Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

తబ్లిగి జమాత్ అంటే ఏమిటి? పూర్తి వివరాలు - what tablighi jamaat in telugu

ఏమిటీ తబ్లిగి జమాత్‌:  అల్లా మాటలను బోధించేవారిని ‘తబ్లిగి’గా పిలుస్తారు. ‘జమాత్‌’ అంటే సంస్థ. ‘తబ్లిగి జమాత్‌’ అంటే అల్లా మ...

ఏమిటీ తబ్లిగి జమాత్‌: అల్లా మాటలను బోధించేవారిని ‘తబ్లిగి’గా పిలుస్తారు. ‘జమాత్‌’ అంటే సంస్థ. ‘తబ్లిగి జమాత్‌’ అంటే అల్లా మాటలను బోధించే సంస్థ. సమావేశ స్థలాన్ని మర్కజ్‌గా పేర్కొంటారు.
దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ‘తబ్లిగి జమాత్‌’ గురించే చర్చ. దిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో ఈ సంస్థ గత నెల్లో నిర్వహించిన మతపరమైన కార్యక్రమంలో రెండు వేల మందికి పైగా పాల్గొనడం.. అందులోని పలువురిలో కొవిడ్‌-19 లక్షణాలు బయటపడటం కలకలం సృష్టించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయుల్లో చాలామంది ఇప్పటికే తమ స్వరాష్ట్రాలకు వెళ్లడం.. వారిలో కొందరు మరణించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ‘తబ్లిగి జమాత్‌’ అంటే ఏంటి? దాన్ని ఎప్పుడు, ఎవరు ప్రారంభించారు? సంస్థ స్థాపన వెనుక లక్ష్యాలేంటి? అనే విషయాలను ఒకసారి పరిశీలిద్దాం.
త‌బ్లిగీ జ‌మాత్ మొద‌లు ఎప్పుడంటే
1927లో త‌బ్లిగీ జ‌మాత్ ఆందోళ‌న ప్రారంభ‌మైంది. హ‌ర్యానాలోని నుహూ జిల్లా నుంచి మౌలానా ఇలియాస్ కంద‌ల్వి ఈ ఉద్య‌మాన్ని మొదలుపెట్టారు. ముస్లింలు త‌మ ధ‌ర్మాన్ని కాపాడుకునేందుకు త‌బ్లిగి జ‌మాత్ ఉద్య‌మాన్ని ప్రారంభించారు. ఇస్లాంను ప్ర‌చారం చేయ‌డం, ఆ మ‌తానికి సంబంధించిన అంశాల‌ను తెలియ‌జేయ‌డం మొద‌లుపెట్టారు. మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తుల కాలంలో.. చాలా మంది ఇస్లాం మ‌తాన్ని స్వీక‌రించిన‌ట్లు తెలుస్తోంది. కానీ ఆ త‌ర్వాత వాళ్లంతా మ‌ళ్లీ హిందూ మ‌తాన్ని స్వీక‌రించ‌డం మొద‌లుపెట్టారు. బ్రిటీషు పాల‌న స‌మ‌యంలో ఆర్య స‌మాజం మతం మారిన వారిని శుద్దీక‌రించి హిందువులుగా స్వీక‌రించ‌డం ప్రారంభించింది. ఈ స‌మ‌యంలోనే త‌మ మ‌త ప్రాశ‌స్త్యాన్ని కాపాడుకునేందుకు మౌలానా ఇలియాస్ కంద‌ల్వి ఇస్లాం మ‌త ప్ర‌చారం మొద‌లుపెట్టారు.
ప్ర‌స్తుతం త‌బ్లిగీ జ‌మాత్ శాఖ‌లు ప్ర‌పంచ‌వ్యాప్తంగా 213 దేశాల్లో ఉన్నాయి. తబ్లిగీ జ‌మాత్ ముఖ్య కార్యాల‌యంలో ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో ఉంది. సుమారు 15 కోట్ల మంది ఈ సంస్థ‌లో స‌భ్యులుగా ఉన్నారు. 20వ శ‌తాబ్ధంలో ప్రపంచ‌వ్యాప్తంగా త‌బ్లిగీ జ‌మాత్ భారీ ఇస్లామిక్ ఉద్య‌మాన్ని చేప‌ట్టింది.
ఏటా భారీయెత్తున కార్యక్రమాలు
తబ్లిగి జమాత్‌ భారత్‌లోని పలు ప్రాంతాల్లో భారీయెత్తున మతపరమైన కార్యక్రమాలను నిర్వహిస్తుంటుంది. ఏటా భోపాల్‌లో నిర్వహించే కార్యక్రమానికి లక్షల మంది హాజరవుతుంటారు. దిల్లీ, మహారాష్ట్రల్లోనూ ఈ సంస్థ ఆధ్వర్యంలో భారీ కార్యక్రమాలు జరుగుతుంటాయి. దేశ విదేశాల నుంచి పలువురు హాజరయ్యేందుకు వీలుగా వాటి షెడ్యూలును దాదాపు ఏడాది ముందుగానే ఖరారు చేస్తుంటారు. నిజాముద్దీన్‌ మర్కజ్‌లో గత నెల్లో నిర్వహించిన ప్రార్థనలకు భారత్‌లోని పలు రాష్ట్రాలతోపాటు ఇండోనేసియా, మలేసియా తదితర దేశాల నుంచి కూడా పలువురు తరలి వచ్చారు.


ఆరోపణల మకిలి!: తబ్లిగి జమాత్‌పై 2011లో ‘వికిలీక్స్‌’ సంచలన ఆరోపణలు చేసింది. కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాతో దీనికి సంబంధాలున్నాయని ఆరోపించింది. ఉగ్రవాదులకు డబ్బు, వీసాలు దాని ద్వారా అందుతున్నాయని పేర్కొంది. వీటిని జమాత్‌ ప్రతినిధులు ఖండించారు. 2016లో అల్‌ఖైదాకు చెందిన ఓ ఉగ్రవాదిని దిల్లీ పోలీసులు హరియాణాలోని మేవాట్‌లో అరెస్టు చేశారు. అతడికి జమాత్‌తో సంబంధాలున్నట్లు వార్తలొచ్చాయి. హరియాణాలోని పల్వాల్‌లో తబ్లిగి జమాత్‌ సంస్థ మసీదు నిర్మాణాన్ని ప్రారంభించినప్పుడు కలకలం చెలరేగింది. పాక్‌ ఉగ్ర సంస్థ జవాత్‌-ఉద్‌-దవా అధినేత హఫిజ్‌ సయీద్‌తో సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి నుంచి సేకరించిన నిధులతో ఆ నిర్మాణం ప్రారంభమైందని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఆరోపించింది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

2 comments