ఆంగ్లేయులు మన దేశాన్ని పరిపాలిస్తున్న రోజులు అవి,ఉన్నత విద్యా సౌకర్యాలు లేవు, అందుకని యువకులు ఇంగ్లండు వెళ్ళి ఉన్నత విద్య ను అభ్యసించే...
ఆంగ్లేయులు మన దేశాన్ని పరిపాలిస్తున్న రోజులు అవి,ఉన్నత విద్యా సౌకర్యాలు లేవు, అందుకని యువకులు ఇంగ్లండు వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసించేవారు. అటువంటి యువకుడు ఒకడు లండన్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాల్లో చదివి రెండు డిగ్రీలు సంపాదించాడు.
భారతదేశం వచ్చి విద్యాశాఖలో ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. అతని ప్రయత్నాలు ఫలించి బెంగాల్ ప్రభుత్వ విద్యా శాఖలో ఉద్యోగం దొరికింది. ఆ వెంటనే అతడిని కలకత్తా లోని ప్రెసిడెన్సీ కాలేజీ లో ఫిజిక్స్ లెక్చరర్ గా చేశారు. ఆంగ్లేయులు తప్ప భారతీయులు విద్యాబోధనకు పనికిరాడని వారి అనుకొంటూ ఉండేవారు. అందుకని భారతీయులకు జీతాలు కూడా తక్కువ ఇచ్చేవారు.
అదే విధంగా కాలేజీ ప్రిన్సిపాల్ ఆ యువకుడికి తక్కువ జీతం ఇస్తానన్నాడు. ఆ! ఇంగ్లాండులో చదివి వచ్చినంత మాత్రాన భారతీయులు ఏం బోధించగలరు అని కూడా ఈసడించాడు. ఉద్యోగంలో చేరిన ఆ యువకుని మనస్సు చివుక్కుమంది. దేనిలోని తీసిపోని భారతీయులకు తక్కువ జీతం ఎందుకో అర్ధం కాలేదు. అతడు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆంగ్లేయులతో సమానంగా జీతం ఇచ్చేంతవరకూ అసలు జీతమే తీసుకోగూడదనుకున్నాడు.
నేను తీసుకుంటే పూర్తి జీతమే తీసుకుంటాను, లేకుంటే అసలే తీసుకోని. అని పట్టుబట్టాడు. అలా ఒక నెల రెండు నెలలు కాదు, మూడు సంవత్సరాలు జీతం తీసుకోలేదు. విద్యార్థులకు పాఠాలు చక్కగా చెప్పటంలో పేరు సంపాదించాడు. దానితో విద్యాశాఖ డైరక్టరు. కాలేజీ ప్రిన్సెస్ దిగివచ్చాడు. మొదటి మండీ ఆంగ్లేయులతో పాటుగానే జీతం ఇవ్వటానికి ఒప్పుకున్నారు. మూడు సంవత్సరాలకు రావలసిన మొత్తాన్ని అతడికి చెల్లించారు. పట్టుదలతో కార్యాన్ని సాధించాడు ఆ లెక్చరర్, అతడే ప్రముఖ శాస్త్రవేత్త ఆచార్య జగదీశ్ చంద్రబోస్.
ఇలాంటి చిన్న కథల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
No comments