అది 1923వ సంవత్సరం ఆనవాయితీ ప్రకారం జరిగి కాంగ్రెసు మహాసభలు ఆ సంవత్సరం కాకినాడలో జరిగాయి. దేశం నాలుగు మూలల నుండీ దిగ్గంతుల్లాంటి నాయక...
అది 1923వ సంవత్సరం ఆనవాయితీ ప్రకారం జరిగి కాంగ్రెసు మహాసభలు ఆ సంవత్సరం కాకినాడలో జరిగాయి. దేశం నాలుగు మూలల నుండీ దిగ్గంతుల్లాంటి నాయకులు వచ్చారు. వారితోపాటు కార్యకర్తలు కూడా ఎందరో వచ్చారు. అందరి రాకతో కాకినాడ కళ కళలాడింది. ఎక్కడ చూచినా జాతీయ జెండా రెపరెపలాడింది.
అందరికీ అన్ని ఏర్పాట్లు చేయటానికి కాకినాడలో ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేశారు. కాకినాడలో ఆనాటి ప్రముఖ నాయకులొకరు ఆ సంఘానికి కార్యదర్శి వచ్చిన వారికి ఏ కష్టమూ కలుగకుండా ఏర్పాట్లన్నీ చక్కగా చేయించాడు ఆయన. అందరితో ఆయన కలిసిపోయి, వారి వారి యోగక్షేమాలు కనుక్కునే వాడు ఎవరికి ఏ లోటు జరిగిందని తెలిసినా ఆ లోటు భర్తీ చేయించేవాడు. వచ్చిన నాయకులు ఏర్పాట్లను చూచి మెచ్చుకున్నారు. ఆహ్వాన సంఘ కార్యదర్శి గారు కార్యదీక్షను కొనియాడారు.
సభలు చక్కగా జరిగాయి. సభ ముగింపు సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేయాలిగదా? ఆ బాధ్యతను సరోజిని నాయుడు చేపట్టింది. ఆమె ప్రసంగం లో అంగవస్త్రధారి అయిన ఆహ్వాన సంఘ కార్యదర్శి గారు. గుండెల్లో ఎంతో దుఃఖాన్ని దాచుకొని కూడా మనకంతా సంతోషాన్ని పంచిపెట్టారు. అని అన్నది. దానితో సభలో కలకలం చెలరేగింది. ఏమో దుఃఖం అని వాకబు చేశారు కొందరు కార్యదర్శి గారి కుమారుడు సభలు జరిగే సమయంలోనే మరణించాడు. ఆ దుఃఖ వార్త బయటకు వస్తే సభ సరిగ్గా జరగదనుకున్నాడు ఆయన. పుట్టెడు దుఃఖాన్ని గుండెల్లోనే దిగమ్రింగుకున్నాడు. అందరికీ ఆనందాన్ని పంచిపెట్టాడు. కన్నకొడుకు కన్ను మూస్తే ఏ తండ్రికి బాధ ఉండదు. కాని కర్తవ్య నిర్వహణ కోసం బాధను దిగమింగాడు ఆయన.
గాంధీగారు అందుకనే ఆయనను మహర్షి అన్నారు. సభకు వచ్చిన వాళ్లంతా ఆయన్ను ఎంతో మెచ్చుకున్నారు. అంత దుఃఖాన్ని అణచుకొని అందరితో కలిసి మెలసి సభను నిర్వహించటమంటే మాటలు కాదు. అందుకు ఎంతో గుండె నిబ్బరం కావాలి. అలా గుండె నిబ్బరాన్ని చూపిన ఆయనే బులుసు సాంబమూర్తి గారు. రాజకీయాలకు సర్వస్వం ధారపోసిన మహనీయుడు.
ఇలాంటి చిన్న కథల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
No comments