మన కళ్ళు తయారుచేయబడ్డ విధానాన్నిబట్టి మన జీవితాల్లో వెలుగుకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఒకవేళ మన కళ్ళు గుడ్లగూబ కళ్ళలా ఉండి ఉంటే, వ...
మన కళ్ళు తయారుచేయబడ్డ విధానాన్నిబట్టి మన జీవితాల్లో వెలుగుకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఒకవేళ మన కళ్ళు గుడ్లగూబ కళ్ళలా ఉండి ఉంటే, వెలుగు మనకి అంత ముఖ్యమైంది అయి ఉండేది కాదు.
నేడు మనకు విద్యుద్దీపాలు ఉన్నాయి. కాబట్టి దీపం అవసరమేమిటి అని మనం అనుకోవచ్చు. కానీ కొన్ని సంవత్సారాల క్రితం సంగతిని ఊహించుకోంధాము, ఇంటి లోపల ఒక దీపం లేకుండా ఏమీ చేయలేము. చారిత్రాత్మకంగా దీపం ముఖ్యంగా రెండు కారణాల వలన మన గృహాలలో ఒక అంతర్భాగం అయింది. ఒకటి, అప్పుడు విద్యుద్దీపాలు లేవు. రెండు, ఇళ్ళు కలప, తాటాకు వంటి సేంద్రీయ పదార్ధాలతో నిర్మించుకునేవారు. అందువలన వారు పెద్ద పెద్ద కిటికీలను పెట్టుకోలేక పోయేవారు. సాధారణంగా, పురాతన కాలంలో ఇళ్ళలో బాగా చీకటిగా ఉండేది. నేడు కూడా పల్లెటూర్లలో పాత ఇళ్లు, మురికివాడలు చీకటిగా ఉండటం మనం చూస్తున్నాం, అందుకనే ఆ కాలంలో పగటి సమయంలో కూడా దీపం పెట్టి ఉంచేవారు, సాధారణంగా అదే పూజా స్ధలంగా ఉండేది.
సాంప్రదాయ పరంగా సరైన వాతావరణాన్ని సృష్టించడానికి చేసే మొదటి పని ఒక దీపాన్ని వెలిగించడం. కాకపోతే నేడు మనకు ఉన్న చాలా సమస్యల వలన మనము విద్యుద్దీపాలను వెలిగిస్తున్నాము. కానీ మనలో దీపాన్ని వెలిగించే అలవాటు ఉన్నవారు కేవలం దీపం చుట్టూ ఉండడం వల్ల ఎంతో తేడా అనిపిస్తుందని గమనించి ఉంటారు. మనం ఏ దేవుడినీ నమ్మనవసరం లేదు. చీకటిగా ఉండక పోయినా, చూడటానికి అవసరం లేకపోయినా, మనం దీపం వెలిగిస్తే కొంత తేడా ఉంటుందని గమనించవచ్చు. ఇది ఎందుకంటే మనం దీపం వెలిగించిన మరుక్షణం కేవలం ఆ జ్వాల మాత్రమే కాదు, ఆ జ్వాల చుట్టూ ఒక గుండ్రని కనిపించని చక్రం లాంటి శక్తి వలయం సహజంగా ఏర్పడుతుంది.
ఎక్కడ ఇలాంటి శక్తి వలయం ఉంటుందో అక్కడ మనుషుల మధ్య అన్యోన్యత, అనుబంధాలు బాగుంటాయి. మనం మన జీవితంలో ఎప్పుడైనా చలిమంట చుట్టూ మనం కనుక కూర్చుని ఉంటే, ఆ సమయంలో చెప్పుకునే కథల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. పాతకాలంలోనే, కథలు చెప్పే వాళ్ళు, దీన్ని అర్ధం చేసుకున్నారు. చలి మంట చుట్టూ చెప్పుకునే కథలు చాలా బలంగా మనస్సులో నాటుకు పోతాయి. వాటిని మనం చాలా సులభంగా గ్రహించగలుగుతాం.
కాబట్టి మనం ఏదైనా ప్రారంభించాలనుకుంటే, లేదా ఒక నిర్దిష్టమైన వాతావరణాన్ని సృష్టించాలనుకుంటే, ఒక దీపం వెలిగిస్తాం. ఒక దీపాన్ని వెలిగించినప్పుడు, అది దృశ్య పరంగానే కాకుండా, శక్తి పరంగా కూడా పూర్తి ప్రదేశాన్ని ఒక భిన్నమైన శక్తితో నింపుతుందన్న అవగాహన నుండి ఈ ఆచారం వచ్చింది. ఒక నూనె దీపాన్ని వెలిగించటంలో కొన్ని సూచనలు ఉన్నాయి. దీపాన్ని వెలిగించటానికి కొన్ని ప్రత్యేకమైన నూనెల వినియోగం ముఖ్యం. ప్రత్యేకించి నువ్వుల నూనె, ఆముదం లేదా నెయ్యి, ఒక అనుకూల శక్తిని వెలువరిస్తాయి. ఆ శక్తికి దాని స్వంత శక్తి క్షేత్రం ఉంటుంది.
అగ్ని పలు విధాలుగా వెలుగుకి, జీవితానికి మూలం. ప్రతీకాత్మకంగా, మనం అగ్నిని జీవితం యొక్క మూలంగా చూస్తాము. నిజానికి, మన జీవితమే అగ్ని అని చాలా భాషలలో ప్రస్తావిస్తారు. మనలోని అగ్నే మనం జీవించటానికి కారణం. సూర్యుడు, ఈ గ్రహం మీద జీవానికి మూలం. అతనొక ఒక అగ్ని గోళం. మనం ఒక విద్యుద్దీపాన్ని వెలిగించినా, స్టవ్ మీద వంట చేసినా, మన కారులోని ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్‌ని స్టార్ట్ చేసినా అది అంతా కూడా అగ్నే.ఈ ప్రపంచంలో జీవాన్ని నడిపేది అంతా కూడా అగ్నే. కాబట్టి అగ్నిని జీవానికి మూలంగా చూస్తాము. అది దాని చుట్టూ ఒక శక్తి క్షేత్రాన్ని సృష్టించుకుంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా అది మనకు అవసరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. కాబట్టి మనం మన రోజుని ప్రారంభించే ముందు దీపాన్ని వెలిగిస్తున్నారు అంటే మనం అదే నాణ్యతని, గుణాన్ని మీలోకి తీసుకు రావాలనుకుంటున్నారు. అది మన అంతర్గత స్వభావాన్ని ప్రేరేపించే ఒక విధానం.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
Your decor should not only look aesthetically pleasing but also serve a practical purpose. Console & Buffet Tables
ReplyDelete