ఇది దాదాపు డెబ్బై సంవత్సరాల నాడు జరిగిన సంఘటన. అప్పుడు పరిపాలన ఆంగ్లేయులది. మన దేశం లో డబ్బు వ్యవహారాలు చూడటానికి ఇండియన్ ఫైనాన్స్ అని ...
ఇది దాదాపు డెబ్బై సంవత్సరాల నాడు జరిగిన సంఘటన. అప్పుడు పరిపాలన ఆంగ్లేయులది. మన దేశం లో డబ్బు వ్యవహారాలు చూడటానికి ఇండియన్ ఫైనాన్స్ అని ఒక శాఖ ఉండేది. దాని తరపున అక్కౌంటెంట్ జనరల్ కార్యాలయాలు దేశమంతటా ఉండేవి. అలాంటి కార్యాలయం మహారాష్ట్రలోని నాగపూర్ లో కూడా ఒకటి ఉన్నది.
ఒకరోజు ఆ పుర ప్రముఖుడొకడు ఆ కార్యాలయానికి వచ్చాడు. అతడి దగ్గర వంద రూపాయల నోట్ల కట్ట ఉన్నది. అగ్ని ప్రమాదం జరిగి ఆ నోట్లన్నీ పొగపట్టి ఉన్నాయి. వాటి మీద వరుస సంఖ్యలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. అవి కార్యాలయంలో మార్చి కొత్తవి తీసుకోవాలని అతడి ఉద్దేశ్యం. కాని వాటికి బదులు ఇస్తారో లేదోనని అతడికి అనుమానం ఉన్నది. భయపడుతూనే ఆ కార్యాలయంలో ఉన్న అధికారికి చూపించాడు. ఆ స్థానంలో ఎవరయినా ఇంకొకరు ఉండి ఉంటే ఆ వ్యక్తి బయటకు దారి చూపించి ఉండేవారు.
కాని ఆ స్థానంలో ఉన్న అధికారి సౌమ్యుడు. ఆ వంద రూపాయల నోట్ల కట్ట తీసుకున్నాడు. భూత అద్దం తో నోట్లన్నీ పరిశీలించాడు. వాటి నెంబర్లన్నీ వరుసగా వ్రాసుకున్నాడు. కొత్త నోట్లు ఇవ్వమని కోశాధికారి కి చెప్పాడు, కోశాధికారి ఇది కూడదు అని వాదించాడు. కొత్తనోట్లు ఇవ్వనని నిరాకరించాడు. అయ్యా! కాలీకాలని ఈ నోట్ల మీద నెంబర్లు వివరంగానే ఉన్నాయి. మనం వీటికి కొత్త వాటిని ఇవ్వటం న్యాయం! అని ఆ అధికారి వాదించాడు.
కోశాధికారి చేసేది ఏమిలేక కొత్త నోట్లు ఇచ్చాడు. భయపడుతూ నోట్లు తెచ్చిన వ్యక్తి అధికారిని పొగుడుతూ సంతోషంగా వెళ్లిపోయాడు. దాని తరువాత ఈ సంఘటన చాలాకాలం చెప్పుకున్నారు. ఇలాగే తన దగ్గరకు వచ్చిన వారి సమస్యలను చక్కగా పరిశీలించి తగిన మేలు చేసేవాడు ఆ అధికారి. ఆయనే ప్రఖ్యాత భారతీయ విజ్ఞాన వేత్తగా పేరు పొందాడు ప్రపంచంలోనే అత్యున్నతమైన నోబెల్ బహుమానాన్ని సంపాదించాడు. ఆయనే సర్ సి.వి. రామన్.
ఇలాంటి చిన్న కథల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
No comments