కలకత్తా లో ఒక పేరు పొందిన హైకోర్టు జ డ్జ్ గారు ఉండేవారు. అయన చాలా నిరాడంబరుడు. ఉన్నత ఉద్యోగి అయినా గర్వం లేని వాడు, అందువలన ఆయనకు ఇటు ...
కలకత్తా లో ఒక పేరు పొందిన హైకోర్టు జడ్జ్ గారు ఉండేవారు. అయన చాలా నిరాడంబరుడు. ఉన్నత ఉద్యోగి అయినా గర్వం లేని వాడు, అందువలన ఆయనకు ఇటు ప్రజల లోనూ అటు ప్రభుత్వం లోనూ ఎంతో పలుకుబడి ఉండేది. ఆ రోజుల్లో మన దేశాన్ని ఆంగ్లేయులు పరిపాలిస్తూ ఉండేవారు.
ఆంగ్లేయుల రాజధాని అయిన లండన్ లో ఏడవ ఏడ్వర్డు పట్టాభిషిక్తుడు కాబోతున్నాడు. ఆ ఉత్సవం చూడటానికి ఆంగ్ల ప్రభుత్వం వారు. ఎందరో ప్రసిద్ధులను ఆహ్వానించారు. అటువంటి ఆహ్వానం ఆ ప్రముఖ జడ్జీగారికి వచ్చింది. ఆహ్వానం వచ్చిన కొంత సేపటికి గవర్నరుగారు కూడా వచ్చారు. మీరు తప్పకుండా లండన్ వెళ్లాలి. అక్కడ జరిగే ఉత్సవాన్ని చూడాలి! అన్నారు గవర్నర్ గారు. చాలా కృతజ్ఞుడిని ప్రసిద్ధ వ్యక్తి వినయంగా అన్నాడు.
ఇదినా కోర్కెకాదుసుమా! మన వైప్రాయిగారి కోర్కె అన్నాడు మళ్లీ గవర్నర్. చాలా.. చాలా.. కృతజ్ఞతలు కాని ఒక సందేహం. ఈ ప్రయాణానికి మా అమ్మ ఒప్పుకోవాలి! అన్నారు జడ్జిగారు ఆ రోజుల్లో హిందువులకు సముద్ర ప్రయాణం నిషేధం. అలా చేయటం పాప కార్యమని భావించేవారు. గవర్నర్ గారి లో చిరు కోపం కనిపించింది.
వైస్రాయి గారి ఆజ్ఞనే మీరు ధిక్కరిస్తున్నారా? అని అన్నారు. వైస్రాయి అయిన చక్రవర్తి అయినా మా అమ్మ తరువాతనే ఎవరైనా! అని అన్నారు ఎంతో వినయంగా జడ్జీ గారు ఆయన సందేహించినట్లుగానే వాళ్ల అమ్మగారు ఆయన ప్రయాణానికి ఒప్పుకోలేదు. ఆయన ఉత్సవం చూడటానికి లండన్ వెళ్లనూ లేదు. అమ్మ మాట మీద అంతటి అవకాశాన్ని జారవిడచుకున్నాడు ఆయన. ప్రముఖ విద్యావేత్తగా పరిగణించబడ్డాడు. ఆయనే డాక్టర్ అశుతోష్ ముఖర్జీ.
ఇలాంటి చిన్న కథల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
No comments