచి వెనక్కి వచ్చి ధ్వజస్థంభం ఈవలినుంచే కుడి వైపుగా సోమ సూత్రం దాకా వెళ్ళి వెనక్కి తిరిగి మళ్ళీ ధ్వజస్థంభం మీదుగా సోమ సూత్రాని జేరి వెనక్కి బయలుదేరిన చోటికి వచ్చి మూడుప్రదక్షిణలు పూర్తి చేయాలంటే అప్రదక్షిణంగా సోమ సూత్రం దగ్గరకు మూడు సార్లు, ప్రదక్షిణంగా రెండు సార్లు వెళ్ళి బయలుదేరిన చోటికి అనగా ధ్వజస్థంభం దగ్గరకు జేరితే మూడు ప్రదక్షిణలు పూర్తయినట్టు. ఏ ప్రదక్షిణం లోనూ సోమ సూత్రం దాటడం జరగదని గుర్తించాలి.
సోమ సూత్రమనగా, లింగానికి కింద ఉండేది పానవట్టం. అభిషేకం చేసిన ద్రవ్యాలు బయటికి వచ్చేమార్గమే సోమ సూత్రం. శివాలయాలు తూర్పు ముఖంగానూ, పశ్చిమ ముఖంగానూ ఉంటాయి. ఏముఖంగా ఉన్నా సోమ సూత్రం మాత్రం ఉత్తరం వైపే ఉంటుందని గుర్తించాలి. ఆ తరవాత నంది పృష్టాన్ని తడిమి కొమ్ముల మధ్యగా శివుని దర్శించాలి. ఏ సమయంలోనూ ధ్వజస్థంభం,నంది మధ్యగాని,నందికి శివునికి మధ్యగాని దాటకూడదంటారు.
మక్కాలో అభిషేకాదులు చెయ్యకపోవటం చేత సోమసూత్రం లేదు కాబట్టి వెనక్కి తిరగడం లేదు. మిగిలిన పద్ధతి మొత్తం వైదిక విధి నిర్ణయించిన శివుడికి సంబంధించిన మూర్త్యారాధన లోని ప్రదక్షిణ విధానమే కదా! శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన సమయం అని భావించే ప్రదోష కాలం చాంద్రమానంలో రెండు నెలలకొకసారి వస్తుంది, పక్షంలోని 13వ రోజు సాయంసంధ్యని ప్రదోషవేళ అంటారు.మక్కాలోని కాబాను తెరిచే సమయం కూడా ప్రదోషవేళ, సాయంకాలం 04:30కి 05:30కి మధ్యనే!
శివాలయంలో అభిషేకాదుల అనంతరం పట్టువస్త్రంతో తుడిచినట్టు మక్కాలో కూడా Hajar-E-Aswad ని పట్టు రుమాలుతో తుడుస్తారు. వైదిక గ్రంధాలు ఆలయానికి వెళ్ళేటప్పుడు ధరించాల్సిన దుస్తులకి సంబంధించిన నిబంధననే ముస్లిములు కాబా యాత్రలో పాటిస్తున్నారు. ఈశ్వరార్చన చేసేటప్పుడు సూదితో కుట్టని పట్టు వస్త్రాన్ని మాత్రమే ధరించాలని చెప్పిన ప్రకారమే ఆలయ పూజార్లూ ధర్మకర్తలూ ధోవతి, ఉత్తరీయం ధరించి కనబడుతున్నారు. మక్కా యాత్రలో కూడా ఇది తప్పనిసరి నిబంధన కావడం అనుకోకుండా జరిగినది కాదు - పూర్వ ఇస్లామీయ విగ్రహారాధకుల మక్కా యాత్రనే మూర్త్యారాధన వ్యతిరేకులైన ముస్లిములు కొనసాగిస్తున్నారు!విగ్రహారాధన మహాపాపం అని నొక్కి వక్కాణించిన ప్రవక్త మహమ్మదు గారు విగ్రహారాధనతో కూడిన మక్కా యాత్రని ఎందుకు పెట్టాడో నాకు తెలుసు గానీ నేను చెప్పను - ముస్లిములు చెబితే వినాలని ఆశ. క్రైస్తవంలోని త్రిత్వం గురించీ హిందువుల వేదాల్లోని సుర గురించీ కూడా చెప్పగలిగిన. A.Abhilash/K.S.Chaudari/Ahmed Chaudari త్రయం ఏమి చెబుతారో వినాలని ఉంది.వారికి తెలియకపోతే వారికన్న మహ్హాపండితుడైన జకీర్ నాయక్ ఉన్నారు కదా!
"సుమారు 15 ఏళ్ల క్రితం దివ్యఖురాను తెలుగులో వచ్చిన కొత్తలో చదివాను, ఇప్పటికీ ఆ గ్రంధం నాదగ్గర పుస్తకాల్లో భద్రంగానే ఉంది. జన్మలో మోక్షం పొందాలంటే జీవితంలో ఒకసారైనా మక్కా వెళ్లి సాంప్రదాయికంగా తల వెంట్రుకలు, గడ్డలు, మీసాలు తీసుకుని తెల్లని లుంగీ కట్టుకుని, తెల్లని ఉత్తరీయం పైన కప్పుకుని అక్కడి నల్లరాతి గృహమైన కాబా చుట్టూ ఏడు ప్రదక్షిణాలు చేయాల్సిందే కదా? మహమ్మద్ ప్రవక్త కాబాలో విగ్రహాలు తొలగించేవరకూ అక్కడ విగ్రహారాదన జరిగిన మాట వాస్తవం కాదా? దేవుడు అంతటా ఉన్నపుడు మక్కా వెళ్లి అక్కడి కాబా గడపను తాకి ప్రదక్షిణాలు చేసి ప్రార్థన చేస్తేనే కాని ఎందుకు మోక్షం లభించటంలేదు? ఎక్కడా లేని మహిమ అక్కడ ఉన్నదనే విశ్వాసంతోనే కదా అందరూ వెళుతుంది. గుడిలోని విగ్రహారాదన కూడా అలాంటి విశ్వాసమే. ఎవరి విశ్వాసం వారిది." అని మఠం మల్లిఖార్జున స్వామి గారు వారి బ్లాగు లోనే చెప్పారు కదా, తెల్లటి దుస్తులు ధరించటం, తలనీలాలు ఇవ్వటం, ప్రదక్షిణ చెయ్యటం, అక్కడి బావితీర్థం వెంట తీసుకురావటం అన్నవి ధార్మిక గ్రంధమైన దివ్య ఖురాను (సురాహ్ ఆల్ బఖరహ్, భాగం-2, పేజీ-31) గ్రంధమునుండే చెప్పటం జరిగింది. ఆన్ లైన్ లోగల దివ్య ఖురాన్ లో ఈ విషయాలు చూడవచ్చు, బహుళ ప్రాచుర్యం పొందిన Lapidus రచించిన ఇస్లామిక్ చరిత్రలో ఈ అన్ని విషయాలు చర్చించబడినవి.
ముస్లిములు నమాజు చేసే భంగిమ హిందువుల సాష్టాంగ ప్రణామం యొక్క మరో రూపమే - స్త్రీలకూ వృద్ధులకూ రోగులకూ ప్రత్యామ్నాయం అని సనాతనధర్మం చూపించిన దానినే వారి ప్రవక్త ముస్లిములకి సార్వజనీనం చేశాడు,అంతే! సనాతనధర్మం దైవప్రార్ధన ముందు "శరీర శుధ్యర్ధం పంచాంగ న్యాసం!" అని చెప్పి ముఖం,అరిచేతులు,మోచేతులు,పాదాలను నీటితో కడుక్కోమని సూచించిన దానిని ముస్లిములు తు.చ తప్పకుండా పాటిస్తూనే ఉన్నారు.ఇస్లామిక్ సంప్రదాయంలో సంవత్సరానికి నాలుగు నెలలు అత్యంత విశిష్టమైనవి.ఆ కాలంలో వారు ఎలాంటి యుద్ధాలు.దోపిడీలు,హత్యలు చెయ్యరు.ఇది అనాది కాలం నుండి హిందువులు పాటిస్తున్న చాతుర్మాస్య వ్రతం నుంచి తీసుకున్నదే!Shab-E-Barat అనే పదం కూడా Shiva Vrat అనే పదం యొక్క అపభ్రంశ రూపమే.పితరులను స్మరించడానికి హిందువులు ఆచరిస్తున్న పితృపక్షం అనే 15 రోజుల సమయాన్ని ఇస్లామిక్ సంప్రదాయం Eid-ul-Fitr పేరున వ్యవహరిస్తున్నది.పేర్లు వేరైనప్పటికీ తీరు ఒక్కటే.
ఇవన్నీ వైదిక సాహిత్యం,ఇస్లామిక్ సాహిత్యం క్షుణ్ణంగా తెలిసిన ప్రతి ఒక్కరికీ తెలిసే ప్రాధమిక సత్యాలు.మరీ మూలలకి పోయి శోధించాల్సిన పని లేకుండా రేఖామాత్రం తరచి చూసినవాళ్ళకి కూడా తెలిసే సత్యాలను దాచిపెట్టి కొందరు ముస్లిం మత ప్రచారకులు కేవలం హిందువుల్ని విగ్రహారాధన పాపం అనే పేరుతో భయపెట్టి తమ మతంలోకి లాక్కోవటానికి ప్రయత్నిస్తూ వారి ప్రయత్నాలని వ్యతిరేకించే హిందువులకి మతతత్వవాదులని ముద్ర వేసి అల్లరి పెడుతున్నారు.
సోషల్ మీడియా అనేది కొన్ని నెగటివ్ అంశాల్ని కలిగి ఉన్నప్పటికీ ఇస్లాం మతం యొక్క నిజమైన చరిత్ర, ఇస్లామిక్ మతోన్మాదం, న్యూ వరల్డ్ ఆర్డర్ పేరుతో ఇల్యూమినాట్టి వంటి రహస్య క్రైస్తవ సంఘాల గురించీ క్షణాల్లో తెలుసుకోగలుగుతున్నకాలంలో ఈ వెసులుబాటు లేని కాలంలో పనిచేసిన పాత చింతకాయ పచ్చడి రాతల వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదని గ్రహించలేకపోతున్నారు, పాపం!
ఈ పోలికలు ఏవీ కాకతాళీయం కాదని గ్రహిస్తే కేవలం పధ్నాలుగు వందల యేళ్ళ క్రితం పుట్టిన ఇస్లాం నుంచి ఆంతకు నుందునుంచే ఉన్న హిందూమతం స్వీకరించటం అనేది అసంభవం గనక ఇస్లాం ధర్మమే హిందూమతం నుంచి వీటిని స్వీకరించిందనేది స్పష్టం. భారతదేశంలో పుట్టిన బౌద్ధమతం, శైవ మతం, రామానుజ మతం, మధ్వ మతం వంటి వైదిక సాహిత్యం నుంచి కొన్ని భావాల్ని తీసుకున్న శాఖలు ఏనాడూ తమకి మూలమైన సనాతన ధర్మం పట్ల శత్రుభావం చూపించ లేదు, ఇదే సనాతన ధర్మం నుంచి భారత దేశానికి బైట పుట్టిన యూదుమతం ఏనాడూ శత్రుభావం చూపించనప్పుడు మరి, ఆ మతం నుంచి పుట్టిన క్రైస్తవ, ముస్లిం మతస్థులు ఎందుకు శత్రుభావం చూపిస్తున్నారు?
నాకు తోచినంతవరకు ఇలాంటి ప్రయత్నాల వెనక తమ మతం యొక్క గొప్పదనాన్ని చెప్పుకోవాలన్న ఆధ్యాత్మికమైన కారణాలు ఉండవు. తమ మతం గురించి చెప్పుకోవడానికి ఇతర మతగ్రంధాల లోటుపాట్ల చర్చలు అనవసరం కదా! ఇతర మతాల నుంచి కూడా వీరు చెప్పే అబద్ధాల్ని నమ్మి వచ్చే అమాయకుల్ని వీలయినంత ఎక్కువ మందిని లాక్కుని విధేయులైన భక్తుల/అనుచరుల/బానిసల సంఖ్యని పెంచుకుని ఈ విధేయుల మీద తమకున్న అధికారం నుంచి స్వలాభం పొందాలన్న ఆకాంక్షయే వీరిచేత తమకు అబద్ధాలని తెలిసిన వాటినే అంత ధీమాగా అక్షరసత్యాల కింద ప్రకటించటానికి వారిని ప్రేరేపిస్తుంది. సుర అంటే కల్లు అని వైదిక మంత్రాలకి తప్పుడు అర్ధం చెప్పటం తెలియక చేసిన పొరపాటు కాదు, తెలిసి చేసిన దుర్మార్గమే - హిందువులలోని బక్రాల కోసం గత 1000 యేళ్ళ క్రితం నుంచి జరుగుతున్న దాడికి కొనసాగింపు తప్ప మరొకటి కాదు. ఇలాంటి చవకబారు పనులతో తాము హిందువులలో కలిగిస్తున్న సంచలనాన్ని చూపించి కొన్ని సంస్థల నుంచి ముందస్తు నిధులు సమకూర్చుకోవడం కూడా వీరికి ఆదాయమార్గమే. ఈ లాభమే వారికి తాము చెప్పేవి అబద్ధాలని తెలిసి కూడా వాటిని పదే పదే చెప్పటానికి ఆంత మొండితనం చూపించేలా వారిని ప్రోత్సహిస్తున్నది. ఇదే ఆర్ధికసూత్రం అతి హిందూత్వ వాదులకి కూడా వర్తిస్తుంది!
ఇలాంటివి ఇతర దేశాల్లో పనిచేశాయి గానీ భారతదేశంలో పనిచెయ్యవు. అందుకు వెయ్యేళ్ళ నుంచి ఒక సమూహం వందేళ్ళ నుంచి ఒక సమూహం నిరంతరం ఇదే లక్ష్యంతో పని చేస్తున్నప్పటికీ ఒకరు 15 శాతం మించి ఒకరు 5 శాతం మించి లేకపోవటమే దీనికి బలమైన సాక్ష్యం. ఇది పెరిగి వారు ముందుముందు బలపడతారనే ఆశలు కూడా పెట్టుకోనక్కర లేదు. ఇప్పటికీ 80-70 శాతం ఉన్న హిందువులు క్రమేణ సంఘటితం అవుతున్నారనేది గమనిస్తే ముందుముందు ఈపాటి స్వేచ్చ కూడా ఉండదనేది నేను అటువంటివాళ్ళకి చెబుతున్న ఆఖరి హితోక్తి!
హిందువులకి విగ్రహ్హారాధన మహ్హాపాపం అని నీతులు చెబుతున్న ఇస్లామిక్ మత ప్రచారకులు మొదట మక్కాయాత్రని మహ్హాపాపం అని ప్రకటించి సాటి ముస్లిములు మక్కా యాత్రకు వెళ్ళడాన్ని నిరోధించాలనీ లేని పక్షంలో హిందువులే మక్కా లోని కాబా గుడిని స్వాధీనం చేసుకుని ముస్లిములని విగ్రహ్హారాధన అనే మహ్హాపాపం నుంచి రక్షిస్తారనీ వ్యాసపరాశరాది షిర్డిసాయినాధపర్యంతం ఉన్న సత్యధర్మన్యాయప్రతిష్ఠితమైన నా గురుపరంపర పాదాల మీద ప్రమాణం చేసి నేను చెప్తున్న ప్రతిజ్ఞాపూర్వకమైన చారిత్రక సత్యం! ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది! సత్యం శివం సుందరం!!!
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
super
ReplyDeleteSuper
ReplyDeleteFake, God is formless, God has no wife, no children. More over Shiva is not a God. If it's .who is Vishnu?? There is only One God that is Allah. Shiva linga was ones worshiped but later it was smashed.
ReplyDeleteWho is allah
DeleteAllah means arah means harah
DeleteHarah modified to Allah.
Here ra changed into LA gradually
Super information ... Thanks to the team
ReplyDeleteUseful information
ReplyDeleteMay allah guide us
ReplyDeleteMean while king vikram aditya from 102 BC, and prophet abraham and ismael from 1800BC
ReplyDelete