Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

భారత దేశం లో 130 కోట్ల మంది హిందువులా? ఎలా? What it means to be a Hindu in Telugu?

130 కోట్ల మంది హిందువులే! జాతీయత అంటే?      ప్రతీ దేశానికి ఒక గుర్తింపు ఉంటుంది. అది ఆ దేశంలోని ప్రజల సంస్కృతి, జీవన విధ...

130 కోట్ల మంది హిందువులే!
జాతీయత అంటే?
     ప్రతీ దేశానికి ఒక గుర్తింపు ఉంటుంది. అది ఆ దేశంలోని ప్రజల సంస్కృతి, జీవన విధానం మీద ఆధారపడి ఉంటుంది. దేశం, ప్రజా సమూహం, సాంస్కృతికధార- వీటిని కలిగి ఉండేది జాతి(రాష్ట్రం). ఆ రాష్ట్రములోని రాష్ట్రీయ జీవన విధానమే (రాష్ట్రీయత) జాతీయత. ఆలా భారత దేశంలో విలసిల్లిన జీవన విధానాన్ని హిందుత్వం/భారతీయత అని పిలుస్తారు.

జాతీయులు అంటే?
      ఆరాధన పద్ధతి ఏదైనా సరే- తాము నివసిస్తున్న దేశాన్ని మాతృభూమిగా, ఆ భూభాగంలోని సంస్కృతిని తమదిగా, అక్కడి వారసత్వ సంపదని తమదిగా, అక్కడి చరిత్రలోని మహాపురుషులని తమవారుగా ఎవరు భావిస్తారో వారు జాతీయులు. వారే హిందువులు/భారతీయులు. కాబట్టి ఆరాధనా పద్ధతి వేరుగా ఉన్నా, ఈ దేశంలోని ముస్లింలు, క్రైస్తవులు జాతీయతా దృష్టితో హిందువులే.

హిందూ అంటే?
     హిందూ అంటే ఇస్లాం, క్రైస్తవం లాంటి మత విశ్వాసమని అర్ధం కాదు. హిందూ అనేది జాతీయ జీవన విధానాన్ని సూచిస్తుంది. హిందూ పదం దేశవాచకం, కానీ మత,వర్గ వాచకం కాదు. హిందూ శబ్దాన్ని విస్తృత,విశాల జాతీయ భావ అర్ధంలో వాడబడుతుంది. ఎంతో ప్రాచీన కాలం నుండి 'హిందూ"పదం జాతీయ బోధకంగానే ఉపయోగంలో ఉంది. మన దేశం బయటి వారికి మన జాతీయత పట్ల భ్రమలు లేవు. వారికి పూర్తి స్పష్టత ఉంది అని కింది చారిత్రక సంఘటనలు ఋజువు పరుస్తున్నాయి.

విదేశీయుల దృష్టిలో
-ఇరాన్ లో 2500 సం,, ల క్రితం నాటి శిలాశాసనంలో మన దేశాన్ని"హిందూ" దేశంగా సంబోధించారు.
-1868 లో లక్నోలో పార్శీ భాషలో' మసునబి మారాను' అనే పుస్తకం ప్రచురించబడింది. అందులో ఒక కావ్యభాగంలో" చార్ హిందు దరికీ సుజాద్ కంద్, బహితే తహ తారేకా ఓ సాజిద్ సుగంద్"( నల్గురు హిందువులు నమాజ్ చేయడానికి కాబా లోపలికి వెళ్తున్నారు)అని ఉంది. వాస్తవానికి హిందువులు నమాజ్ చేయటానికి ఎందుకు వెళ్తారు? విషయం ఏమిటంటే వారు భారత్ కి చెందిన ముస్లింలు.
-80 వ దశకంలో అబ్దుల్లా బుఖారీ మక్కాకి వెళ్ళినపుడు మీరు హిందువా? అని అడిగారు. కాదు నేను ముస్లింని అంటే-అక్కడి మౌల్వీ" ఇక్కడికి అందరు ముస్లింలే వస్తారు. మీరు హిందూస్థాన్ నుండి వచ్చారు కనుక మీరు హిందువులు"అని చెప్పారు.
-డా,, సుబ్రహ్మణ్య స్వామి చైనా పర్యటనలో మీ మతం ఏమిటి అని అడిగితే, ఆయన హిందూ అని చెప్పారు. కాదు అది మీ జాతి, మీ మతం వేరే ఉంటుంది అని అక్కడివాళ్ళు అన్నారు.

ఆంగ్లేయుల రాక కంటే ముందు
       ఆంగ్లేయుల రాక కంటే ముందు కూడా ఇక్కడ ఉన్నవారందరిలో హిందూ జాతీయత పట్ల స్పష్టత ఉంది.
-1884 లో ఆలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ సంస్థాపకుడు సర్ సయ్యద్ అహ్మద్ కు లాహోర్లో జరిగిన పౌరసన్మానం లో ఆయనని ముస్లిం నాయకుడు అని వక్తలు అంటే- ఆయన తన ఉపన్యాసంలో "నేను హిందూదేశ వాసినని, అందువల్ల హిందువునని, సమస్త హిందూనాయకుడిననీ, చిన్న వర్గానికి నాయకుడిని కాదు"అని అన్నారు.
-మాజీ కేంద్ర విద్యామంత్రి మహ్మద్ కరీం చాగ్లా-"మతరీత్యా ముస్లిం ని, సాంస్కృతికంగా హిందువునని, ఈ దేశంలో నివసించే ముస్లింలందరు హిందువులే" అని అన్నాడు.
-మహ్మద్ ఫజల్( గవర్నర్)- క్షిప్ర నదిలో కుంభ స్నానానికి వస్తే మీరు ముస్లింలు కదా అని పత్రికల వాళ్ళు అడిగితే- " 500 సం,,ల క్రితం మా పూర్వీకులు హిందువులే-కాబట్టి నేను హిందువునే" అని చెప్పారు.

ప్రస్తుత సందర్భంలో
- గోవా ఉపముఖ్యమంత్రి ఫ్రాంసిస్ డి సౌజా ప్రకటన- " నేను మొదట హిందువుని,తర్వాతనే మత రీత్యా క్రైస్తవుడను".
-కేంద్ర మాజీ మంత్రి నజ్మా హెప్తుల్లా "హిందుత్వం ఈ దేశ అస్తిత్వం, భారత జాతీయత హిందుత్వం, మత రీత్యా నేను ముస్లింని"
-పాకిస్థాన్ రచయిత, మేధావి తారిఖ్ పతేహ్- "హిందుత్వం విశ్వమానవ సోదరధర్మం"
     స్వాతంత్ర్యం తర్వాత రాజ్యాంగ నిర్మాతలు హిందుత్వాన్ని జాతీయత గానే స్వీకరించారు. మన దేశానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలలో "హిందూ జీవన విధానం" కన్పిస్తుంది. 

సాంస్కృతిక ఏకత్వం
      హిందూసంస్కృతివిశేషతలు అన్ని మతాలలో కనిపిస్తాయి. జీవన విధానంలో ఏకత్వం  ఉంది. దాదాపు అన్ని మతాలు ఇక్కడి సాంస్కృతిక జీవధార లో కలిసిపోయాయి. కొన్ని మతాలు తమ మత ఉనికి ప్రత్యేకంగా ఉండాల్సిన అవసరం లేనంతగా ఇక్కడ మిళితం అయిపోయాయి.
౧. భారత దేశంలోని అన్ని మతాలలోని స్త్రీలు గాజులు, మెట్టెలు, చెవికమ్మలు, ముక్కెరలు ధరించడం మన సాంస్కృతిక ఏకత్వం అని చెప్పవచ్చును.
౨ హిందూస్త్రీలు విశేషంగా పెట్టుకునే గోరింటాకు/మైదాకు హిందూసంస్కృతి లోని భాగం అయినప్పటికీ ముస్లింస్త్రీలు మెహందీ పేరుతో శుభకార్యక్రమాలలో ధరించటం సాంస్కృతిక ఏకత్వం.
౩. నిర్మాణ శైలులు వేరయిన, నిర్మాణంలో వాస్తు ఆధారంగా అనేక ప్రాచీన కట్టడాల నిర్మాణం జరిగింది.
౪. ఇస్లాంలో సంగీతానికి స్థానం లేదు. అయినా మన దేశంలో ముస్లింలు సంగీతానికి ప్రాధాన్యం ఇస్తారు. సంగీత/నాట్య కళల రీతులు వేరైనా మూలం హిందుధార్మిక పరంపరనే.
    పై విషయాల్ని బట్టి ఆరాధన పద్ధతులు వేరయినా దేశంలోని అందరు హిందువులే అని నిర్ధారించవచ్చును.

హిందుత్వమే ప్రపంచానికి శరణ్యం     
            కుహనా ఓటు బాంక్ రాజకీయ విధానాల వల్ల "హిందుత్వం" పైన అనేక భ్రమలు నెలకొన్నాయి. హిందూమత రాజ్యంగా నిర్మాణం చేసే దిశలో కుట్రలు జరుగుతున్నాయనే వాదన అర్ధరహితం. ఎందుకంటే ఇదివరకే "హిందూరాష్ట్ర"గా మన దేశం కొనసాగుతుంది. ఇది రాజకీయ కోణంలో చూడకుండా, సాంస్కృతిక భావ ఐక్యత కి చిహ్నంగా గుర్తించాలి. హిందూ జాతీయత ఉంటేనే దేశ సమగ్రత సాధ్యం. హిందువుల వల్లనే ఈ దేశంలో అందరు సుఖంగా జీవిస్తున్నారని చెప్పటంలో అతిశయోక్తి ఏమి లేదు. హిందుజీవన విధానం విశ్వకళ్యాణ కారకం. హిందుజీవన విలువలే ప్రపంచ శాంతికి మార్గదర్శకం.  - సాకి, కరీంనగర్

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments