Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

నమస్తే సదా వత్సలే మాతృభూమే - Namaste Sadaa Vatsale maatrubhuume - MegaMinds

హిందూ దేశ వాసులారా! ఇలా ప్రార్థిద్దాం! హిందూదేశం ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన చరిత్ర కలది. హిందూ దేశమన్నా, హిందూస్థానమన్నా, ...

హిందూ దేశ వాసులారా! ఇలా ప్రార్థిద్దాం!
హిందూదేశం ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన చరిత్ర కలది. హిందూ దేశమన్నా, హిందూస్థానమన్నా, భారత దేశమన్నా, భారత వర్షమన్నా, భారత ఖండమన్నా, అజనాభమన్నా, జంబూ ద్వీపమన్నా ఒక్కటే. ప్రపంచంలో వివిధ దేశాలు ఏర్పడకముందే విశిష్ట సంస్కృతి, నాగరికత ఇక్కడ విలసిల్లింది. ఈ హిందుభూమే ప్రపంచానికి విజ్ఞానం అందించిన విశ్వగురువు. విలువలు నేర్పిన వాత్సల్యపూర్ణ మన హిందూదేశం. మన జీవనానికి ఆధారభూతంగా ఉన్న ఈ నేలని తల్లిగా కొలవడం మన సంస్కృతి గొప్పతనం. ప్రపంచంలో ఏ దేశంలోని ప్రజలు కూడా తాము నివసిస్తున్న భూమిని తల్లిగా భావించరు. మన దేశంలో మాత్రమే ఈ మట్టిని మాతృభూమిగా ఆరాధిస్తాం.     
              
జన్మించిన భూమిని తల్లిగా ఆరాధించటం ఈనాటి ఆలోచన కాదు. తొలి విజ్ఞాన గ్రంథం అయిన ఋగ్వేదం లోని పృథ్వీ సూక్తం మాతా భూమి పుత్రోహం పృథివ్యాః అని ఘోషించింది. ఈ పుడమి నా తల్లి, నేనామె పుత్రుడను అని దీని అర్ధం. మర్యాద పురుషోత్తముడు శ్రీ రాముడు ఆదర్శ మానవుడు. తాను అందించిన ఉదాత్త భావన- జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటే జన్మనిచ్చిన తల్లి, జన్మభూమి రెండు స్వర్గం కంటే గొప్పవి అని అర్ధం. జన్మనిచ్చిన తల్లి నవమాసాలు మోస్తుంది, జన్మభూమి మనల్ని జీవితాంతం మోస్తుంది. మన జీవితాలకి ఆధారం అవుతుంది. చనిపోయిన తర్వాత ఖననం అయినా, దహనం అయినా తనలోనే కలుపుకుంటుంది మన మాతృభూమి. అందుకే మన జీవనానికి నెలవైన, మన వికాసానికి కొలువైన మాతృభూమి ఆరాధన ఈ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరి కర్తవ్యం. పుట్టిన నేలతల్లిని కొలవని వాడు బ్రతికున్నా మరణించిన వానితో సమానం అని అంటుంటారు. 
       
వేదం అనుసరించి మనం అందరం కలిసి నడుద్దాం,కలిసి మాట్లాడుకుందాం, మన మనసులు ఒకటిగా చేసుకుందాం. మన పూర్వులు ఈ విధంగానే తమ కర్తవ్యాలను నెరవేర్చి దేవతలుగా కీర్తి పొందారు అనే మంత్రం నేడు మన జాతికి కావాలి. మన పూర్వీకులు సత్సంగం వల్లనే సమోన్నతిని సాధించారు. స్వామి వివేకానంద చెప్పిన సకల దేవతలని పక్కన పెట్టి భారత మాతని ఆరాధిద్దాం  మాటల్ని గుర్తు చేేసుకుంటూ మన సంఘటితశక్తిని జాగృతం చేసుకుందాం. వివేకుని శిష్యరాలైన సోదరి నివేదిత చెప్పినట్లు ఈ దేశంలోని హిందువులు ఐదు నిముషాలు కలిసి ప్రార్థిస్తే చాలు! అన్ని సమస్యలు దూరమవుతాయి అని నిరూపించే సమయం ఆసన్నమైంది.

పవిత్ర భారత మాత పుణ్యగర్భాన జన్మించిన భారతీ సంతానమైన మనం అందరం సోదరులం. కుల, మత, వర్గ, వర్ణ, ప్రాంత, భాష, పార్టీ లు పక్కనపెట్టి దేశమాత కోసం ఒక్కటవ్వాలి. ఒక్కటయ్యేందుకు ఆధారం మన మాతృభూమి. సకల దేవతల ప్రతిరూపమే మన భారతమాత. ఆ తల్లిని ప్రతిరోజు ఇలా ప్రార్థిద్దాం.

నమస్తే సదా వత్సలే మాతృభూమే
త్వయా హిందుభూమే సుఖవ్ వర్ధితోహమ్
మహామంగలే పుణ్యభూమే త్వదర్థే
పతత్వేష కాయో నమస్తే నమస్తే!!
       !!భారత్ మాతా కీ జయ్!!
( వాత్సల్యపూర్ణా! ఓ మాతృభూమీ! నేను నీకు ఎల్లప్పుడూ నమస్కరింతును. ఓ హిందుభూమీ నీ వల్లనే సుఖముగా వర్ధిల్లినాను. మహా మంగళ మయీ! ఓ పుణ్యభూమీ! నీ కార్యసాధనకై ఈ నా శరీరము సమర్పింపబడుగాక! నీకివే అనేక నమస్కారములు.  !!భారత మాతకు జయమగుగాక!! )

ఈ నాలుగు వరుసలు దేశంలోని ప్రతి ఒక్కరి గుండెల్లో ప్రతిధ్వనించాలి. దేశమంతటా మారుమ్రోగాలి. సామూహిక కార్యక్రమాలన్నింటా ఇది పాడుకుందాం. 
కలసి వాకింగ్ చేస్తున్నా, కలిసి వ్యాయామం చేస్తున్నా, కలిసి యోగా చేస్తున్నా, కలిసి ధ్యానం చేస్తున్నా, కలిసి పారాయణం చేస్తున్నా, కలిసి సమావేశం నిర్వహిస్తున్న ప్రతీ చోట ఈ నాలుగు వరుసలు మాతృభూమి గానాన్ని ఆలపిద్దాం. ధార్మిక సంస్థలు అయినా, స్వచ్చంద సంస్థలు అయినా, కమ్యూనిటీ కేంద్రాలు అయినా, కుల సంఘాలు అయినా, మత సంస్థలు అయినా.... దేశహితం కోరే ప్రతీ చోట దీనిని స్మరిద్దాం. ఎవరికి వారుగా వ్యక్తిగత స్వార్థ ఆలోచనలు పక్కనబెడుదాం! అందరినీ సమానంగా చూసే ఆ తల్లి సేవలో తరిద్దాం! మన జీవితాల్ని చరితార్ధం చేసుకుందాం! జై హింద్ ! -సాకి

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

3 comments

  1. భారత్మామాత కీ జై

    ReplyDelete
  2. భారత్ మాత కీ జై🚩🚩
    వందేమాతరం 🚩🚩
    జై హింద్🚩🚩🚩

    ReplyDelete
  3. భారత్ మాతకి జై 🇮🇳🇮🇳🇮🇳
    జై శ్రీరామ్,🚩🚩🚩🚩🚩
    🚩🚩🚩🚩🚩🚩🚩

    ReplyDelete