Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఎంత గొప్పవారైతే మాత్రం ఆహ్వాన పత్రం లేనిదే లోపలికి ఎలా పంపిస్తాను అన్న పిల్లాడెవరో తెలుసా? - megaminds - short stories in telugu

చాలా సంవత్సరాల క్రితం పూనాలో ఒక ఇంగ్లీషు పాఠశాల ఉండేది. దాని పేరు న్యూ ఇంగ్లీష్ స్కూల్. ఆ స్కూల్ లో ఒక రోజు ఒక ఉత్సవం జరుగుచున్న దీ కొం...


చాలా సంవత్సరాల క్రితం పూనాలో ఒక ఇంగ్లీషు పాఠశాల ఉండేది. దాని పేరు న్యూ ఇంగ్లీష్ స్కూల్. ఆ స్కూల్ లో ఒక రోజు ఒక ఉత్సవం జరుగుచున్నదీ కొందరు విద్యార్థులకు ఉత్సవ నిర్వహణలో కొన్ని పనులు అప్పగించారు. వాళ్లల్లో ఒక విద్యార్థికి స్కూలు ప్రధాన ద్వారం దగ్గర పనిపడింది. అక్కడ ఉండి లోనికి వచ్చే వారి దగ్గర ఆహ్వానపత్రం ఉన్నదీ లేనిదీ చూచి లోపలికి పంపించాలి.

ఆనాటి సభకు ప్రధాన అతిధి పూనాలోని ఒక ప్రసిద్ధ న్యాయమూర్తి. ఆయన ద్వారం దగ్గరకు రాగానే అయ్యా! మీ దగ్గర ఆహ్వాన పత్రం ఉన్నదా? అని విద్యార్థి అడిగాడు. న్యాయమూర్తి లేదు అని జవాబు ఇచ్చాడు. ఆ విద్యార్థి ఆయనను అటకాయించాడు. ఆహ్వాన పత్రం ఉన్నవారినే లోనికి పంపించాలి. అనే నియమం ఉన్నది. మీ దగ్గర అది లేదు. కాబట్టి మీరు లోనికి వెళ్లటానికి వీలు లేదు అని నిష్కర్షగా చెప్పాడు.

ఇంతలో పాఠశాల ఉపాధ్యాయుల దృష్టి ఆ న్యాయమూర్తి పైన పడింది. వారు ఆదరాబాదరాగా వచ్చి న్యాయమూర్తి గారిని సగౌరవంగా లోనికి తీసుకు వెళ్లారు. ద్వారం దగ్గరనున్న విద్యార్థి నియమం అంటే నియమమే! ఎంత గొప్పవారైతే మాత్రం ఆహ్వాన పత్రం లేనిదే లోపలికి ఎలా పంపిస్తాను అని ఇతరులతో అన్నాడు. ఆ న్యాయమూర్తి మహదేవ గోవింద రనడే!

ఆయన తన ఉపన్యాసంలో ఈ ఉదంతాన్ని చెప్పాడు. ఆబాలుడి నిజాయితీ. విధి నిర్వహణను మెచ్చుకున్నాడు. మంచి భవిష్యత్తు ఉంటుంది. అని ఆశీర్వదించారు. అలా నియమాన్ని పాలించి, న్యాయమూర్తి చేత ఆశీర్వదింపబడిన ఆ విద్యార్థి గోపాలకృష్ణ గోఖలే మహాత్మాగాంధీలాంటివారు ఆయనను రాజకీయ గురువుగా కీర్తించారు.

ఇలాంటి చిన్న కథల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments